రైజ‌ర్స్‌పై కోల్‌క‌తా రైడింగ్‌….

Yusuf Pathan of the Kolkata Knight Riders celebrates the wicket of Shikhar Dhawan of the Sunrisers Hyderabad during match 14 of the Vivo 2017 Indian Premier League between the Kolkata Knight Riders and the Sunrisers Hyderabad  held at the Eden Gardens Stadium in Kolkata, India on the 15th April 2017

Photo by Ron Gaunt - Sportzpics - IPL
నచ్చితే షేర్ చేయ్యండి

స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌కు మ‌రో ఓట‌మి. చివ‌రి మ్యాచ్‌లో డీలాప‌డ్డ రైజ‌ర్స్ టీమ్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లోనూ త‌డ‌బ‌డింది. కోల్‌క‌తా జ‌ట్టు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌, దూకుడైన బ్యాటింగ్ ముందు ఆ టీమ్ పూర్తిగా తేలిపోయింది. ఆరంభం అదిరినా..ముగించ‌డంలో మాత్రం వెనుక‌ప‌డి ఓట‌మికి చేరువైంది. ఊత‌ప్ప‌, మ‌నీష్ పాండే, వోక్స్ కేకేఆర్ టీమ్‌కు విక్ట‌రీని అందించారు. హోంగ్రౌండ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్ విజ‌యాల ప‌రంప‌ర‌ను కొన‌సాగించింది.

టాస్‌గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆరంభంలో బౌల‌ర్లు ఆక‌ట్టుకున్నారు. మ‌రోసారి రైడ‌ర్స్‌, న‌రైన్‌ను ఓపెన‌ర్‌గా దించింది. అయితే, ఈ మ్యాచ్‌లో అత‌నితో పాటు గంభీర్ విఫ‌ల‌మ‌య్యారు. ఈ టైమ్‌లో ఉత‌ప్ప అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. వ‌రుస బౌండ‌రీల‌తో హోరెత్తించాడు. స‌న్‌రైజ‌ర్స్ చెత్త ఫీల్డింగ్ అత‌నికి క‌ల‌సివ‌చ్చింది. అర్థ‌సెంచ‌రీ త‌ర్వాత ఉత‌ప్ప ఔటైనా…మ‌నీష్ పాండే దూకుడిగా ఆడ‌టంతో కేకేఆర్ టీమ్ 6వికెట్లు కోల్పోయి 172ప‌రుగులు చేసింది.

173ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌…ఆరంభంలో దూకుడిగా ఆడింది. ధావ‌న్‌, వార్న‌ర్ ఇద్ద‌రూ క‌లిసి స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించారు. అయితే, స్పిన్న‌ర్ల ఎంట్రీతో వీరి దూకుడు త‌గ్గింది. ప‌ఠాన్‌, ధావ‌న్‌ను ఔట్ చేస్తే, కుల్దీప్ వార్న‌ర్‌ను బొల్తాకొట్టించాడు. కాసేప‌టికే హెన్రిక్స్‌, యువీ, హుడా పెవిలియ‌న్ చేరారు. దీంతో రైజ‌ర్స్ క‌ష్టాల్లో ప‌డింది. క్రిస్‌వోక్స్ రెండు కీల‌క వికెట్లు తీశాడు.

Kolkata Knight Riders 172/6 
Sunrisers Hyderabad 155/6 

నచ్చితే షేర్ చేయ్యండి

Related posts