ఫేస్‌బుక్‌లో ఏ క్రికెట‌ర్ పోటుగాడో తెలుసా…?

నచ్చితే షేర్ చేయ్యండి

ఫేస్‌బుక్‌…ఇప్పుడు యూత్ జపం చేస్తున్నపుస్తకం ఇదే. ఎన్ని బుక్స్ ఉన్నా..ఫేస్‌బుక్ తోడుగా లేకుండా కిక్ లేద‌న్న‌ట్టుగా డీలాప‌డిపోవ‌డం గ్యారెంటీ. అలాంటి ఫేస్‌బుక్‌లో యూత్ ఎక్కువ‌గా ఫాలో అవుతున్న క్రికెట‌ర్ ఎవ‌రో ఉహించ‌గ‌ల‌రా…? అత‌న్ని ఎంత‌లా అభిమానులు ఆరాధిస్తున్నారో తెలిస్తే ఒక్క క్ష‌ణం షాక్ అవ్వ‌కుండా ఉండ‌లేరు. అంతేకాదు..అత‌ను ఏ దేశానికి చెందిన‌వాడో తెలిస్తే మ‌రింత‌గా అవాక్క‌వ‌డం కూడా గ్యారెంటీ.

విరాట్ కోహ్లీ..ఈ ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్‌ని యూత్ ఫుల్‌గా ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌తో పాటు, ట్విట్ట‌ర్‌లోనూ మ‌నోడినే ఎక్కువ‌గా ఫాలో అవుతున్నారు. కోహ్లీ చేసే ప్ర‌తి ప‌నిని వీరంతా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు. అత‌నికి సంబంధించిన ఏ మేట‌రైనా, అభిమానుల‌కు ఫుల్ పండ‌గ అనేలా అప్‌డేట్‌గా ఉంటున్నారు. అంతేకాదు..కోహ్లీతో పాటు మ‌రో తొమ్మిది మంది ప్లేయ‌ర్స్ ప్రొఫెల్స్‌పై ఫ్యాన్స్ ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు.

కోహ్లీ త‌ర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రెండోస్థానంలో ఉన్నాడు. యువ‌రాజ్‌, రోహిత్‌, గౌత‌మ్ గంభీర్‌, భ‌జ్జీ ఇలా అంద‌రూ టాప్‌-10లో మ‌నోళ్లే ప్లేస్ సంపాదించుకుఉన్నారు. చిత్రంగా ఏబీ డివిలియ‌ర్స్ గురించి ఫ్యాన్స్ పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌ప‌ర్చ‌లేదు. అంతేకాదు..ఫ్యాన్స్ మ‌న ప్లేయ‌ర్స్‌పైనే మ‌క్కువ చూపించారు.

ఫేస్‌బుక్‌లో టాప్ -10 ఐపీఎల్ ప్లేయ‌ర్స్‌

ఫేస్‌బుక్‌లో టాప్‌-10 ఐపీఎల్‌ ఆటగాళ్లు
1. విరాట్‌ కోహ్లి (బెంగళూరు)
2 .మహేంద్రసింగ్‌ ధోని (పుణె)
3. యువరాజ్‌సింగ్‌ (హైదరాబాద్‌)
4 .రోహిత్‌ శర్మ (ముంబయి)
5 .షకిబ్‌ అల్‌ హసన్‌ (కోల్‌కతా)
6. క్రిస్‌ గేల్‌ (బెంగళూరు)
7. శిఖర్‌ ధావన్‌ (హైదరాబాద్‌)
8. గౌతమ్‌ గంభీర్‌ (కోల్‌కతా)
9. హర్భజన్‌సింగ్‌ (ముంబయి)
10. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (పంజాబ్‌)


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts