అభిమానులారా…కోహ్లీ వ‌స్తున్నాడు

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌. ఐపీఎల్‌ను ఒక్క సెక‌ను కూడా మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్‌కు ఇది మ‌రీ గుడ్‌న్యూస్‌. లీగ్ ప్రారంభ‌మ‌యి వారం రోజులైనా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క విజ‌యం ద‌క్కించుకోని ఆర్‌సీబీకి పండ‌గ రోజు. వ‌ర‌ల్డ్ క్రికెట్ న‌యా అవ‌తార్ విరాట్ కోహ్లీ బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇవాళ నాలుగు గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడేందుకు సై అన్నాడు.

ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అప్ప‌టి నుండి డ్రెస్సింగ్ రూమ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇదంతా ఐపీఎల్ కోస‌మే హైడ్రామా అని ఆస్ట్రేలియ‌న్లు విమ‌ర్శ‌లు చేసినా…వాటిని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. ఇలాంటి టైమ్‌లో ప్రారంభ‌మైన ఐపీఎల్‌లో తొలి మూడు మ్యాచ్‌ల‌కు ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో దూర‌మ‌య్యేలా చేసింది.

ఆర్‌సీబీ అంటేనే విరాట్ కోహ్లీ. ప్ర‌జెంట్ వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్న క్రికెట‌ర్ కోహ్లీనే. అలాంటి ఆట‌గాడు, వ‌రుస ఓట‌ముల‌తో డీలాప‌డ్డ ఆర్‌సీబీకి తోడుగా బ‌రిలోకి దిగుతుంటే అంచ‌నాలు భారీగా ఉండ‌టం గ్యారెంటీ. అంతేకాదు..కోహ్లీకి ఇది ఓ ప‌రీక్ష టైమ్ కూడా. ఒత్తిడిలో మ‌రింత‌గా రాణించ‌డం అత‌నికి అల‌వాటు. ఇలాంటి టైమ్‌లో బ‌రిలోకి దిగుతున్న కోహ్లీ..ఎలాంటి ఆట‌తీరుతో రాణిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts