నీకు 2కోట్లా…నీకు 12కోట్లు అవ‌స‌ర‌మా..? గ‌ంభీర్‌, సెహ్వాగ్ విమ‌ర్శ‌ల వ‌ర్షం

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా స్టార్ ఓపెన‌ర్స్ గౌత‌మ్ గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం అంద‌రిని షాక్‌కు గురిచేస్తోంది. అస‌లు వీరిద్ద‌రూ ఇలా ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. స‌చిన్‌, గంగూలీ త‌ర్వాత‌, భార‌త క్రికెట్‌లో అత్యుత్త‌మ ఓపెనింగ్ జోడీగా పేరున్న వీరిద్ద‌రూ, ఇలా ఆట‌కు దూర‌మైన త‌ర్వాత ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం హీట్ పెంచేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల టైమ్‌లో ఇలా చేయ‌డం అభిమానుల‌ను కంగారుకు గురిచేస్తోంది.

ఇషాంత్ శర్మ‌కు రెండుకోట్లా..?

రీసెంట్‌గా జ‌రిగిన ఆక్ష‌న్‌లో ఇషాంత్ శ‌ర్మ‌ను ఏ ఫ్రాంచైజీ కొన‌లేదు. అయితే, లీగ్ ప్రారంభ‌మ‌య్యాకా..సెహ్వాగ్‌, ఇషాంత్ శ‌ర్మ‌కు అదే స్థాయిలో చెల్లించి పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుకు ఆడేలా అగ్రిమెంట్ చేయించాడు. దీనిపై గంభీర్ ఘాటుగా స్పందించాడు. నాల్గు ఓవ‌ర్లు వేసే వ్య‌క్తికి రెండుకోట్లు అవ‌స‌ర‌మా..? అస‌లే అత‌ను ఫామ్‌, ఫిట్‌నెస్‌కు దూర‌మై ఉన్నాడు, అత‌నికి రెండు కోట్లు ఇవ్వ‌డం ఏంట‌ని ప‌రోక్షంగా వీరేంద్ర సెహ్వాగ్‌ను విమ‌ర్శించాడు.

60బంతులాడ‌ని నీకు 12కోట్లా…?

ఈ విమ‌ర్శ‌ల‌పై వీరూ ఘాటుగా స్పందించాడు. 60బంతులాడ‌ని గంభీర్‌కు 12కోట్లు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించాడు. అత‌నికి అంత‌సీన్ లేద‌ని, అలాంటి గౌతీకే 12కోట్లు ఇస్తుంటే, ప్ర‌జెంట్ టీమిండియాలో ఉన్న ఇషాంత్ శ‌ర్మ‌కు ఈ అమౌంట్ స‌రైందేన‌న్నాడు. త‌న‌కు గంభీర్‌తో విభేదాలు ఏమీ లేవ‌ని చెబుతూనే మాట‌ల దాడి కొన‌సాగించాడు. ట్విట్ట‌ర్‌లో కాకుండా, నేరుగానే గంభీర్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఇప్పుడు అత‌ని స‌న్నిహితులు ఆస‌క్తిక‌రంగా మాట్లాడుతున్నారు.

మొత్తానికి ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్‌ను కంగారుపెడుతోంది. అస‌లు ఎందుకు ఇలా ఒక‌రిపై ఒక‌రు స్థాయి మ‌ర‌చిమాట్లాడుకుంటున్నార‌నే కామెంట్స్‌కు చేరువ‌వుతున్నారు. ఈ కాంట్రావ‌ర్సీకి ఎలా పుల్‌స్టాప్ పెడ్తార‌నేది కీల‌కంగా మారింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts