వాహ్‌..సూప‌ర్భ్‌..వాట్ ఏ ఫీల్డింగ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

గుజ‌రాత్ ల‌య‌న్స్‌, పుణె జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో 17యేళ్ల కుర్రాడు అద్భ‌తుమైన ఫీల్డింగ్‌తో ఎంట‌ర్‌టైన్ చేశాడు. అంద‌రూ సిక్స్ అని ఫిక్సైన టైమ్‌లో అత‌ను చేసిన మ్యాజిక్ ఫీల్డింగ్ ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కు గురిచేసింది. సెక‌న్‌లో బౌండ‌రీలైన్ ద‌గ్గ‌ర బాడీని కంట్రోల్ చేసుకోవ‌డ‌మే కాదు, అంద‌రి క‌ళ్లు జిగేల్‌మ‌నేలా బంతిని ఆపిన తీరు నివ్వెర‌పొయేలా చేసింది. ఒక్క‌క్ష‌ణం పాటు క‌ళ్ల‌ను కంటిరెప్ప వేయ‌కుండా చేసింది.

గుజ‌రాత్ ఓపెన‌ర్ మెక్‌క‌ల్ల‌మ్ స్విచ్‌హిట్ షాట్ ఆడాడు. బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో అత‌ను కొట్టిన బంతి సిక్స్ గ్యారెంటీ అనుకున్నారంతా. స‌రిగ్గా అదే టైమ్‌లో బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర ఫీల్డింగ్ చేస్తున్న 17యేళ్ల రాహుల్ చాహ‌ర్ బంతిని అద్భుతంగా ఆపాడు. గాల్లోఇక ఎగురుతూ, బ్యాలెన్స్ చేసుకోని, లైన్ అవ‌త‌లం ల్యాండ్ అయ్యేలోపే అత‌ను బాల్‌ను ఫీల్డ్‌లోకి విసిరేశాడు.

ఈ తీరును చూసిన మెక్‌క‌ల్ల‌మ్‌, రైనా, స్టోక్స్‌, ధోనీ అంద‌రూ చ‌ప్ప‌ట్ల‌తో ఆ యంగ్ క్రికెట‌ర్‌ను అభినందించారు. ఐపీఎల్‌లో ఇలాంటి మెరుపు ఫీల్డింగ్‌లు ఫ్యాన్స్‌ను మ‌రింత థ్రిల్‌కు గురిచేయ‌డ‌మే కాదు..ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే, యంగ్ ప్లేయ‌ర్స్ ఇలాంటి ఫీల్డింగ్‌తో త‌మ ఫిట్‌నెస్‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాదు, ఆల్‌రౌండ‌ర్స్ అని చెప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts