ఈడెన్‌లో క‌న్నీటిప‌ర్యంత‌మైన యువీ

నచ్చితే షేర్ చేయ్యండి

క‌ట‌క్‌లో అద్భుత‌మైన సెంచ‌రీతో స‌త్తాచాటిన యువ‌రాజ్ ఈడెన్ గార్డెన్స్‌లోనూ మెరుగైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. ఆరంభంలో తీవ్రంగా ఇబ్బందిప‌డ్డ యువీ, త‌ర్వాత మెరుగైన షాట్ల‌తో అల‌రించాడు. ఓవ‌రాల్‌గా 57బంతుల్లో 7ఫోర్లు, భారీ సిక్స‌ర్‌తో 45ప‌రుగులు చేశాడు. మ‌రోసారి భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన యువీ వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. తీవ్ర నిరాశ‌తో వెనుదిరిగిన యువ‌రాజ్‌, లాస్ట్ ఓవ‌ర్స్‌ను చాలా ఉత్కంఠ‌తో చూశాడు. జాద‌వ్ ఇన్నింగ్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు.

అలాంటి యువ‌రాజ్ సింగ్‌….ఇంగ్లండ్ బౌల‌ర్ జేక్ బాల్ వేసిన ప‌దో ఓవ‌ర్ మూడో బంతిని యువీ ఆప‌బోయాడు. అయితే, అది ఉహించ‌కుండా యువీ ప‌క్క‌టెముకుల‌కు తాకింది. దీంతో త‌ల్ల‌లాడిన యువీ, బ్యాట్‌ను ప‌క్క‌న ప‌డేసి దూరంగా వెళ్లాడు. చాలా సేపు అలాగే ఉండిపోయాడు. బాధ‌ను త‌ట్టుకోలేక విల‌విల‌లాడాడు. అంపైర్ వ‌చ్చి యువీని ఇంజ్యూరీపై ఆరా తీశాడు. కోహ్లీ కూడా వెంట‌నే యువీని చేరుకోని విష‌యం తెలుసుకోని ఫిజియోను పిలిచాడు.

కొంత సేపు బ్రేక్ తీసుకున్న త‌ర్వాత యువీ బ్యాటింగ్‌ను కొన‌సాగించాడు. అయితే, బంతి త‌గ‌ల‌డంతో తీవ్ర ఇబ్బందికి గురైన యువీని చూసి ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వాళ్లు కూడా యువీకి ఏమైంద‌ని కంగారుప‌డ్డారు. త‌ర్వాత తేర‌కున్న యువీ అంద‌రికి బౌండ‌రీల‌తో క్షేమంగానే ఉన్న‌ట్టు స‌మాచారం అందించాడు. ఈ మ్యాచ్‌లో అర్థ‌సెంచ‌రీని చేజార్చుకున్నా యువ‌రాజ్ సింగ్ మాత్రం అదిరే ఆట‌తీరుతో ఫ్యాన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసి టీట్వంటీ సిరీస్‌పై ఆశ‌లు పెంచాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts