ఆడితో జాగ్ర‌త్త‌రా స్మిత్తూ…ఆటాడేసుకుంటాడు

నచ్చితే షేర్ చేయ్యండి

కొంద‌రికి తిక్క‌రేగ‌లేమో…నాకు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంట‌ది…డైలాగ్‌లో మీనింగ్ వెతికేలోపే, చెప్పిన ఫోర్స్‌తోనే ఆ ప‌వ‌రెంటో అర్థ‌మైపోతుంది. అంత‌లా మాస్‌ను క‌ట్టిప‌డేస్తుంది..క్లాస్‌ను క‌వ్విస్తుంది. ఇప్పుడు ఇలాంటి పంచే..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌కిచ్చాడు. మాములుగా కాదు..మైండ్ దొబ్బి అలా మాట్లాడాను అని చెప్పినా స‌రే, సోది చెప్ప‌కు, నీ స్టోరీ అంతా తేలుస్తా అని చెప్పాడంటే, మ‌నోడికి ఎంత‌లా కాలిందో తెలిసిపోతుంది.

యూడీఆరెస్ అంటేనే, గ్రౌండ్‌లోనే ఉన్న అంపైర్ నిర్ణ‌యాన్ని థర్డ్ అంపైర్‌తో స‌వాల్ చేయ‌డం. అలాంటి సిస్ట‌మ్‌ను, డ్రెస్సింగ్ రూమ్ ప‌ద్ద‌తిగా మార్చేసింది ఆస్ట్రేలియా. ఆన్ ద ఫీల్డ్‌లో ఔటైతే…డ్రెస్సింగ్ రూమ్‌లో ఔటో కాదో అని అడిగి, అంపైర్‌ను రివ్యూకోరుతున్నారంటే, ఆసీస్ ఎంత‌లా దిగ‌జారిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ తీరునే ప్ర‌శ్నించాడు కోహ్లీ. మూడు రోజుల నుంచి గ‌మ‌నించి మ‌రీ, కంగారూల న‌క్క‌తెలివితేట‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

కోహ్లీ..ఆన్ ద ఫీల్డ్‌లో ఆసీస్ ఓట‌మిని పూర్తిగా అస్వాదించ‌డ‌మే కాదు..ప్రెస్‌మీట్‌లో ఆసీస్ తీరును, కెప్టెన్ స్మిత్‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డాడు. తాను ఔటైన టైమ్‌లో స్మిత్ ఏమ‌న్నాడో వీడియో చూడండి అని జ‌ర్న‌లిస్ట్‌కు స‌మాధాన‌మిచ్చాడు. తాను, స్మిత్‌ను ఏమ‌న్నానో చెప్ప‌నంటూనే, అత‌ని తీరును ఏ మాత్రం క్ష‌మించేది లేద‌న్నాడు. అస‌లు, ఇలాంటి వ్య‌క్తులు ఎలా క్రికెట‌ర్ ఆడుతారో అర్థం కాద‌నేలా మాట్లాడ‌టం బ‌ట్టి, విరాట్‌ను ఆసీస్ ఎంత‌లా విసిగించిందో, ఇంకెంత‌లా అస‌హ‌నానికి లోన‌య్యేలా చేసిందో అర్థ‌మైపోతుంది.

రాంచి టెస్ట్‌కు ముందు, మ్యాచ్‌లో ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. ఆ మాట‌కొస్తే అలెడ్రీ స్టార్ట్ అయ్యింది కూడా. ఆసీస్ మావోడి త‌ప్పేం లేదు, కోహ్లీదే త‌ప్పంతా అని అంటే, బీసీసీఐ మావోడి నిఖార‌సు అని స‌ర్టిఫికేట్ ఇచ్చింది. అంతేకాదు..విరాట్‌నే ముందు నుండి టార్గెట్ చేసిన ఆసీస్‌, స్మిత్ విష‌యంలో ఎన్ని కుప్పిగంతులు వేసినా..విజువ‌ల్స్‌లో ఆ మ్యాట‌ర్ క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. స్వ‌యంగా ఆ జ‌ట్టు కెప్టెనే ఒప్పుకున్నాడు. క్రీజులో ఉన్న హ్యాండ్స్‌క్యాంబ్ నిజ‌మేన‌న్నాడు.

కోహ్లీ..ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌కే కాదు..మిగిలిన వారికి కూడా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడు. క్రికెట్‌లో కిరికిరి చేయాల‌ని చూస్తే, తాట తీయ‌డ‌మే కాదు,
ప‌రిగెత్తించ‌డం కూడా గ్యారెంటీ అనేలా స్టేట్‌మెంట్తో అద‌ర‌గొట్టాడు. మ‌రోవైపు..గ‌తంలో కోహ్లీ చెప్పిన ప‌న‌ల్లా చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు గెలుస్తున్నాం అన్న మాట‌ను నిజం చేశాడు. ఇప్పుడు స్మిత్ మ్యాట‌ర్‌పై పిచ్చ క్లారిటీతో ముందుకెళ్తున్నాడు. రాంచిలో హాట్ హాట్ సీన్స్ ఫ్యాన్స్‌కు మ‌రింత ఎట్రాక్ష‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు.

వెంక‌ట్ రేగ‌ళ్ల‌
సీనియ‌ర్ స్పోర్ట్స్ క‌ర‌స్పాండెంట్‌
న్యూస్ టెలివిజ‌న్ అవార్డ్ గ్ర‌హీత‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts