శాట్స్ ఆధ్వ‌ర్యంలో టీఎస్ క్రీడాకారుల‌కు స‌న్మానం

నచ్చితే షేర్ చేయ్యండి

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకోని ఈ నెల 17న అథ్లెట్ల‌ను స‌న్మానించాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని శాట్స్ చైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ స్పోర్ట్స్ అభివృద్ధికి ముఖ్య‌మంత్రి క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, ఆయ‌న స్ఫూర్తిగా ముందుకెళ్తున్న శాట్స్‌, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ‌స్థాయిలో ప్ర‌తిభ చాటిన అన్ని విభాగాల క్రీడాకారుల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశంతో వాళ్ల‌ను స‌న్మానిస్తున్న‌ట్టు చెప్పారు.

జాతీయ క్రీడాకారులంద‌రికి స‌త్కారం

తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అన్ని ఆట‌ల్లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌ప‌రుస్తున్న ప్లేయ‌ర్స్‌ను స‌న్మానిస్తున్న‌ట్టు చైర్మ‌న్ చెప్పారు. ఇప్ప‌టికే, అప్లికేష‌న్లు స్వీక‌రించామ‌ని, అయితే, వారికి మ‌రికొంత స‌మ‌యం ఇచ్చేందుకు, ఈ నెల 16వ‌ర‌కు గ‌డువు తేదీని పొడిగించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. అంతేకాదు….17వ తేదీన‌, ఎంపీ క‌విత‌తో పాటు, క్రీడాశాఖ మంత్రి ప‌ద్మారావు అథ్లెట్ల‌ను స‌త్క‌రిస్తార‌ని ఆయ‌న చెప్పారు.

వీడియో కోసం క్రింద క్లిక్ చేయండి


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts