ఐపీఎల్‌కు స్మిత్ బ్రేక్‌…మ‌ళ్లీ కెప్టెన్‌గా ధోనీ…?

నచ్చితే షేర్ చేయ్యండి

టైమ్ బాగాలేక‌పోతే అటు, ఇటు కావ‌డం గ్యారెంటీ. ప్ర‌జెంట్ ధోనీ సిచ్యువేష‌న్ ఇలాగే ఉంది. ఏ క్ష‌ణానా పుణె జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డం మొద‌లు పెట్టాడో కానీ, అప్ప‌టి నుండి వ‌రుస‌గా డీలాప‌డిపోతున్నాడు. గ‌తేడాది జ‌ట్టును న‌డిపించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైన, ఈ సీజ‌న్‌కు ఏకంగా కెప్టెన్సీనే పొగొట్టుకున్నాడు. ప్ర‌జెంట్‌…అత‌ను టీమ్‌లో ప్లేస్‌ను కాపాడుకునేందుకు చాలా కుస్తీ ప‌డుతున్నాడు. ఇలాంటి టైమ్‌లో ధోనీకి ఓ గుడ్‌న్యూస్ వినిపించి వినిపించ‌న‌ట్టుగా మారి అతన్ని కంగారులోకి నెట్టేసింది.

రైజింగ్ పుణె జ‌ట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌…ఓ వారం రోజుల పాటు దుబాయ్ టూర్‌కి వెళ్ల‌నున్నాడు. అక్క‌డ అత‌ను ఫ్యామిలీతో జాలీడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వ‌రుస‌గా తీరిక‌లేని క్రికెట్ ఆడుతున్న స్మిత్‌..ఈ బ్రేక్‌లో కంప్లీట్ ఫ్యామిలీమేన్‌గా మారిపోవాల‌ని డిసైడ‌య్యాడు. దీంతో ఆరు రోజుల పాటు ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. ఈ నెల 24న జ‌ర‌గ‌బోయే రైజర్స్ మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌స్తాన‌ని చెప్పాడు.

ఈ టైమ్‌లో పుణెకు మ్యాచ్‌లు లేక‌పోయినా…స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్ టైమ్‌కు అత‌ను రిట‌ర్న్ అవుతాడా లేడా అనేది కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, టూర్‌ను ప‌దిరోజుల‌కు పెంచాల‌ని భావిస్తుండ‌టంతో స్మిత్ కాస్త డైల‌మాలో ప‌డ్డాడు. ఈ టైమ్‌లో కెప్టెన్‌గా మ‌ళ్లీ ధోనీకి ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌నేది అత‌ని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ప్ర‌జెంట్ ఆ జ‌ట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు మాత్ర‌మే గెలిచింది. దీంతో…మ‌ళ్లీ మ‌హీకి చాన్స్ ఇస్తే గెలుపు త‌థ్య‌మ‌ని వారంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఏదీ ఏమైనా..ఇది కాస్త అత్యాశే అయితే, క్రికెట్‌లో ఏదైనా సాధ్య‌మేన‌ని ప్ర‌త్యేకంగా చెప్పాలా..?


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts