పంబ‌రేపిన ప్ర‌ణీత్‌..నిజ‌మాబాద్ నైట్స్ సూప‌ర్ విక్ట‌రీ

నచ్చితే షేర్ చేయ్యండి

తెలంగాణ టీట్వంటీ లీగ్ ఆస‌క్తిక‌రంగా జ‌రుగుతోంది. తొలి రోజు నుంచే అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న ఈ లీగ్‌, మూడో రోజు అదే జోరుతో దూసుకెళ్తోంది. శ్రీనిధి థండ‌ర్స్‌, నిజామాబాద్ నైట్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఫ్యాన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీనిధి థండ‌ర్స్ టీమ్‌, 20ఓవ‌ర్ల‌లో 5వికెట్లు కోల్పోయి 178ప‌రుగులు చేసింది. ఆ టీమ్‌లో ప్రిన్స్ 56బంతుల్లో 5ఫోర్లు, ఆరు భారీసిక్స‌ర్ల‌తో 81ప‌రుగులు చేశాడు. అత‌నికి తోడుగా అనురాగ్ విట్ట‌ల్ 43 బంతుల్లో 4ఫోర్లు, ఐదు భారీ సిక్స‌ర్ల‌తో 74ప‌రుగులు చేశాడు.

179ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నిజామాబాద్ నైట్స్‌, చివ‌రి ఓవ‌ర్‌లో విజ‌యం సాధించారు. ఆ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. త‌న‌య్ త్యాగ‌రాజ‌న్ 38బంతుల్లో 9ఫోర్లు, మూడు భారీ సిక్స‌ర్ల‌తో 68ర‌న్స్ చేశాడు. అయితే, చివ‌ర్లో ప్ర‌ణీత్ రెడ్డి కేవ‌లం 11బంతుల్లోనే 4భారీ సిక్స‌ర్లు, ఫోర్‌తో 32ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. అత‌ను టీమ్ విక్ట‌రీలో కీ రోల్ ప్లే చేశాడు. ప్ర‌ణీత్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ల‌భించింది.

 


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts