హైద‌రాబాద్‌కి ఐపీఎల్‌-10 బై…బై…?

నచ్చితే షేర్ చేయ్యండి

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ – 10 ఆరంభ వేడుకలపై సస్పెన్స్ కొనసాగుతుంది. హెచ్‌సీఏ సిబ్బంది, గ్రౌండ్స్‌మెన్‌ సమ్మె ప్రభావం ఆరంభోత్సవానికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. సిబ్బంది సమ్మెపై బెట్టు వీడకపోతే.. ఐపీఎల్ ఆతిథ్యంపై హైదరాబాద్ ఆశలు వదులుకోవాల్సిందే. అటు సమ్మె ఎఫెక్ట్ తో ఏర్పాట్లను గ్రాండ్ గా చేయాలని భావించిన ఈవెంట్‌ నిర్వాహక సంస్థ ఐఎంజీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

వచ్చే నెల 5న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఒక రోజు ముందు ఐపీఎల్‌-10 ఆరంభోత్సవం ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభ వేడుకలు ఉప్పల్‌ స్టేడియంలోనే జరగాలి. ప్రారంభోత్సవానికి తక్కువ చాలా తక్కువ టైమ్ ఉంది. ఇప్పటి వరకు ఉప్పల్‌ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. ఐఏంజీ, సన్ రైజర్స్ సిబ్బంది స్వయంగా వెళ్లి సిబ్బందితో మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది. జీతాలు, ఇతర బిల్లులు కలుపుకుంటే కోటి రూపాయలకు పైగానే తమకు రావాల్సి ఉందని.. హెచ్ సి ఏ ఆ మొత్తం ఇస్తేనే సమ్మె విరమిస్తామని తెగేసి చెప్పారు సిబ్బంది.

ఇక్కడ సిట్యువేషన్ ను ఎప్పటికప్పడు గమనిస్తున్న బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికలపై దృష్టి సారించింది. ఆరంభోత్సవాన్ని బెంగళూరుకు తరలించి.. ఉప్పల్ లో జరగాల్సిన మ్యాచ్ లను విశాఖలో నిర్వహించాలని భావిస్తోంది. హెచ్ సి ఏ నిర్వాకంతో హైదరాబాద్్ క్రికెట్ అభిమానులు చాలా నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉప్పల్ లోనే మ్యాచ్ లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts