క‌బ‌డ్డీ కామెంట్రీలో క్రికెట‌ర్ మాట‌ల‌ బౌన్స‌ర్లు

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ ఎంతో నేర్పిందో….కామెంట్రీ అంత గుర్తింపు నిచ్చింది
చేసే ప‌నిపై శ్ర‌ద్ధ ఉండ‌టం వ‌ల్లే కామెంట్రీ బాగా చెప్పా
ప్రొ క‌బ‌డ్డీ తెలుగు టీమ్ స‌హ‌కారం మ‌రిచిపొలేనిది
ఎమ్మెస్కే ప్ర‌సాద్ ఆద‌ర్శం…..శ్రీమ‌తి నా బ‌లం

1. ప్రొఫెష‌న‌ల్ క్రికెట్ టు…ప్రొఫెష‌న‌ల్ కామెంట్రీ ఎలా ఉంది జ‌ర్నీ…?

క‌ళ్యాణ్ కృష్ణ – ఇదో అంద‌మైన ప్ర‌యాణం. జీవితం అంటే ఏంటో క్రికెట్ చూపించింది. కామెంటేట‌ర్‌గా జ‌ర్నీ అంత‌కుమించి అనేలా ఉంది. కార‌ణం, ఆట‌కు వీడ్కోలు ప‌లికాక కూడా, ఆ ఆట‌తోనే ముందుకెళ్తుండ‌టం ఏ క్రీడాకారుడికైనా గొప్ప విష‌య‌మే. ప్ర‌స్తుతం….కామెంట్రీతో ప్రేమ‌లో ఉన్నా.

2. క్రికెటే జీవితంగా పెరిగిన మీరు, క‌బ‌డ్డీ ఎక్స్‌ప‌ర్ట్‌గా మారారు…?

క‌ళ్యాణ్ కృష్ణ – ఈ విష‌యంలో ఎమ్మెస్కే ప్ర‌సాద్ (భార‌త క్రికెట్ టీమ్ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌) గారికి రుణ‌ప‌డి ఉంటా. నా పేరును సోని నెట్‌వ‌ర్క్‌కి ప్ర‌తిపాదించింది ఆయ‌నే. ఆయ‌న ఇచ్చిన ప్రొత్సాహంతోనే వ‌రుస‌గా రెండుసార్లు ఐపీఎల్‌కి తెలుగులో కామెంట్రీ చెప్పా. ఆ స‌మ‌యంలోనే నా వాయిస్ విన్న‌ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్ టాలెంట్ హంట్ టీమ్‌కి చెందిన ఆదిల్ మిస్త్రీ, ఆడిష‌న్‌కి రావాల‌న్నారు. నా గొంతు విన్నాకా ఆయ‌న‌, క‌బ‌డ్డీకి కామెంటేట‌ర్‌గా చేయాల‌ని కోరారు. అంతేకాదు, వ‌ర్క్‌షాప్ పూర్త‌య్యాకా…క‌బ‌డ్డీ ఎక్స్‌ఫ‌ర్ట్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

3. కామెంటేట‌ర్‌గా, క‌బ‌డ్డీ ఎక్స్‌ప‌ర్ట్‌గా ఎలా మెరుగ‌య్యారు…?

క‌ళ్యాణ్ కృష్ణ – ఈ రెండింట్లో నేను స‌క్సెస్ అయ్యేలా చేసింది స్టార్ స్పోర్ట్సే. వాళ్లు నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌తో ఎంతో నేర్చుకున్నా. నాతో పాటు కామెంట్రీ చెప్పిన రాధిక‌, మాధ‌వి బండారి స్వ‌యంగా క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్‌. వాళ్ల నుంచి విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు పొందా. స్కూల్లో క‌బ‌డ్డీ ఆడిన అనుభ‌వం ఉన్నా వీళ్ల స‌హ‌కారం వ‌ల్లే అదంతా మాట‌ల్లో చెప్ప‌గ‌లిగా. ఇక‌, ఎక్స్‌ఫ‌ర్ట్‌గా, ప్రొడ్యూస‌ర్స్ ఇచ్చిన ఉత్సాహంతో ముందుకెళ్లా. మొత్తంగా…క‌బ‌డ్డీ సీజ‌న్ అయ్యేస‌రికి నాలో నేనే మార్పును గ‌మ‌నించా. ఆస‌క్తిక‌రంగా నా స్నేహితులంద‌రూ, నువ్వు క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌వా…క్రికెట‌ర్‌వా..ఇంత బాగా కామెంట్రీ చెబుతున్నావ్ అంటూ ఆట‌ప‌ట్టించారు.. అది మ‌రిచిపొలేని కాంప్లీమెంట్‌

4. మ‌ధ్య‌లో యాంక‌ర్‌గా కూడా మారారు..? మూడింట్లో మంచి మార్కులే ప‌డ్డాయి..ఎలా సాధ్య‌మైంది..?

క‌ళ్యాణ్ కృష్ణ – ఏదైనా చేయాల‌నుకునేట‌ప్పుడు నన్ను నేను అందుకు త‌గ్గ‌ట్టుగా సిద్ధం చేసుకుంటా. అదే నా స‌క్సెస్‌కి ప్ర‌ధ‌మ సూత్రం. ప్ర‌జెంట‌ర్‌గా కొత్త అవ‌తార‌మే అయినా…..నా ప్రొడ్యూస‌ర్ వెంక‌ట్ రేగ‌ళ్ల స‌హ‌కారంతో నాలోని మ‌రో టాలెంట్‌ను అంద‌రికి ప‌రిచ‌యం చేశా. ఈ విష‌యంలో వెంక‌ట్‌కి నా థ్యాంక్స్‌. అలాగే, స్టార్ స్పోర్ట్స్‌కి కూడా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి నా మీద న‌మ్మ‌కం ఉంచినందుకు.

5. మీలో మ్యాట‌ర్ ఎక్కువే ఉంది. కానీ, మీట‌ర్ కంటే చాలా త‌క్కువే ప్ర‌ద‌ర్శ‌న చేశార‌నే మాట‌ల‌పై..?

క‌ళ్యాణ్ కృష్ణ – ఏం చేసిన వంద శాతం ప్ర‌య‌త్నించ‌డం నా అల‌వాటు. ఏ ప్రొఫెష‌న్‌లో ఉన్నాఆ ప‌నిని ఎంజాయ్ చేస్తా. అలాగే, క‌ష్టప‌డితే రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని న‌మ్ముతా. క‌బ‌డ్డీతో తొలిసారి ప్ర‌యాణం చేసినా, అది చాలా బాగా జ‌రిగింది. ఇంకా బాగా వేగంతో ముందుకెళ్ల‌గ‌ల‌నే న‌మ్మ‌కం ఇచ్చింది. నేను ప‌దాల్లో ప‌లికే స్ప‌ష్ట‌త‌, తెలుగుపై నాకున్న ప్రేమ‌, కామెంట్రీ మ‌రింత విన‌సొంపుగా మార్చేయ‌డ‌మే కాదు, నాకు కూడా ఆస‌క్తి మ‌రింత పెరిగేలా చేసింది. మీర‌న్న‌ట్టుగా…రాబోయే రోజుల్లో 100శాతం న‌న్ను నేను చూపిస్తా.

6. క‌బ‌డ్డీ గురించి మాట్లాడే టైమ్‌లో మీ గురించి విన్న గాసిప్‌…?

క‌ళ్యాణ్ కృష్ణ – గాసిప్స్ ఎప్పుడూ నాలో కాన్ఫిడెన్స్ లెవ‌ల్‌ను పెంచేవే. క్రికెట‌ర్‌, క‌బ‌డ్డీ ఎక్స్‌ప‌ర్ట్ ఏంటి..? అంటూ నా వెన‌కాల చాలానే మాట్లాడారు. స్పోర్ట్‌పై ప్రేమ ఉంటే చాలు. ఆ ఆట గురించి మ‌న‌కు అవ‌గాహ‌న ఉంటే చాలు అనేది నేను న‌మ్మిన సిద్ధాంతం. అందుకే, వెన‌కాల మాట్లాడే మాట‌ల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోను.

7. మీ కంటే సీనియ‌ర్ల‌ను కాద‌ని మీకు చాన్స్ ఇచ్చారు..మీలో ఉన్న స్పెషాలిటి ఏంటి..?

క‌ళ్యాణ్ కృష్ణ – స్ర్కీన్‌పై నేను క‌నిపించే తీరు, నా కాన్ఫిడెన్స్‌, భాష‌పై నాకున్న ప‌ట్టు…వీట‌న్నింటికంటే నా స్వ‌రం. వీటివ‌ల్లే, సీనియ‌ర్స్ ఉన్నా, అ అవ‌కాశం నా వైపు వ‌చ్చిందనుకుంటా. ఏదైనా త్వ‌ర‌గా నేర్చుకుంటాన‌ని మా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎప్పుడూ చెబుతుంటారు

8. ఐపీఎల్‌లో – 11 ఎడిష‌న్‌లో ఎలాంటి రోల్ ప్లే చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు..?

క‌ళ్యాణ్ కృష్ణ – ఐపీఎల్ ఓ పెద్ద మెగా ఈవెంట్‌. స్టార్ స్పోర్ట్స్ ఆ లీగ్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. అందులోనూ నేను భాగ‌స్వామిగా మారుతాన‌ని బ‌లంగా న‌మ్ముతున్నా. ఎలాగూ క్రికెట‌ర్‌ని కాబ‌ట్టి, మ‌రింత మెరుగ్గా నా కామెంట్రీతో అంద‌రిని అల‌రిస్తాన‌ని న‌మ్మ‌కంగా ఉన్నా.

9. మీకిష్ట‌మైన కామెంటేట‌ర్ ఎవ‌రు…? క‌బ‌డ్డీ, క్రికెట్‌కి కామెంట్రీలో ఉన్న తేడా ఏంటి..?

క‌ళ్యాణ్ కృష్ణ – ర‌విశాస్త్రి అంటే చాలా ఇష్టం. ఆయ‌న గొంతులో ఏదో మాయ ఉంటుంది. భాష‌పై ఉన్న ప‌ట్టు నిజంగా అద్భుతం. ఎక్క‌డికెళ్తే, అక్క‌డి భాష‌లో, యాస‌లో ఆయ‌న ప‌లికే సింగిల్ డైలాగ్‌, ఆన్ ద ఫీల్డ్‌లో జ‌రిగే యాక్ష‌న్‌కు గొంతుతో ఆయ‌నిచ్చే రియాక్ష‌న్ ఆ సీన్‌ను అద్భుతంగా పండిస్తాయి.

10. మిమ్మ‌ల్ని బాగా ఎంక‌రేజ్ చేసిన వ్య‌క్తి ఎవ‌రు ప్రొ క‌బ‌డ్డీ లీగ్ టైమ్‌లో..?

క‌ళ్యాణ్ కృష్ణ – సుధీర్ మ‌హ‌వాది, సిహెచ్‌. వెంక‌టేష్, ఐపీఎల్ కామెంట్రీ స‌మ‌యంలో చాలా విలువైన సూచ‌న‌లు ఇచ్చారు. అలాగే మా ప్రొడ్యూస‌ర్ వెంక‌ట్ రేగ‌ళ్ల చాలా బాగా ఎంక‌రేజ్ చేశాడు. క‌బ‌డ్డీ గురించి సీనియ‌ర్ కామెంటేట‌ర్స్ మాధ‌వి, రాధిక‌ల నుంచి నేర్చుకున్నా. అంద‌రూ టీమ్ వ‌ర్క్ అని న‌మ్మ‌డంతో నా ప‌ని కూడా సులువైంది.

11. మీ కో కామెంటేట‌ర్స్‌తో మీకున్న అనుబంధం..?

క‌ళ్యాణ్ కృష్ణ – క‌బ‌డ్డీతో తొలిసారి నా అనుబంధాన్ని పెంచుకునే స‌మ‌యంలో, మిగిలిన కామెంటేట‌ర్ల నుంచి వ‌చ్చిన స‌హ‌కారం మ‌ర‌చిపొలేనిది. వాళ్లు, ప్ర‌తి ఫ్రేమ్‌లో న‌న్ను బాగా ఎంక‌రేజ్ చేశారు. నా ఇష్టానికి తోడు, వారి స‌ల‌హాలు వ‌ర్క‌వుట్ అయ్యాయి.

12. ఫ్యూచ‌ర్‌లో కామెంటేట‌ర్ క‌మ్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మ్ యాంక‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ఎలా క‌నిపించ‌బోతున్నాడు.?

క‌ళ్యాణ్ కృష్ణ – భ‌విష్య‌త్‌లో మరిన్ని మెరుగైన రోల్స్‌లో క‌నిపించేందుకు ప్ర‌య‌త్నిస్తా. అలాగే, ఒక్కొ వ్య‌క్తి నుంచి ఒక్కొ ల‌క్ష‌ణాన్ని తీసుకుంటూ ముందుకెళ్తా. ఫ‌ర్ ఎగ్జాంపుల్ వింధ్య యాంక‌రింగ్ చేసిన‌ప్పుడు ఆమెలోని క్వాలిటీస్‌ని కొన్ని నేను యాంక‌రింగ్ చేసే టైమ్‌లో ఉప‌యోగించా. భ‌విష్య‌త్‌లో కామెంట్రీ, ఎక్స్‌ఫ‌ర్ట్‌, యాంక‌రింగ్ విష‌యంలో నా నుంచి మ‌రింత మెరుగైన తీరును ఖ‌చ్చితంగా చూస్తారు.

13. వ్య‌క్తిగ‌త జీవితం గురించి…?

క‌ళ్యాణ్ కృష్ణ – నాకున్న అతిపెద్ద బ‌లం నా శ్రీమ‌తి. ఆమె ఇచ్చిన ప్రొత్స‌హంతోనే ముందుకెళ్తున్నా. న‌న్ను ఎంక‌రేజ్ చేస్తున్న ఆమెకు స్పెష‌ల్ థ్యాంక్స్‌. నేను చేసి ప్ర‌తి ప‌ని నా ఇష్ట‌ప్ర‌కార‌మే చేస్తా. ఎవ‌రి బ‌లవంతం ఉండ‌దు. సూటిగా ఉంటా. కుకింగ్ చేయ‌డం అంటే చాలా ఇష్టం. ఫిషింగ్ అల‌వాటు. త్వ‌ర‌లోనే భారీ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నా.

వెంక‌ట్ రేగ‌ళ్ల‌


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts