ధోని బౌల్డ్ ఐనా…అంపైర్ ఫోర్ ఇచ్చాడు

నచ్చితే షేర్ చేయ్యండి

క‌ట‌క్ వ‌న్డేలో ఇంగ్లండ్ పై టీమిండియా భారీస్కోరు సాధించింది. యువ‌రాజ్ సింగ్ భారీ సెంచ‌రీ చేయ‌గా…ధోని కూడా శ‌త‌కంతో రాణించాడు. ఈ ఇద్ద‌రి దూకుడుతో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో 381 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఐతే భార‌త‌ ఇన్నింగ్స్ లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. మ‌హేంద్ర‌సింగ్ ధోని క్లీన్ బౌల్డ్ అయినా కూడా అంపైర్ నాటౌట్ గా ప్ర‌క‌టించడ‌మే కాకుండా ఫోర్ ఇచ్చాడు..స్టేడియం అరుపుల‌తో మార్మోగిపోయింది..ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

ఇన్నింగ్స్ 42వ ఓవ‌ర్ చివ‌రి బంతికి ఇంగ్లండ్ బౌల‌ర్ వోక్స్ …యువ‌రాజ్ సింగ్ ను అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత 43వ ఓవ‌ర్ ను ప్లంకెట్ వేశాడు. ఈ ఓవ‌ర్ మూడో బంతిని అత‌డు నోబాల్ గా సంధించాడు. ఈ బంతిని ధోని స్క్వేర్ లెగ్ దిశ‌గా ఆడి రెండు ప‌రుగులు తీశాడు…ఆ త‌ర్వాతి బంతిని భారీ షాట్ గా మ‌ల‌చ‌బోయిన ధోని…బంతిని స‌రిగా అంచ‌నా వేయ‌లేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఐతే అంపైర్ దాన్ని నాటౌట్ గా ప‌రిగ‌ణించి బౌండ‌రీ ప్ర‌క‌టించాడు. ఎందుకంటే అది ఫ్రీహిట్ బంతి…నిబంధ‌న‌ల ప్ర‌కారం నోబాల్ వేసిన త‌ర్వాతి బంతిని ఫ్రీహిట్ గా ప్ర‌క‌టిస్తారు. ఆ బంతికి బ్యాట్స్ మ‌న్ క్యాచ్ అవుట్, బౌల్డ్ అయినా లెక్క‌లోకి తీసుకోరు. ఐతే ఫోర్ ఎందుకు ప్ర‌క‌టించాడంటే…బంతి ఆఫ్ స్టంప్ పై భాగాన త‌గిలి వికెట్ కీప‌ర్ కు చిక్క‌కుండా బౌండ‌రీ దాటి వెళ్లింది. అందుకే బైస్ రూపంలో నాలుగు ప‌రుగుల‌ను (ఫోర్) ప్ర‌క‌టించాడు అంపైర్..

ఫ్రీ హిట్ కు స్టంప్ అవుట్, ర‌నౌట్ ను మాత్ర‌మే ఔట్ గా ప‌రిగ‌ణిస్తారు. ఫ్రీ హిట్ పుణ్య‌మాని అవుట‌య్యే ప్ర‌మాదం నుంచి గ‌ట్టెక్కిన ధోని భార‌త్ కు భారీ స్కోరు అందించాడు. దోని 122 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 134 ప‌రుగులు చేశాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts