జూనియ‌ర్ ధోనీ డోపింగ్‌లో దొరికిపోయాడు

నచ్చితే షేర్ చేయ్యండి

మ‌హ‌మ్మ‌ద్ షెహ‌జాద్…ధోనీ త‌ర్వాత హెలికాప్ట‌ర్ షాట్స్ కొట్ట‌డంలో ఈ ప్లేయ‌రే ఫ‌ర్‌ఫెక్ట్‌. ఆప్ఘ‌నిస్తాన్ ఓపెన‌ర్‌గానే కాకుండా,. వికెట్ కీప‌ర్‌గానూ ఇండియ‌న్ క్రికెట్ ల‌వ‌ర్స్‌ను సైతం ఎట్రాక్ట్ చేసిన ప్లేయ‌ర్ షెహ‌జాద్‌. అలాంటి ఆట‌గాడు డోపింగ్‌లో ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలాడు. ఈ మ్యాట‌ర్ ఇప్పుడు అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది.

షెహ‌జాద్‌..టీట్వంటీ ఫార్మాట్‌లో మెరుగైన ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. అత‌ను ఓపెనింగ్‌లో అదిరిపోయే ఆట‌తీరుతో స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించ‌డం అల‌వాటు. అలాంటి ఆట‌గాడు…డోపింగ్‌లో దొర‌క‌డం ఇప్పుడు ఫ్యాన్స్‌కు మింగుడు ప‌డ‌టం లేదు. 2010లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షెహ‌జాద్‌, వ‌న్డేల్లో 1901, టీట్వంటీల్లో 1779 ర‌న్స్ చేశాడు.

టీట్వంటీల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన నాల్గో బ్యాట్స్‌మెన్‌గా షెహ‌జాద్ కొన‌సాగుతున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత‌ను కోహ్లీ కంటే ముందున్నాడు. అలాంటి ఆట‌గాడు డోపింగ్‌లో దొర‌క‌డం ఐసీసీని సైతం కంగారుపెడుతోంది ఏప్రిల్ 26 నుంచి అత‌నిపై వేటు అమ‌ల్లోకి రానుంది. ఈలోగా, అత‌ను ఐసీసీకి అప్లై చేసుకుంటే, నిషేధంపై పున‌రాలోచించే అవ‌కాశం క‌నిపిస్తోంది. వ‌ర‌ల్డ్‌క్రికెట్‌లో షెహ‌జాద్‌కు జూనియ‌ర్ ధోనీ అని పేరుంది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts