త‌ల‌కు బాల్ త‌గిలి…సిక్స‌ర్‌గా మారింది

నచ్చితే షేర్ చేయ్యండి

బంతి మ‌రోసారి కంగారుపెట్టింది. ఏకంగా బౌల‌ర్ త‌ల‌ను బ‌లంగా తాకి, సిక్స‌ర్ వెళ్లింది. ఇది కాస్త ఆశ్చ‌ర్యం క‌ల్గించినా…బౌల‌ర్‌కు ఎలాంటి గాయం కాక‌పోవ‌డంతో అంద‌రూ రిలీఫ్ అయ్యేలా చేసింది. న్యూజిలాండ్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కు గురిచేస్తూనే, ఔరా ఎంత ల‌క్కీఫెల్లో బౌల‌ర్ అనుకునేలా చేసింది.

కివీస్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఆక్లాండ్ బ్యాట్స్‌మెన్ జీత్ రావ‌ల్ బలంగా కొట్టిన షాట్‌, బౌల‌ర్ ఆండ్రూ ఎలిస్ త‌ల ముందు భాగంలో త‌గిలింది. అంతేకాదు, అత‌ని త‌ల‌ను తాకి, ఆ బంతి నేరుగా బౌండ‌రీలైన్ దాటింది. అయితే, బాల్ తాకిన బౌల‌ర్ ప‌రిస్థితిని త‌లుచుకోని ఒక్క‌సారిగా అంద‌రూ ఊలిక్కిప‌డ్డారు. అస‌లేం జ‌రిగిందో అర్థం చేసుకోని తెరుకునేలోపే బౌల‌ర్ రిలాక్స్ క‌నిపించ‌డంతో షాక‌య్యారు. బంతి బ‌లంగా తాకినా…బౌల‌ర్‌కి అదృష్ట‌వ‌శాత్తు ఏమీ కాలేదు. త‌ల‌ను చేత్త రుద్దుకుంటూ, కాసేపు బ్రేక్ తీసుకున్నాడు.

డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన టైమ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అత‌నికి అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేసింది. బ్యాట్స్‌మెన్ కూడా కాసేపు షాక్‌లోకి వెళ్లాడు. అయితే, అత‌నికి చిన్న గాయం కూడా కాలేద‌ని, ఎవ‌రూ కంగారుప‌డాల్సిన‌వ‌స‌రం లేద‌ని కివీస్ బోర్డ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అంతేకాదు, ఎలిస్ త‌ర్వాత ఫీల్డ్‌లోకి వ‌చ్చి ఆరు ఓవ‌ర్లు బౌలింగ్ చేశాడు. త‌న‌కిష్ట‌మైన ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఏదీ ఏమైనా..ఈ సంఘ‌ట‌న ఒక్క‌సారిగా క్రికెట్ లోకాన్ని కంగారుప‌డేలా చేసింది.

 


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts