వివేక్ నుంచి ప్రాణ‌హాని ఉంది..శేషునారాయ‌ణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

నచ్చితే షేర్ చేయ్యండి

హెచ్‌సీఏ సెక్ర‌ట‌రీ శేషునారాయ‌ణ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. అధ్య‌క్షుడు జి. వివేకానంద‌ నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని, తెల్లారేస‌రికి ప్రాణాల‌తో ఉంటానో లేదో తెలియ‌ద‌న్నాడు. త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా వివేక్ నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని, బ్ర‌తికి ఉంటే, రేపు ప్రెస్‌మీట్ పెడ్తాన‌న్నాడు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై త‌న‌కి పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్న ఆయ‌న‌… త‌న‌ని స‌స్పెన్ష‌న్ చేసే హ‌క్కు , వివేకానంద‌కు లేద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న ఇంట్లో భార్య‌తో పాటు పిల్ల‌ల‌కు, ముందుగానే ఓ నోట్ రాసి ఇస్తున్న‌ట్టు శేషునారాయ‌ణ్ చెప్ప‌డం ఇప్పుడు అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది.

న‌న్ను బ‌తికించుకుంట‌రా…చంపేసుకుంటారా అంటూ…స‌స్పెన్ష‌న్ వేటుపై ఆరాతీసిన మీడియా మిత్రుల‌తో శేషునారాయ‌ణ‌ ఆవేద‌న చెందాడు. అధికారాన్ని, డ‌బ్బును అడ్డంగా పెట్టుకోని త‌న‌ని బెదిరిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పాడు. క‌మిటీ మెంబ‌ర్స్ ముందు త‌న‌ని వివేక్ తీవ్ర ప‌ద‌జాలంతో దూషించాడ‌ని, డిసెంబ‌ర్ 14న క‌మిటీలో ఉన్న స‌భ్యులంద‌రి ముందు త‌న‌ని అవ‌మానించాడ‌న్నారు. లోథా క‌మిటీ సిఫార‌సుల ప్ర‌కారం ముందుకు వెళ్తుతున్న త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

సాయంత్రం వ‌ర‌కు స‌స్పెన్ష‌న్‌పై శేషునారాయ‌ణ ఎలా స్పందిస్తాడ‌ని ఎదురుచూసిన మీడియా మిత్రుల‌కు, ఈ వ్యాఖ్య‌లు ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గురిచేశాయి. ఎప్పుడూ విమ‌ర్శ‌ల‌పై త‌న‌దైన స్ట‌యిల్లో ఘాటు విమ‌ర్శ‌లు చేసే శేషునారాయ‌ణ్ ఇలా మాట్లాడ‌టం ఒక్క‌సారిగా అవాక్క‌య్యేలా చేసింది. అంతేకాదు…అంత‌లా ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుంది, జ‌రిగింది అనేది ఇంట్రెస్ట్‌ను పెంచింది. వృత్తిప‌ర‌మైన విష‌యాలు కాస్త వ్య‌క్తిగ‌తంగా మారాయ‌ని, అలాగే….ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల స్థానంలో ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల దాడిలా మారింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వ్య‌వ‌హ‌రం రానున్న 24గంట‌ల్లో ఎటువైపు వెళ్తుంద‌నేది కీల‌కంగా మారింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts