ఆరేళ్ల ఆరాటం..అలుపెరుగ‌ని పోరాటం

నచ్చితే షేర్ చేయ్యండి

సిక్స‌ర్ల వీరుడు యువ‌రాజ్ సింగ్…క‌ట‌క్ వ‌న్డేలో ఇంగ్లండ్ పై సెంచ‌రీ చేయ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. తొలి వ‌న్డేలో కోహ్లీ, జాద‌వ్ సెంచ‌రీలు చేసిన‌ప్పుడు కూడా అభిమానులు ఈరేంజ్ లో ఎంజాయ్ చేసి ఉండ‌రు..దానికి కార‌ణం యువీనే…ఈ పంజాబ్ పుత్త‌ర్ అంటే ప‌డిచ‌చ్చే ఫ్యాన్స్ కోకొల్ల‌లు. అత‌డు జ‌ట్టులోకి తిరిగి రావాల‌ని వాళ్లంతా ఎప్ప‌టి నుంచో కోరుకున్నారు. అనుకున్న‌ట్టుగానే బౌన్స్ బ్యాక్ అయిన యువీ శ‌త‌కంతో త‌న రీ ఎంట్రీని మొద‌లుపెట్టాడు.

నిన్నా…మొన్నా..ఎన్నో రోజులైంది యువీ సెంచ‌రీని క‌ళ్ల‌చూడ‌క‌…2011లో చివ‌రిసారిగా శ‌త‌కం న‌మోదు చేసిన యువీ, ఆరేళ్ల త‌ర్వాత ఇప్పుడు సెంచ‌రీ సాధించాడు. వ‌న్డేల్లో యువీకి ఇది 14వ సెంచ‌రీ. ఇంగ్లండ్ పై నాలుగోది. ఇక క‌ట‌క్ స్టేడియంలో యువీ సాధించిన తొలి సెంచ‌రీ ఇదే కావ‌డం విశేషం. త‌న‌కు క‌లిసొచ్చిన 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి సెంచ‌రీ చేయ‌డం ఇది ఆరోసారి.

98 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో సెంచ‌రీ పూర్తి చేసిన యువ‌రాజ్…సింగ్ ఈజ్ బ్యాక్ అని చెప్ప‌క‌నే చెప్పాడు. యువీ ఎన్నో గొప్ప ఇన్నింగ్సుల‌కు సాక్షిగా నిలిచిన మ‌హేంద్ర‌సింగ్ ధోని…ఈసారి కూడా నాన్ స్ట్రైక‌ర్ ఎండ్ లో ఉండి యువీ సెంచ‌రీని ఆస్వాదించాడు. ఇలాగే ముందుకు సాగిపో అంటూ ప్ర‌శంసించాడు. అంతేకాదు ధోనితో క‌లిసి యువ‌రాజ్ సింగ్ వంద ప‌రుగుల‌కు పైగా భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డం ఇది ప‌దోసారి.

ఇక ఈ సెంచ‌రీతో యువీ విమ‌ర్శ‌కులు నోళ్లుకూడా మూయించాడు. తాను ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల మీద జ‌ట్టులోకి రాలేద‌ని, క‌ఠోరంగా శ్ర‌మించి రీ ఎంట్రీ ఇచ్చాన‌ని నిరూపించాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts