ఉప్ప‌ల్ స్టేడియంలో వార్న‌ర్ కామెడీ షో…

నచ్చితే షేర్ చేయ్యండి
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ కాసేపు న‌వ్వుల మాస్ట‌ర్‌గా మారిపోయాడు. ఛేజింగ్‌లో ఓ ప‌క్క చిచ్చ‌ర‌ప‌డుగులా చెల‌రేగుతూనే, మ‌రో ప‌క్క ల‌య‌న్స్ ప్లేయ‌ర్స్ మూడ్‌ను కూడా కూల్ చేశాడు. భారీ షాట్లు కొట్ట‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డ‌ట్టు క‌నిపిస్తూనే న‌వ్వించిన వార్న‌ర్‌, వికెట్ల మ‌ధ్య ప‌రిగెత్తే టైమ్‌లో బౌల‌ర్ల‌తో స‌ర‌దాగా బిహేవ్ చేస్తూ ఆక‌ట్టుకున్నాడు.
వార్న‌ర్ తీరుతో న‌వ్వులే న‌వ్వులు…
డేవిడ్ వార్న‌ర్ వ‌రుస‌గా బౌండ‌రీలు కొడుతూ వార్‌ను వ‌న్‌సైడ్ చేశాడు. ఈ టైమ్‌లో ఓ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి వార్న‌ర్ క్రింద‌ప‌డ్డాడు. ఆ టైమ్‌లో అత‌ని రియాక్ష‌న్స్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ త‌ర్వాత అత‌ను కూడా న‌వ్వుతూ బౌల‌ర్‌ను ఎంక‌రేజ్ చేశాడు.
ప‌రుగు తీస్తూ..బౌల‌ర్‌కు షూలేస్ క‌డుతూ….
వార్న‌ర్ ధ‌వ‌ల్ కుల‌క‌ర్ణి బౌలింగ్‌లో సింగిల్ తీసే టైమ్‌లో, బౌల‌ర్ షూలేస్ ఊడిపోవ‌డంతో వెంట‌నే మ‌ధ్య‌లో ఆగి అత‌నికి లేస్ క‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ లోగా ఫీల్డ‌ర్ బంతిని కీప‌ర్ వైపు త్రో చేయ‌డంతో, క్రీజులోకి ప‌రిగెత్తాడు. ఈ తీరుతో ఫ్యాన్స్ కేరింత‌లు కొట్టారు. వార్న‌ర్ స‌మ‌యస్ఫూర్తికి ఫిదా అయిపోయారు. ఈ సీన్స్ చూసిన ఆ టీమ్ కోచ్ టామ్ మూడీ న‌వ్వు ఆపుకోలేక‌పోయాడు.
మొత్తంగా…వార్న‌ర్ ఈ మ్యాచ్‌లో అటు బ్యాట్స్‌మెన్‌గా హాఫ్‌సెంచ‌రీని, ఇటు హ్యూమ‌రిజాన్ని చాటి సండే ఫైట్‌లో వార్న‌ర్ ఒకే ఒక్క‌డిగా నిలిచాడు. ఫ‌న్నీ మూమెంట్స్‌ను అంద‌రికి అందంచి స్టార్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు.

నచ్చితే షేర్ చేయ్యండి

Related posts