న‌న్ను ఫిక్సింగ్ చేయ‌మ‌ని బుకీలు వెంట‌ప‌డ్డారు

నచ్చితే షేర్ చేయ్యండి

మ‌లేసియా స్టార్ ష‌ట్ల‌ర్ లీ చోంగ్ వి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. మ్యాచ్‌ల‌ను ఫిక్సింగ్ చేయాల‌ని బుకీలు త‌న‌ను తీవ్రంగా వేధించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. చాలా మ్యాచ్‌ల వ‌ర‌కు వారు వెంటాడ‌ర‌ని, అయితే, తాను ఎక్క‌డ త‌న మ‌నో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్లాన‌న్నాడు. అయితే, ప్రస్తుతం త‌న టీమ్‌లోని ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డర‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొవ‌డం తీవ్రంగా బాధిస్తుంద‌న్నాడు. వారిద్ద‌రు త్వ‌ర‌లోనే విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.

మ‌లేసియా స్టార్ ష‌ట్ల‌ర్ లీ చోంగ్ వి…వ‌ర‌ల్డ్‌లోనే ది బెస్ట్ ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అలాంటి ఆట‌గాడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అంత‌టా హాట్‌టాపిక్‌గా మారాయి. మ‌రోవైపు, అత‌ను గ‌తంలో డోపింగ్‌లో ప‌ట్టుబ‌డ్డాడు. ఆ టైమ్‌లోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, ఆట‌లో రీ ఎంట్రీ ఇచ్చాకా…లీ మెరుగైన ఆట‌తీరుతో అంద‌రి మ‌న‌సులు గెల్చుకున్నాడు. అలాంటి ష‌ట్ల‌ర్‌, ఇలా ఫిక్సింగ్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌ట‌మే కాకుండా, త‌న‌ని కూడా సంప్ర‌దించార‌ని చెప్ప‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

ఇటీవ‌ల లీ చోంగ్ వి…సెక్స్ వీడియో బ‌య‌ట‌కు రావ‌డం హీట్‌ను పెంచింది. అయితే, ఆ వీడియోలో ఉన్న‌ది తాను కాద‌ని, ఎవ‌రో త‌న ఫేస్‌ను మార్ఫింగ్ చేసి ఇలా చేశార‌ని మండిప‌డ్డాడు. దీనిపై ప్ర‌స్తుతం ఎంక్వైరీ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే లీ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేశారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts