స‌న్‌రైజ‌ర్స్ టార్గెట్ 136…..థ్రిల్లింగ్ ఫైట్ త‌ప్ప‌దా….?

నచ్చితే షేర్ చేయ్యండి
ఉప్ప‌ల్‌లో జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ముందు 136ప‌రుగుల‌ ల‌క్ష్యాన్ని ఉంచింది గుజ‌రాత్ ల‌య‌న్స్‌. ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన ల‌య‌న్స్ ఆరంభంలో మెరుగ్గానే ఆడినా..ర‌షీద్ ఖాన్ ఎంట్రీతో సీన్ మారింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ నిల‌క‌డ‌గా కాస్త కుదుకున్నా భారీ స్కోర్ మాత్రం సాధించ‌లేక‌పోయింది. నిర్ణీత 20ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ ల‌య‌న్స్ 7 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగులు చేసింది.
4ఓవ‌ర్ల‌లో 32/0
గుజ‌రాత్ ల‌య‌న్స్ ఆరంభంలో దూకుడిని ప్ర‌ద‌ర్శించింది. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా భారీ షాట్ల‌తో విరుచుకుప‌డింది. జాస‌న్ రాయ్ ఐదు ఫోర్ల‌తో స్కోర్‌కార్డ్‌ని ప‌రిగెత్తించాడు. ఈ టైమ్‌లో ల‌య‌న్స్ భారీ స్కోర్ సాధిస్తుంద‌ని అంద‌రూ ఉహించారు.
ర‌షీద్ ఎంట్రీతో మారిన సీన్
ఈ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చిన ర‌షీద్ ఖాన్ మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేశాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో మెక్‌క‌ల్ల‌మ్‌, సురేష్ రైనా, ఆరోన్ ఫించ్ వికెట్లు తీసి స‌త్తాచాటాడు. ఈ స్పెల్‌తో ల‌య‌న్స్ టీమ్ పూర్తిగా డిఫెన్స్‌లో ప‌డిపోయింది. అంతేకాదు…భారీ స్కోర్ సాధిస్తుంద‌నుకున్న జ‌ట్టు కాస్త త‌క్కువ స్కోర్‌కే ప‌రిమిత‌మైంది.
ఆదుకున్న కార్తీక్‌, స్మిత్‌
57ప‌రుగుల‌కే నాల్గు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ జ‌ట్టును కార్తీక్‌, స్మిత్ ఆదుకున్నారు. వీరిద్ద‌రూ వికెట్ల మ‌ధ్య ప‌రిగెత్త‌డంతో పాటు, వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు కొడుతూ స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించారు. అంతేకాదు…వీరి ఆట‌తీరుతో గుజ‌రాత్ ల‌య‌న్స్ 100ప‌రుగులు చేసింది. అయితే, చివ‌ర్లో ఆ జ‌ట్టు వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. ఫ‌లితంగా గుజ‌రాత్ ల‌య‌న్స్ త‌క్కువ స్కోర్‌కే ప‌రిమితమైంది.

నచ్చితే షేర్ చేయ్యండి

Related posts