ఒక్క ట్వీట్‌తో వేడిపుట్టిస్తున్న సాక్షి..ధోనీకి తెలిసే చేసిందా..?

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌, ఐపీఎల్‌లో మూడుసార్లు టీమ్‌ను చాంపియ‌న్‌గా నిలిపిన స్టార్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. అలాంటి సూప‌ర్ స్టార్ ప్లేయ‌ర్ ఇప్పుడు నార్మ‌ల్ ప్లేయ‌ర్‌గా మారాడు. కెప్టెన్సీ కోల్పోయి, టీమ్‌లో స్థానం కూడా కోల్పోయే ప‌రిస్థితికి వ‌చ్చాడు. ఇలాంటి టైమ్‌లో, పుణె ఫ్రాంచైజీ ధోనీతో ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అస‌లు అత‌ను జ‌ట్టులో ఎంత‌కాలం ఉంటాడో లేదో తెలియ‌ని సిచ్యువేష‌న్ కూడా ఏర్ప‌డింది.

ఇలాంటి టైమ్‌లో సాక్షి ధోనీ చేసిన ట్వీట్ వేడి పుట్టిస్తుంది. భ‌ర్త‌ను రోజుకో విధంగా ఇబ్బంది పెడుతున్న ఫ్రాంచైజీపై ఆమె ఘాటుగా స్పందించ‌డ‌మే కాదు కాలం గురించి కోటేష‌న్లు కూడా చెప్పింది. చీమ క‌థ‌తో మొద‌లు పెట్టిన సాక్షి, అంద‌రిని షాక్‌కు గురిచేసేలా ప్ర‌త్య‌ర్థుల‌పై కౌంట‌ర్లు వేసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ జెర్సీతో పాటు హెల్మెట్ పెట్టుకున్న ఆమె, మ‌ళ్లీ పాత‌రోజులు వ‌స్తాయ‌నేలా సింబ‌ల్స్ ఇచ్చింది. అంతేకాదు..అప్పుడు ధోనీనే మ‌ళ్లీ కింగ్ అవుతాడ‌నేలా సిగ్న‌ల్స్ ఇచ్చింది.

ధోనీపై చాలా రోజులుగా విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే, వేటిపైనా మ‌హేంద్రుడు స్పందించ‌లేదు. అడ‌ప‌ద‌డ‌పా అత‌ని ఫ్యాన్సే నిర‌స‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో సాక్షి ధోనీ ఏకంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా కామెంట్స్ చేయ‌డం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. భ‌ర్త‌కు తోడుగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కే దారితీశాయి. ధోనీకి తెలియ‌కుండా ఈ స్థాయి విమ‌ర్శ‌లు అయితే చేయ‌దు. మ‌రీ..దీనిపై ధోనీ ఎలా స్పందిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

#throwback !!

A post shared by Sakshi (@sakshisingh_r) on


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts