మ‌నీష్ పాండే సూప‌ర్ ఇన్నింగ్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మిడిలార్డ‌ర్ యంగ్ బ్యాట్స్‌మెన్ మ‌నీష్ పాండే అద‌ర‌గొట్టాడు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా భారీ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. స‌ఫారీల‌పై టాపార్డ‌ర్ కంగారుప‌డ్డ టైమ్‌లో మెరుగైన ఆట‌తీరుతో స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించాడు. అత‌ను సాధించిన ప‌రుగులు ఇప్పుడు టీమ్ మెరుగైన స్థానంలో నిల‌బ‌డేలా మాత్ర‌మే కాదు, ఓ రేంజ్‌లో మ్యాచ్ ఫ‌లితాన్ని శాసించేలా చేశాయి. అంతేకాదు, మ‌నీష్ పాండే ఫామ్‌, ఫిట్‌నెస్ మ‌రోసారి నిరూపించుకున్నాడు.

కోహ్లీ ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన మ‌నీష్ పాండే, నిల‌క‌డగా ఆడాడు. వికెట్ల మ‌ధ్య ప‌రిగెత్త‌డంలో దూకుడు ప్ర‌ద‌ర్శించిన మ‌నీష్ సురేష్ రైనాతో క‌లిసి నాల్గో వికెట్‌కు 45ప‌రుగులు జోడించాడు. రైనా ఔట‌య్యాకా కూడా అదే జోరును కొన‌సాగించిన మ‌నీష్ పాండే, అర్థ‌సెంచ‌రీతో టీమ్ స్కోర్‌ను వంద ప‌రుగులు దాటించాడు. అంతేకాదు, ధోనీతో క‌లిసి ఐదో వికెట్‌కు కీల‌క‌మైన భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసి, టీమ్‌ను రెండో టీట్వంటీ ప‌టిష్టస్థితిలో నిలిపాడు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts