నెట్‌లో ధోనీ మ‌ళ్లీ మొద‌లెట్టేశాడు

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ, ఐదో వ‌న్డేకి ముందు నెట్‌లో కొత్త రోల్‌లో క‌నిపించాడు. చాలా సేపు లెగ్‌స్పిన్ వేస్తూ అంత‌టా ఆస‌క్తి పెంచాడు. పార్ట్ టైమ్ బౌల‌ర్ టీమ్‌లో లేక‌పోవ‌డం, ఐదో వ‌న్డేలో కూర్పు ఎలా ఉండాలో డైలమాలో ఉండ‌టంతో మ్యాచ్ ఫ‌లితంపై ఉహ‌గానాలు మొద‌ల‌య్యాయి. ఇలాంటి టైమ్‌లో ధోనీ, నెట్‌లో ప‌దే ప‌దే బౌలింగ్ చేస్తూ క‌నిపించ‌డం ఇప్పుడు ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది.

మిడిలార్డ‌ర్‌లో శ్రేయాస్‌కే చోటు

కేదార్ జాద‌వ్ ప్లేస్‌లో టీమ్‌లోకి వ‌చ్చిన  శ్రేయాస్ అయ్య‌ర్‌, నాల్గో వ‌న్డేలో తీవ్రంగా నిరాశ‌ప‌ర్చాడు. ఇటు బ్యాట్‌తోనే కాకుండా, అటు ఫీల్డింగ్‌లోనూ అయ్య‌ర్ విఫ‌ల‌మ‌య్యాడు. అయితే, ఈ యంగ్‌స్ట‌ర్‌కి ఐదో వ‌న్డేలోనూ చోటు క‌ల్పించాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అలా చేయ‌డం వ‌ల్ల‌, కేదార్ జాద‌వ్ డ‌గౌట్‌కే ప‌రిమిత‌మ‌వుతాడు. అదే జ‌రిగితే, ధోనీని పార్ట్‌టైమ్ బౌల‌ర్‌గా ఉప‌యోగించుకోవాల‌ని కోహ్లీ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జాద‌వ్ స్థానానికి, ధోనీయే స‌రైన ప్ర‌త్య‌మ్న‌య‌మ‌ని టీమ్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

ధోనీ ట్రిపుల్ రోల్‌

ధోనీ ఇప్ప‌టికే వికెట్ల ముందు బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ల వెనుక కీప‌ర్‌గా డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు. అన‌ధికారికంగా, కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. వీట‌న్నింటికి తోడు, ఐదో వ‌న్డేలో అత‌ను బౌలింగ్ చేస్తే, ట్రిపుల్ రోల్ ప్లే చేయ‌డం గ్యారెంటీ. అయితే, గ‌తంలో కూడా ధోనీ ఇలాగే నెట్‌లో బౌలింగ్ చేశాడు. అయితే, బ‌రిలోకి దిగిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. మ‌రీ ఇవాళ్టి మ్యాచ్‌లో ఏం అవుతుందో వేచి చూడాలి.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts