వార్న‌ర్ వాయించాడు…వార్ వ‌న్‌సైడైంది

నచ్చితే షేర్ చేయ్యండి
ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ అదిరే విక్ట‌రీని ఖాతాలో వేసుకుంది. గుజ‌రాత్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా విజ‌యాన్ని ద‌క్కించుకుంది. మొద‌ట బౌల‌ర్లు, త‌ర్వాత బ్యాట్స్‌మెన్ జంట‌గా కుమ్మేయ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస‌గా రెండో గెలుపును సొంతం చేసుకుంది. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఛేజింగ్‌లో టీమ్‌ను ముందుండి న‌డిపించాడు.
ఆరంభం నుంచే దూకుడు
136ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్‌కు ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అదిరే ఆరంభాన్నిచ్చాడు. వ‌రుస బౌండ‌రీల‌తో స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ముందుగానే స్పిన్న‌ర్ల‌ను బ‌రిలోకి దించినా..స్వ‌యంగా రైనానే బౌలింగ్‌కు వ‌చ్చినా వార్న‌ర్ అస‌లేమాత్రం కంగారుప‌డ‌కుండా టీమ్‌ను టార్గెట్ వైపు తీసుకెళ్లాడు. శిఖ‌ర్ ధావ‌న్ త్వ‌ర‌గానే ఔట‌య్యినా…వార్న‌ర్ మాత్రం వాయించుడు త‌గ్గించ‌లేదు.
అస‌లేమాత్రం ఆక‌ట్టుకోని ల‌య‌న్స్ బౌల‌ర్లు…
టార్గెట్ చిన్న‌దే..అయినా కాస్తో కూస్తో ఆక‌ట్టుకుంటార‌నున్న ల‌య‌న్స్ బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. వారి బౌలింగ్‌ను వార్న‌ర్‌, హెన్రిక్స్ వాయించి వ‌దిలిపెట్టారు. ఆరుగురు బౌల‌ర్ల‌ను వీళ్లిద్ద‌రూ క‌లిసి ఉతికి ఆరేశారు. వీరిద్ద‌రూ అర్థ‌సెంచ‌రీల‌తో పూర్తిగా మ్యాచ్‌ను వ‌న్‌సైడ్‌గా మార్చేశారు. లాస్ట్ మ్యాచ్‌లోనూ హెన్రిక్స్ అర్థ‌సెంచ‌రీతో స‌త్తాచాటాడు.

నచ్చితే షేర్ చేయ్యండి

Related posts