యువీ కొడితే అదొలా కాదు..ఇలాగే ఉంటది

నచ్చితే షేర్ చేయ్యండి

కొంద‌రు కొడితే రికార్డ్‌లు బ‌ద్ద‌ల‌వుతాయి..ఇంకొంద‌రు కొడితే రికార్డ్‌లు క్రియేట్ అవుతాయి. కానీ..యువీ కొడితే ఇలాగే ఉంట‌ది. అదొలా, ఇదొలా కాకుండా ఇలాగే ఉంట‌ది. ప్ర‌తి ఒక్క క్రికెట్ అభిమాని యువ‌రాజ్ కొట్టాడురా…రీ ఎంట్రీని రీరికార్డింగ్ సౌండ్‌తో చాటాడురా..అంత‌కుమించిరా..అనేలా డిబేట్ పెట్టుకునేలా చేస్తుంది. అస‌లు..ఆడ‌టం అంటే ఇలాగే, దంచికొట్ట‌డం అంటే కూడా ఇలాగే..ఇంకా దుమ్మురేపి, ద‌మ్ముచూప‌డం అంటే కూడా ఇలాగే అనేలా ఆట అల‌రించిపోతుంది.

ధోనీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న వెంట‌నే యువీ టీమ్‌లోకి వ‌స్తే, కోహ్లీ ద‌య అన్న‌వాళ్లు సైతం..క‌ట‌క్ దండ‌యాత్ర చూశాకా అన్నీ మూసుకోని చేతులు తెరిచిమ‌రీ కొట్టారు చప్ప‌ట్లు. బ్యాట్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు బంతిని బాదుతుంటే, అలుప‌న్న‌ది లేద‌న్న‌ట్టు, నువ్వు కొడితే అస‌లు రాద‌న్న‌ట్టు బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌రికి దూసుకెళ్లింది. ఆడియెన్స్ విజిల్స్ వేసేలా గాల్లో తేలుతూ వారికి హాయ్ చెప్పింది.

శాత‌క‌ర్ణిలో బాల‌య్య చెప్పిన‌ట్టు ప్ర‌త్య‌ర్థిని గుర్రానికి గంత‌లు క‌డితే సీన్ ఎలా ఉంటుందో, అచ్చంగా అలాగే యువీ కొట్టే షాట్ ఏ బాల్‌కు ఎటు వెళ్తుందో తెలియ‌క తిక‌మ‌క ప‌డ‌ట‌మే కాదు క‌న్‌ఫ్యూజ‌న్‌లో బౌల‌ర్ పూర్తిగా డీలాప‌డేలా చేసేసింది. ఇంకా చెప్పాలంటే, ఖైదీ నెంబ‌ర్ 150లో ఎలా ఉన్నాన్‌రా అని చిరు అడిగితే, అలాగే ఉన్నావ్ అని అలీ చెప్పిన‌ట్టు, యువ‌రాజ్ చిచ్చ‌రపిడుగ‌లా చెల‌రేగి ఇన్నింగ్స్ ఆడుతుంటే, ఫ్యాన్స్ అంతా నువ్వు మార‌లేదు, నీ బ్యాట్ రూట్ త‌ప్ప‌లేదు అంటూ కేరింత‌లు కొడుతూ, అత‌ని నామ‌స్మ‌ర‌ణ చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేశారు.

ఫ‌స్ట్ బాల్ నుండి ఔట‌య్యే బాల్ వ‌ర‌కు యువ‌రాజ్ ఒకేలా ఆడాడు. అంత‌కుమించి ఒకేలా కొట్టాడు. అటు ఇటు అని లేదు, ఎటు వైపు బాల్ వ‌స్తే, అటువైపు అద్ద‌ర‌గొట్టాడు. ధోనీ వ‌ల్లే నువ్వు జ‌ట్టుకు దూర‌మ‌య్యావ్ అని నాన్న చెప్పిన మాట‌లు ఒట్టివే అన్న‌ట్టు, అత‌నితోనే క‌లిసి మ‌హేంద్ర లేట్స్ డు కుమ్ముడు అంటూ దంచికొట్టాడు. చాంపియ‌న్‌కి చిర్రెత్తుకొస్తే బంతి ఒళ్లు హునం కావ‌డం, బ్యాట్‌కు 1000వొల్ట్స్ ఎన‌ర్జీ రావ‌డం ఒకేసారి జ‌రిగ‌పోతుంద‌న‌డానికి ఈ ఇన్నింగ్సే ఫ‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌.

యువ‌రాజ్ ఆరేళ్ల తర్వాత సెంచ‌రీ కొట్టాడు. మూడేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి వ‌చ్చాడు. 10యేళ్ల త‌ర్వాత ధోనీతో క‌లిసి సుధీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి యువీ రాబోయే రోజుల్లోనూ హాట్‌పెంచే ప్లేయ‌ర్‌. ఆట‌తో హీట్‌ను పుట్టించ‌డ‌మే కాదు, స్మైల్‌తో స్ట‌యిలింగ్ ఇన్నింగ్స్‌తో చించేయ‌గ‌ల స‌మ‌ర్థుడు కూడా. అందుకే యువ‌రాజ్ బాస్ ఈజ్ బ్యాక్ అనే క్యాప్ష‌న్ క‌న్నా…డిజే బ్రావో స్ట‌యిల్‌లో చాంపియ‌న్‌, చాంపియ‌న్ అనే పాట‌కు మాట‌కు, ట్యాగ్‌లైన్‌కు ఫ‌ర్‌ఫెక్ట్ సూట‌య్యే ప్లేయ‌ర్‌.

వెంక‌ట్ రేగ‌ళ్ల‌
సీనియ‌ర్ స్పోర్ట్స్ క‌ర‌స్పాండెంట్‌
న్యూస్ టెలివిజ‌న్ అవార్డ్ గ్ర‌హీత‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts