ఎట్ట‌కేల‌కు గ‌ర్జించిన‌ సింహాలు…

నచ్చితే షేర్ చేయ్యండి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో గుజ‌రాత్ ల‌య‌న్స్ గ‌ర్జించాయి. రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించాయి. బ‌ల‌హీన‌త‌ల‌పై దృష్టిపెట్టిన గుజ‌రాత్ జ‌ట్టు, త‌న‌కున్న బ్యాటింగ్ బ‌లంతో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ‌ట‌మే కాదు, అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. పేస‌ర్ ఆండ్రూ టై 5కీల‌క వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను గెల్చుకున్నాడు.

ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్ పుణె జ‌ట్టు 8వికెట్లు కోల్పోయి 171ప‌రుగులు చేసింది. త్రిపాఠి 33, స్మిత్ 43, స్టోక్స్ 25, అంకిత్ 31ప‌రుగుల‌తో రాణించారు. అయితే, ల‌య‌న్స్ బౌల‌ర్ల‌లో టై అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో పుణె త‌క్కువ స్కోర్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. చివ‌ర్లో టై వ‌రుస‌గా మూడు వికెట్లు తీసి కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

172ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌య‌న్స్‌కు ఓపెన‌ర్లు మెక్‌క‌ల్ల‌మ్‌, స్మిత్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్ద‌రూ క‌లిసి పుణె బౌల‌ర్ల‌పై యుద్ధం ప్ర‌క‌టించారా అనే రేంజ్‌లో అద‌ర‌గొట్టేశారు. అస‌లేమాత్రం త‌డ‌బ‌డ‌కుండా స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించిన వీరిద్ద‌రూ ప‌ది ఓవ‌ర్ల‌లోపే మ్యాచ్‌ను పుణె జ‌ట్టు నుంచి లాక్కున్నారు. ఆ త‌ర్వాత సురేష్ రైనా, ఫించ్‌ వాళ్లిద్ద‌రి దూకుడిని కొన‌సాగించ‌డంతో పుణె జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts