పీట‌ర్స‌న్‌పై పేలిన యువీ ట్వీట్‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్, ప్ర‌జెంట్ ఐపీఎల్ కామెంటేట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్‌పై యువ‌రాజ్ సింగ్ సెటైర్ వేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వీరిద్ద‌రూ క‌లిసి చేసిన ట్వీట్స్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశాయి. ఈ పోటీలో యువీనే గెలిచినా…కేపీ ట్వీట్స్ కూడా అభిమానుల‌ను అల‌రించాయి. ఐపీఎల్ పుణ్య‌మా అని దేశ‌, విదేశీ ప్లేయ‌ర్స్ క‌లిసి ఆడ‌టం చూసిన ఫ్యాన్స్‌కు, ఇలాంటి ట్వీట్ వార్ కూడా ఆక‌ట్టుకుంటుంది.

ఏప్రిల్ 10న యెల్లో క‌ల‌ర్ సాక్స్‌లో చాలా అందంగా ఉన్నావ్, అంతా కుశ‌ల‌మే అనుకుంటా అని పీట‌ర్స‌న్‌ను ఉద్దేశించి యువీ ట్వీట్ చేశాడు. దీనికి స‌మాధానంగా నిన్ను ప్రేమిస్తా కానీ, నీ బౌలింగ్‌ను కాద‌ని పీట‌ర్స‌న్ రీట్వీట్ చేశాడు. దీనికి త‌న‌దైన స్ట‌యిల్లో కౌంట‌రిచ్చాడు యువీ. స‌ర‌దాస‌ర‌దాగా జ‌రిగిన ట్వీట్స్ ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. అంతేకాదు…ఇది చాలా బాగుంది గురూ అంటూ వీరిద్ద‌రికి కితాబిచ్చారు.
యువీ, కేపీ ట్వీట్ వార్ క్రింద ఇవ్వ‌బ‌డిన‌ది గ‌మ‌నించ‌గ‌ల‌రు

yuvi kp tweet


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts