ఐపీఎల్ వేళ‌…వార్న‌ర్ స‌రికొత్త రాగం

నచ్చితే షేర్ చేయ్యండి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప‌దో ఎడిష‌న్ స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కు అభిమానుల సంఖ్య పెర‌గ‌డ‌మే కాదు..లీగ్ పాపులారిటీని పెంచేస్తుంది. ఇలాంటి లీగ్‌ను వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియ‌న్ ప్లేయ‌ర్సే డామినేట్ చేస్తున్నారు. మ‌న ప్లేయ‌ర్స్ ఉన్నా..వారి దూకుడితోనే క‌లిసి ముందుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి టైమ్‌లో ఆసీస్ ఓపెన‌ర్‌, స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఆసక్తిక‌ర కామెంట్స్ చేశాడు.

భార‌త జ‌ట్టులోని ప్ర‌తి క్రికెట‌ర్ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని వార్న‌ర్ చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా ముగిసిన భార‌త్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లో స్లెడ్జింగ్ ఎంత‌లా హీట్ పెంచిందో అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి సీన్స్‌లో ఆసీస్ కాస్త దూకుడు ప్ర‌ద‌ర్శించింది. వార్న‌ర్ కూడా నోరు పారేసుకున్నాడు. అయితే, లీగ్ ఇండియాలో జ‌రుగుతుండ‌టం, అదే టైమ్‌లో ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ ఉన్న జ‌ట్టును లీడ్ చేస్తుండ‌టంతో వార్న‌ర్ ఇలా రూట్ మార్చాడు.

ఆన్ ద ఫీల్డ్‌లోకి దిగిన‌ప్పుడు భావోద్వేగాల‌ను కంట్రోల్ చేసుకోలేమ‌ని, అలా చేయ‌డం కూడా కంట్రీ కోస‌మేన‌న్నాడు. భార‌త్‌, ఆస్ట్రేలియా ఆడుతుంటే అభిమానులు ఆట‌తో పాటు మాట‌ల‌ను కూడా కావాల‌నుకుంటార‌ని, అలాంటివి అందించడంలో రెండు జ‌ట్లు పోటీప‌డ్డాయ‌న్నాడు. స్ఫూర్తివంత‌మైన ఆట‌ను ఫ్యాన్‌కు అందించ‌డ‌మే అంతిమ ల‌క్ష్య‌మ‌న్న వార్న‌ర్‌, ఐపీఎల్‌లో భార‌త క్రిక‌ట‌ర్ల‌తో క‌లిసి భుజం భుజం క‌లుపుతూ ఆట‌ను ఎంజాయ్ చేస్తున్నామ‌న్నాడు.
మొత్తంగా..వార్న‌ర్‌, సిచ్యువేష‌న్‌కి త‌గ్గ‌ట్టుగా అదిరే డైలాగ్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts