విండీస్‌తో టీట్వంటీకి ముందే కోహ్లీ అదిరే స్కెచ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

వ‌న్డే సిరీస్‌ను గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా, ఏకైక టీట్వంటీని కూడా ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. అంతేకాదు…టీట్వంటీలో విండీస్ బ‌లంగా ఉండ‌టంతో భార‌త్ ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఆదివారం జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో కోహ్లీ సేన‌, విండీస్‌పై ఎలా ఆడుతుంద‌నేది కూడా ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. మ‌రోవైపు….కోహ్లీసేన ఈ మ్యాచ్ కోసం ప్ర‌త్యేక వ్యుహ‌లు సిద్ధం చేస్తోంది. టీట్వంటీ ఫార్మాట్ కావ‌డంతో పోటీపై అంద‌రిలో ఆస‌క్తి పెరుగుతోంది.

ఓపెన‌ర్‌గా కోహ్లీ

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగే చాన్స్ క‌నిపిస్తోంది. అత‌నికి తోడుగా శిఖ‌ర్ ధావ‌న్ రావ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు, టీమిండియా ఈ జ‌ట్టులో యువ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్‌ను ఆడించాల‌ని చూస్తోంది. కుల్దీప్ యాద‌వ్ కూడా టీమ్‌లోకి రానున్నాడు. సీనియ‌ర్ ప్లేయ‌ర్స్‌కు కొంత‌మంది విశ్రాంతి గ్యారెంటీగా క‌నిపిస్తోంది.

ప్ర‌త్య‌ర్థిని కంగారెత్తించేందుకే కోహ్లీ…

క్రిస్‌గేల్‌, శామ్యూల్స్‌, పొలార్డ్ లాంటి స్టార్ ప్లేయ‌ర్స్ అంద‌రూ ఈ మ్యాచ్‌లో విండీస్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు. ఇలాంటి టైమ్‌లో వారిని కట్ట‌డి చేయాల‌ని భార‌త్ భావిస్తోంది. అందుకే, ఆరంభం నుంచే దూకుడిగా ఆడుతూ కోహ్లీ, విండీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడితో కంగారెత్తించాల‌ని చూస్తున్నాడు. మ‌రీ, ఇలాంటి పోటీలో కోహ్లీ అండ్ కో గేమ్‌ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts