ధోనీ 3ఫోన్లు కొట్టేసింది ఎవ‌రో తెలిస్తే షాకే..!

నచ్చితే షేర్ చేయ్యండి

సందట్లో సడేమియాలా దొంగలు చేతివాటం చూపించారు. అది కూడా మామూలు చేతివాటం కాదు.. చాలా కాస్ట్ లీ సెల్ ఫోన్స్, చాలా తెలిపిగా కొట్టేశారు. ఢిల్లీలో మిస్టర్ కూల్ ధోనీ బస చేసిన హోటల్ లో ఈ చోరీ ఘటన జరిగింది. ఫోన్లు పోతే మళ్లీ కొనొచ్చు. కానీ అందుులో చాలా కీలకమైన విషయాలున్నాయి. దీంతో కంగారపడ్డ జార్ఖండ్ డైనమేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విజయ హజారే ట్రోఫీ సెమీఫైనల్ లో భాగంగా ఢిల్లీలోని ఓ హోటల్ లో క్రికెటర్లు బస చేశారు. వీరిలో ధోనీ కూడా ఉన్నాడు. అయితే ఆ హోటల్ లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరిగింది. అలర్టయిన సెక్యూరిటీ, హోటల్ సిబ్బంది ఆటగాళ్లందర్ని హోటల్ బయటకు పంపించారు. కానీ అప్పటికే క్రికెట్ సభ్యుల కిట్‌ కాలిపోయింది. మరోవైపు ఇదే అదనుగా ధోనీ మూడు సెల్ ఫోన్లు గాయబ్ అయ్యాయి.

అంతా అయిపోయాక హోటల్ లోకి వెళ్లి చూస్తే సెల్ ఫోన్లు కనిపించకపోవడంతో ధోనీ షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ లోకి ఎంటరైన పోలీసులు.. తమదైన స్టయిల్ లో విచారణ చేపట్టారు. చివ‌రికి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ధోనీకి అప్పగించారు. మొబైల్స్ లో బీసీసీఐకి సంబంధించిన కీలక సమాచారం ఉందని.. అవి దొరకడంతో ఉపిరి పీల్చుకున్నాడు ధోనీ. క‌ట్ చేస్తే, ఇవి దొంగిలించింది, మంట‌లు ఆర్పడానికి వ‌చ్చిన వ్య‌క్తే ఫోన్లు ఎత్తుకెళ్లాడ‌ట‌. ఈ విష‌యం తెలిసి అంద‌రూ అవ‌క్కాయ్యార‌ట‌.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts