4కోట్లు  పెట్టి  కొంటే చుక్క‌లు చూపిస్తున్నాడు…

rashid khan ipl
నచ్చితే షేర్ చేయ్యండి
ఆక్ష‌న్‌లో ర‌షీద్ ఖాన్‌కు వ‌చ్చిన‌రేట్ చూసి వ‌చ్చిన రియాక్ష‌న్‌లు వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. బౌల‌ర్‌ను ఇంత పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేసి కొన‌డం చాలా మందిని  ఆశ్చార్యానికి గురిచేసింది. అంతేకాదు….ఒక ఆప్ఘ‌నిస్తాన్ ప్లేయ‌ర్‌కు ఇన్ని కోట్లా అంటూ మ‌క్కున వేలేసుకున్నాడు. ఫ‌స్ట్ మ్యాచ్ నుంచే అత‌నికి చాన్స్ ఇవ్వ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు షాక్‌కు గుర‌య్యారు. కానీ, ర‌షీద్‌చూపిస్తున్న చుక్క‌లు, బ్యాట్స్‌మెన్‌కు ప‌ట్టిస్తున్న చెమ‌ట‌లు ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి.
ర‌షీద్ ఖాన్‌…..ఆప్ఘ‌నిస్తాన్ మ్యాచ్‌లు చూసే చాలా కొద్ది ఫ్యాన్స్‌కు మాత్ర‌మే ప‌రిచ‌యం ఉన్న క్రికెట‌ర్‌.రీసెంట్‌గా జ‌రిగిన టీట్వంటీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో పాటు ఆప్ఘాన్ ఆడుతున్న వ‌రుస మ్యాచ్‌ల‌తో అత‌నికి ఫుల్ క్రేజ్ ఏర్ప‌డింది. అలాంటి ర‌షీద్‌, ఐపీఎల్ ఆక్ష‌న్‌లో ఉహించ‌ని ధ‌ర ద‌క్కించుకున్నాడు. దాన‌కిఇ త‌గ్గ‌ట్టు ఫ‌స్ట్ మ్యాచ్‌లో ప్లేస్ క‌న్ఫార్మ్ చేసుకోని కీల‌క టైమ్‌లో అదిరే ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు.
ఆర్‌సీబీపై రఫ్ఫాడించాడు…
రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ర‌షీద్ రెండు వికెట్లు తీశాడు. ఈ వికెట్లు మ్యాచ్‌ను మ‌లుపుతిప్పాయి. అస‌లేమాత్రం ప్ర‌త్య‌ర్థికి అవ‌కాశం ఇవ్వ‌కుండా, స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టును మ్యాచ్‌లో కోలుకునేలా చేశాయి. బౌలింగ్ యాక్ష‌న్‌, బంతుల్లో చూపించిన వైవిధ్యం ప్ర‌తి ఒక్క‌రిని ఫుల్‌గా ఆక‌ట్టుకుంది.
ల‌య‌న్స్‌ను వేటాడేశాడు….
రెండో మ్యాచ్‌లోనూ గుజ‌రాత్ ల‌య‌న్స్‌ను వేటాడేశాడు. ర‌షీద్ ఎంట్రీతో అప్ప‌టి వ‌ర‌కు గాండ్రించిన గుజ‌రాత్ కాస్త డీలాప‌డింది. కీల‌క‌మైన మెక్‌క‌ల్ల‌మ్‌, రైనా, ఫించ్ వికెట్లు తీసి ల‌య‌న్స్ టీమ్‌ను కోలుకోలేని దెబ్బ‌తీశాడు. 4ఓవ‌ర్ల‌లో 19ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3కీల‌క వికెట్లు తీశాడు.
సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన రెండు మ్యాచ్‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఫ్యాన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డంలో ర‌షీద్ ఖాన్ కీ రోల్ ప్లే చేశాడు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ అత‌ను స్టార్ బౌల‌ర్‌గా మార‌డ‌మే కాదు, మ‌రికొన్ని లీగ్‌ల్లో మెర‌వ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది.

నచ్చితే షేర్ చేయ్యండి

Related posts