మ్యాచ్‌కు ముందో రికార్డ్‌…మ్యాచ్‌లో మ‌రో రికార్డ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప‌దో ఎడిష‌న్‌లో సురేష్ రైనా రెండు స‌రికొత్త రికార్డ్‌ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌కు ముందు ఒక రికార్డ్‌ను సొంతం చేసుకున్న రైనా, బ్యాటింగ్ చేసే టైమ్‌లో మ‌రో రికార్డ్‌ను ద‌క్కించుకున్నాడు. ప‌దేళ్ల ఐపీఎల్‌లో సురేష్ రైనా ఒకే ఒక్క‌డిగా నిలిచి అంద‌రి మ‌న‌సుల‌ను గెల్చుకున్నాడు. ఆరంభ ఎడిష‌న్ నుండి తిరుగులేని ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేసిన రైనా, గ‌త రెండు సీజ‌న్లుగా కెప్టెన్‌గానూ అల‌రిస్తున్నాడు.

సురేష్ రైనా ఈ మ్యాచ్ బ‌రిలో దిగ‌డంతో, ఐపీఎల్ సీజ‌న్‌లో 150మ్యాచ్‌లాడిన తొలి క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఫీట్‌ను మ‌రే క్రికెట‌ర్ సాధించ‌లేదు. ఇదో అరుదైన రికార్డ్‌. ఈ గ‌ణంకాలు, అత‌ని ఫామ్‌ను, ఫిట్‌నెస్‌ను తెలియ‌జేస్తున్నాయి. అంతేకాదు..రైనాకు ఐపీఎల్‌తో ఉన్న రిలేష‌న్‌ను కూడా తెలియ‌జేస్తుంది. తండ్రిగా ప్రమోష‌న్ పొందిన టైమ్‌లోనే రైనా ఐపీఎల్‌కు దూర‌మయ్యాడు.

ఇక‌…ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గానూ రైనా నిలిచాడు. 150 మ్యాచ్‌ల్లో రైనా అత్య‌ధిక ప‌రుగులు చేసి ఐదువేల క్ల‌బ్‌లో చేరేందుకు ఉవ్విళ్లురూతున్నాడు. అత‌నితో పాటు కోహ్లీ కూడా రేసులో ఉన్నా..రైనా ముందుగా ఆ రికార్డ్‌ను చేరుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు….రాబోయే మ్యాచ్‌ల్లో ఫామ్‌, ఫిట్‌నెస్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం రైనాకు చాలా అవ‌స‌రం కావ‌డంతో అత‌ని ఆట‌తీరుతో మ‌రిన్ని రికార్డ్‌లు నెల‌కొల్పుతాడ‌ని అంద‌రూ భావిస్తున్నారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts