నాగ‌ర్‌కోటికి రాజ‌స్తాన్ స‌ర్కార్ పావుకోటి

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా అండ‌ర్‌-19 ప్లేయ‌ర్ నాగ‌ర్‌కోటికి….రాజ‌స్తాన్ స‌ర్కార్ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం, అత‌నికి 25ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్టు అసెంబ్లీలో ప్ర‌క‌టించింది. అండ‌ర్-19 వ‌ర‌ల్డ్‌క‌ప్ భార‌త్‌ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పొషించిన నాగ‌ర్‌కోటి ప్ర‌తిభ‌ను, అంద‌రూ ప్ర‌శంసించారు. బ‌డ్జెట్ ప్రసంగంలో రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజే, నాగ‌ర్‌కోటిని ప్ర‌శంసించ‌డ‌మే కాకుండా, అత‌నికి ఈ మేర‌కు న‌జ‌రానా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

నాగ‌ర్‌కోటి తొలి మ్యాచ్ నుంచే అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. 140కిలోమీట‌ర్ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా, నాగ‌ర్‌కోటి ప‌దునైన బంతుల‌తో దూసుకెళ్లాడు. ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్‌ను కంగారుపెట్టాడు. అంతేకాదు, అత‌ని బౌలింగ్ ప్ర‌తిభ‌కు ముగ్దుడైన షారూఖ్ ఖాన్‌, ఆక్ష‌న్‌లో ఏకంగా 3.2కోట్లు ఇచ్చి అత‌న్ని కోనుగోలు చేశాడు.

ఇప్ప‌టికే, అండ‌ర్‌-19టీమ్‌కు బీసీసీఐ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. అయితే, ఇప్పుడు రాష్ట్రాలు, రాష్ట్ర క్రికెట్ సంఘాలు, త‌మ ప్లేయ‌ర్స్‌పై ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నాయి. వాళ్లంద‌రూ క‌లిసి ల‌క్ష‌ల్లో ఆట‌గాళ్ల‌కు న‌జ‌రానాలు ప్ర‌క‌టిస్తున్నారు. అయితే, ఇలాంటి టీమ్‌లో మ‌న రెండు స్టేట్స్ నుంచి ఒక్క ప్లేయ‌ర్ కూడా లేక‌పోవ‌డం కాస్త నిరాశ క‌ల్గించే విష‌యం.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts