తాహీర్‌పై భార‌త అభిమాని జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు ..!

నచ్చితే షేర్ చేయ్యండి

సౌతాఫ్రికా లెగ్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహీర్‌పై నాల్గో వ‌న్డే సంద‌ర్భంగా ఓ అభిమాని జాతివివ‌క్ష వ్యాఖ్య‌లు చేశాడ‌నే వార్త‌లు ఇప్పుడు హాట్‌హాట్‌గా మారాయి. టీమ్‌లో 12వ ఆట‌గాడిగా ఉన్న తాహీర్‌, ప్లేయ‌ర్స్‌కు బ్రేక్ టైమ్‌లో వాట‌ర్ బాటిల్స్ అందించేందుకు వెళ్తుండ‌గా ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలుస్తోంది. ప‌లుమార్లు గ్రౌండ్‌లోకి వెళ్లే టైమ్‌లో, ఓ అభిమాని ప‌దే ప‌దే జాతి వివ‌క్ష వ్యాఖ్య‌ల‌తో ఇబ్బందిపెట్టాడ‌ని తాహీర్, స‌ఫారీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాడు.

అస‌లేం జ‌రిగింది…?

12వ ఆట‌గాడిగా ఉన్న తాహీర్‌, ప్లేయ‌ర్స్‌కు వాట‌ర్ ఇచ్చి వ‌చ్చే టైమ్‌లో, ఇద్ద‌రు జాతివివ‌క్ష కామెంట్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. తాహీర్‌, ఫిర్యాదుపై విచార‌ణ చేప‌ట్టిన స‌ఫారీ టీమ్‌, అవి నిజ‌మేన‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రిలో ఒక‌వ్య‌క్తి భార‌తీయుడ‌ని, అత‌నే అన‌వ‌స‌రంగా నోరుపారేసుకున్న‌ట్టు స‌ఫారీ మీడియా చెబుతోంది. గ‌తంలోనూ ఇలాంటి అనుభ‌వం తాహీర్‌కు ఎదురైంది. అయితే, మ‌ళ్లీ అలాంటి సంఘ‌ట‌నే రిపీట్ కావ‌డం తాహీర్‌ను ఇబ్బందిపెట్టిన‌ట్టు స‌ఫారీ మీడియా మేనేజ‌ర్ చెప్పాడు.

సొంత ఊరు పాకిస్తాన్‌

ఇమ్రాన్ తాహీర్‌ది నిజానికి సొంతూరు పాకిస్తాన్‌ది. అయితే, ప్రేయ‌సి కోసం, ప్రేమ‌ను పెళ్లిగా మార్చుకునేందుకు అత‌ను…సౌతాఫ్రికాకు వెళ్లాడు. అయితే, మొదటి నుంచి క్రికెట్‌పై ఆస‌క్తి ఉన్న అత‌ను, స‌ఫారీ టీమ్‌కు ఎంపికై అప్ప‌ట్లో అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు. ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో కూడా మేటి అనిపించుకున్నాడు. అయితే, ఆఫ్ ద ఫీల్డ్‌లో దూకుడిగా ఉండే తాహీర్‌, ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం కాస్త కంగారుపెట్టే విష‌యం.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts