టీమిండియా ఓడిపోయినా నో ప్రాబ్ల‌మ్ కానీ…

india kl rahul copy
నచ్చితే షేర్ చేయ్యండి

ఔను, మ‌న జ‌ట్టు ఎప్పుడూ గెల‌వాల‌ని నేను కోరుకోను. ఆ మాట‌కొస్తే ఓడిపోవాల‌ని ఆశించ‌ను. కానీ, ఈ రెండింటిని తెలియ‌జేసే ఫైటింగ్ స్పిరిట్ అనేది ఒక‌టి ఉంటుంది క‌దా, రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా భ‌లే ఫైట్ చేశారురా అనుకునే మాట అది మాత్రం అంద‌రి నోట విన‌బ‌డాలి. అంతేకాదు..
ఎంత‌సేపు ప‌క్కొడిని తిప్ప‌డం కాదు..మ‌న‌మూ కూడా తిరుగుతున్నాం, వాళ్లు తిప్పేస్తున్నారు అనే ఆలోచ‌న‌లోకి రావాలి. ఇంట్లో కాల‌ర్ ఎగ‌రేయ‌డ‌మే కాదు లుంగీ లేకుండా కూడా డ్యాన్స్ చేస్తాం..అదే రోడ్డు మీద గుడ్డ ముక్క ప‌క్క‌కు జ‌రిగినా అవ‌మానంగా ఫీల‌వుతావు. ఇప్పుడు కావాల్సింది అదే..గుడ్డ ముక్క కూడా ప‌క్క‌కు జ‌ర‌గ‌కుండా కాల‌ర్ ఎగ‌రేయ‌డం.

తొలి టెస్ట్‌లో ఓడిన‌ప్పుడు అంద‌రూ పిచ్‌ను తిట్టారు. క్యూరేట‌ర్‌పైన కారాలు, మిరియాలు నూరారు. ఆ మ్యాచ్‌లో ఓకీఫ్‌ వికెట్లు తీస్తే బై ల‌క్ అన్నారు. కానీ..మ‌నోళ్లు ఆడిన షాట్లు ఎంత చెత్త‌గా ఉన్నాయో ఎవ‌రూ మాట్లాడ‌లేదు. ఎంద‌కంటే, అంద‌రి దారి ఒక్క‌టే, మాట‌, విధానం మ‌రొక్క‌టే, ఆసీస్ విజ‌యాన్ని త‌క్కువ చేయ‌డం. కానీ, కోహ్లీ మాత్రం ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టే రెండో టెస్ట్‌కు జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్‌తో బ‌రిలోకి దిగాడు. పిచ్ గురించి కంటే, ఆసీస్ బ‌లం గురించి తెలుసుకోని బ‌రిలోకి దిగాడు.

రెండో టెస్ట్ తొలి రోజు మ‌న జ‌ట్టు సాధించిన స్కోర్లు చూస్తే నిజంగా కంగారుపెట్టేయే. ఎవ‌రైనా ఒత్తిడిలోకి నెడితే, ప్రెజ‌ర్ కుక్క‌ర్ బ‌ట‌న్‌లా పైకి రావాల‌నే చిన్న కాన్సెప్ట్ మ‌ర‌చిపొయి వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు. అస‌లు, ఇలా రావ‌డం అలా క్యాచ్ ఇచ్చి అలాగే వెళ్ల‌డం చూస్తే, ఆసీస్ ఎంత చక్క‌గా మైండ్‌గేమ్ ఆడిందో అర్థం చేసుకోవ‌చ్చు. తొలి రోజుతోనే ఆసీస్ పైచేయి సాధించింది. ఇదే తీరు మిగిలిన రోజుల్లో ఉంటుందో లేదో ఇప్పుడే చెప్ప‌డం తొంద‌ర‌పాటే. కానీ, మాన‌సికంగా మ‌న‌వాళ్లు ఎదురుదాడికి దిగ‌డానికి సిద్ధంగా లేర‌న్న‌ది మాత్రం నిజం.

మొన్న ఓకీఫ్‌, ఇవాళ ల‌య‌న్‌..రేపు ఇంకొక‌రు ఎవ‌రైతేనేం…మ‌న బ్యాట్స్‌మెన్ మెంట‌ల్‌గా డిస్ట్ర‌బ్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా..ఎదురుగా ఉంది కంగారూ…కంగారుపెట్ట‌డ‌మే కాదు సిరీస్‌ను తీసుకెళ్లిపోవ‌డం గ్యారెంటీ. అందుకే, తొలి మ్యాచ్ ఓట‌మి నుంచి, రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ నుంచి భార‌త్ నేర్చుకోవాల్సింది ఒక్క‌టే ఎటాక్ అండ్ రీఎటాక్‌. అప్పుడే, ఆస్ట్రేలియా హాడ‌లెత్తుతుంది, మ‌నోళ్లు మ్యాచ్‌లో పైచేయి సాధిస్తారు. లేక‌పొతే….టెస్ట్‌ల్లో నెంబ‌ర్ వ‌న్ టీమ్ అస‌లైన క‌థ ఇప్పుడే మొద‌లైన‌ట్టు.

వెంక‌ట్ రేగ‌ళ్ల‌
సీనియ‌ర్ స్పోర్ట్స్ క‌ర‌స్పాండెంట్‌
న్యూస్ టెలివిజ‌న్ అవార్డ్ గ్ర‌హీత‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts