ఇటు ధావ‌న్‌, అటు రోహిత్ ఫ‌స్ట్‌బాల్‌కే ఔట్ కానీ…

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో భార‌త్‌కు అదృష్టం క‌ల‌సివ‌చ్చింది. ఫ‌లితంగా…ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోవాల్సిన టీమ్ గ‌ట్టెక్కితే, సెంచ‌రీతో గాడిలో ప‌డ్డ‌ట్టు క‌నిపించిన రోహిత్ శ‌ర్మ‌, మ‌రోసారి నిరాశ‌ప‌ర్చాడు. అయితే, యూడీఆరెస్‌తో ధావ‌న్ గ‌ట్టెక్కితే, డాలా ఇన్‌స్వింగ‌ర్‌కి రోహిత్ పెవిలియ‌న్‌కు చేరాడు.

ఫ‌స్ట్‌బాల్‌కే ధావ‌న్ ఔట్‌

టాస్ ఓడి బ్యాటింగ్ చేప‌ట్టిన టీమిండియాకు ఫ‌స్ట్ బాల్‌కే వికెట్ కోల్పోయింది. క్రిస్ మోరిస్ వేసిన ఫ‌స్ట్ బాల్‌కే వికెట్ల ద‌గ్గ‌ర దొరికిపోయాడు. అయితే, ధావ‌న్ రివ్యూ కోర‌డం, రిప్లేలో బంతి, బ్యాట్‌ను తాకిన‌ట్టు క‌నిపించ‌డంతో ధావ‌న్ నాటౌట్‌గా ఇన్నింగ్స్‌ను కొన‌సాగించాడు. అయితే, ఆ భ‌యంతోనేమో కానీ ఆ ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగు కూడా తీయ‌లేదు. అయితే, త‌ర్వాత దూకుడు ప్ర‌ద‌ర్శించి 3ఫోర్లు, రెండు భారీసిక్స‌ర్ల‌తో 24ర‌న్స్ చేశాడు. అయితే, డుమినీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

డాలా ఫస్ట్ బాల్‌కే రోహిత్ బిస్కెట్‌

స‌ఫారీ కొత్త కుర్రాడు డాలా వేసిన తొలి బంతికే రోహిత్ శ‌ర్మ వికెట్ల ద‌గ్గ‌ర దొరికిపోయాడు. అత‌ని బంతిని డిఫెన్స్ ఆడేలోపే, బాల్ ప్యాడ్ల‌ను ముద్దాడ‌టం, అంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించ‌డం క్ష‌ణాల్లో జ‌రిగిపోయింది. దీంతో, టీమిండియా రెండో ఓవ‌ర్ తొలి బంతికే ఫ‌స్ట్ వికెట్‌ను కోల్పోయింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts