జూనియ‌ర్స్‌..దేశం మీసం మెలేశారు

నచ్చితే షేర్ చేయ్యండి

జూనియ‌ర్ హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ఫైట్ చూశాకా ప్ర‌తి ఒక్క‌రు ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. సీనియ‌ర్లు సైతం ఇంత‌లా అదిరే ఆట‌తీరుతో ఎంట‌ర్‌టైన్ చేసిన సంద‌ర్భాలు లేవ‌నేలా దుమ్మురేపారు. అస‌లేమాత్రం త‌డ‌బ‌డ‌కుండా, ప్ర‌త్య‌ర్థిపై పూర్తి పై చేయి సాధించి స‌త్తాచాటారు. హోరాహోరీ అనే మాట‌కు చాన్స్ లేకుండా..వార్ వ‌న్‌సైడ్ అనేలా అద‌ర‌గొట్టారు. ల‌క్నోలో జ‌రిగిన పోటీలో భార‌త కుర్రాళ్లను ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంక‌రేజే చేశారు. అంతేకాదు…బెల్జియం ముందే డీలా ప‌డేలా చేశారు. ఆట ఆరంభ‌మైన ఎనిమిదో నిమిషంలో తొలి గోల్‌తో బార‌త్ లీడ్‌లోకి వెళ్లింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే మ‌రో గోల్‌ను చేసింది. దీంతో ఆట తొలి భాగం ముగిసే స‌రికి భార‌త్ 2-0తో లీడ్‌లో నిలిచింది. అంతేకాదు..బెల్జియంను పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా  చేసింది. అభిమానుల కోలాహ‌లం కూడా మ‌నోళ్ల‌కు క‌ల‌సివ‌చ్చింది. రెండో భాగంలో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

భార‌త్ చేతిలో పాక్ చిత్తు

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త్ మ‌రోసారి పాకిస్తాన్‌పై పై చేయి సాధించింది. ఇప్ప‌టికే క్రికెట్‌లో తిరుగులేని విజ‌యాల్ని సాధిస్తున్న భార‌త్ తాజాగా హాకీలోనూ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ విజ‌యాన్ని బోర్డ‌ర్‌లో పోరాడుతున్న ఇండియ‌న్ ఆర్మీకి అంకిత‌మిచ్చింది. క్వాంటన్‌లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్‌ హాకీ టోర్నీలో భార‌త్‌ 3-2 పాయింట్ల తేడాతో పాక్‌ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ టోర్నీలో భార‌త్‌కు ఇది రెండో విజయం. ఈ మ్యాచ్‌లో తొలి క్వార్టర్‌ ఎలాంటి గోల్‌ లేకుండా ముగిసింది. అయితే రెండో క్వార్టర్‌లో శ్రీజేశ్‌ సేన ధాటిగా ఆడింది. పర్దీప్‌మోర్  మ్యాచ్ 22వ నిమిషంలో అద్భుతమైన గోల్‌ చేసి 1-0తో భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే పాక్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ సీనియర్ 31వ నిమిషంలో గోల్‌ చేసి స్కోర్‌ సమం చేశాడు. ఆ తర్వాత 8 నిమిషాల్లోనే మహ్మద్‌ ఇర్ఫాన్‌…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆసియాక‌ప్ హాకీ విజేత భార‌త్

నచ్చితే షేర్ చేయ్యండి

ఆసియాకప్ హాకీలో భార‌త్ విజ‌య‌ఢంకా మోగించింది. ఫైన‌ల్లో ఆతిథ్య జ‌ట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ కైవ‌సం చేసుకుంది. అండర్‌-18 హాకీ టోర్నీలో భారత్ తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. సెమీఫైన‌ల్లో దాయాదీ పాకిస్తాన్‌ను ఓడించిన భార‌త్‌, అదే ఊపులో ఫైన‌ల్లో కూడా విజ‌యం సాధించింది. ఢాకా వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌ను 5-4 తేడాతో మట్టికరిపించింది. సెమీఫైనల్లో దాయాది పాకిస్థాన్‌ను 3-1తో చిత్తుచేసి ఫైనల్లో అడుగుపెట్టిన భారత్‌.. రెండో సారి ఈ ట్రోఫీని ముద్దాడి రికార్డు సృష్టించింది. ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లా చేతిలో 4-5తో పోరాడి ఓడిన టీమిండియా ఫైనల్లో అదే స్కోరు 5-4తో బంగ్లాను చిత్తు చేయడం విశేషం. వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ సింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పాకిస్తాన్‌ను మ‌ట్టిక‌రిపించిన భార‌త్

నచ్చితే షేర్ చేయ్యండి

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ ద‌గ్గ‌ర ఒక‌వైపు ఉగ్ర స్థావరాలపై భారత్‌ సైన్యం మెరుపు దాడులు చేస్తుంటే, మ‌రోవైపు హాకీలో పాక్‌ను మ‌ట్టి క‌రిపించింది భార‌త్‌. పాక్ హాకీ జట్టును భారత్‌ కుర్రాళ్లు కుమ్మేశారు. అండర్‌-18 ఆసియా కప్‌లో భాగంగా ఢాకాలో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-1తేడాతో పాక్‌పై విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్లు క‌సితో గెలిచారు. మ్యాచ్‌కి ముందే పాక్‌పై గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు భార‌త ప్లేయ‌ర్స్‌. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, భార‌త సైన్యానికి అంకిత‌మిస్తామ‌ని చెప్పారు. చెప్పిన‌ట్టుగానే 3-1 పాయింట్ల తేడాతో విజ‌యం సాధించారు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

చ‌రిత్ర సృష్టించిన భార‌త్

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త హాకీ టీమ్ చ‌రిత్ర సృష్టించింది. 34 ఏళ్ల త‌ర్వాత చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌కు ప‌త‌కాన్ని తెచ్చి పెట్టింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మి చ‌విచూసిన భార‌త్ టీమ్‌, ర‌జ‌త ప‌త‌కాన్ని దేశానికి తీసుకొచ్చింది. 1978లో ఈ టోర్నీని ప్రారంభించిన తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌,  ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో ఓడిపోయింది. అయినా సరే భారత్‌కు ఇది గొప్ప విజయమే. 1982 ఆమ్‌స్టర్‌డ్యామ్‌ టోర్నీలో కాంస్యం సాధించడమే భారత ఉత్తమ ప్రదర్శన. ఆ త‌ర్వాత తాజాగా ర‌జ‌త ప‌త‌కం సాధించ‌డంతో భార‌త ప్ర‌జ‌లు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. భార‌త హాకీ టీమ్‌కు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌చ్చిన‌ట్టేన‌ని భావిస్తున్నారు. ర‌జ‌త ప‌త‌కం సాధించిన హాకీ టీమ్‌కి ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

భార‌త్‌లో మ‌రో మెగా టోర్నీ

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త్ మ‌రో మెగా టోర్నీకి సిద్ధ‌మ‌వుతోంది. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగే ప్ర‌పంచ జూనియ‌ర్ పురుషుల హాకీ టోర్నీ భార‌త్‌లో జ‌ర‌గ‌నుంది. తాజాగా ఈ టోర్నీ కోసం ల‌క్నోను ఎంపిక చేశారు. ఈ టోర్నీ నిర్వ‌హించ‌డానికి భార‌త్ కంటే మంచి దేశం లేద‌ని అంత‌ర్జాతీయ హాకీ స‌మాఖ్య స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తం 16 దేశాల‌కు చెందిన టీమ్‌లు ఇందులో పాల్గొంటాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, ఈజిప్ట్‌, ఇంగ్లాండ్‌, భారత్‌, జపాన్‌, కొరియా, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, స్పెయిన్‌తో పాటు మొత్తం 16 జ‌ట్లు పాల్గొంటాయి. దీంతో ఈ టోర్నీని విజ‌య‌వంతం చేసేందుకు హాకీ ఇండియా అధికారులు ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేస్తున్నారు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వాహ్వా.. పంజాబ్ వారియ‌ర్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

హాకీ ఇండియా లీగ్ కొత్త చాంపియ‌న్‌గా పంజాబ్ వారియ‌ర్స్ అవ‌త‌రించింది. గ‌త రెండు సీజ‌న్ల‌లో చేజారిన టైటిల్‌ను ఈసారి పోరాడి గెలిచి సాధించుకుంది. గ‌త రెండు సీజ‌న్ల‌లో ఫైన‌ల్లో ఓడిపోయింది పంజాబ్ టీమ్‌. ఈసారి మాత్రం ఏ జ‌ట్టుకు ఆ చాన్స్ ఇవ్వ‌లేదు. మూడోసారి మొక్క‌వోని ధైర్యంతో ఆడి, టైటిల్ సాధించుకుంది. ఫైన‌ల్లో 6-1 తేడాతో క‌ళింగ లాన్స‌ర్స్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. పంజాబ్ టీమ్‌లో అర్మాన్ ఖురేషి, మ్యాట్ గోడ్స్, స‌త్భీర్‌సింగ్ గోల్స్ చేశారు. ఇక క‌ళింగ జ‌ట్టు త‌ర‌పున ఒకే ఒక గోల్ కెప్టెన్ మొర్టిజ్ పుయ‌స్టె న‌మోదు చేశాడు. ట్రోఫీ ద్కించుకున్న పంజాబ్ టీమ్‌కి 2.5 కోట్ల ప్రైజ్‌మ‌నీ గెలుచుకుంది. ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్న‌మెంట్‌గా ఎంపికైన రూపింద‌ర్‌పాల్‌సింగ్ 50 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ గెలుచ‌కున్నాడు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ష‌టిల్ పోయి..హాకి వ‌చ్చే..

నచ్చితే షేర్ చేయ్యండి

ఇండియాలో లీగ్స్ సంద‌డి క్యాలెండ‌ర్ ఇయ‌ర్ అంతా చుట్టేస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు *ష‌టిల్ స‌ర్వీస్* అభిమానుల‌ను అల‌రించ‌గా….ఇవాల్టి(జ‌న‌వ‌రి 18) నుంచి హాకీ లీగ్ మొద‌ల‌వుతోంది. గ‌త మూడు సీజ‌న్లుగా అల‌రిస్తున్న హాకీ ఇండియా లీగ్….నాలుగో సీజ‌న్ సిద్ధ‌మైంది. 37 రోజుల పాటు ఈ లీగ్ సాగ‌నుంది. ఈసారి ప్ర‌తీ జ‌ట్టులో భారీ మార్పులు జ‌రిగాయి. భార‌త హాకీ జ‌ట్టు కెప్టెన్ స‌ర్దార్ సింగ్…ఢిల్లీ జ‌ట్టు నుంచి పంజాబ్ వారియ‌ర్స్ కు మారాడు. ఈ లీగ్ లో ఆరు జ‌ట్లు దబంగ్ ముంబై, ఢిల్లీ వేవ్ రైడ‌ర్స్, క‌లింగ లాన్స‌ర్స్, పంజాబ్ వారియ‌ర్స్, రాంచీ రేస్, ఉత్త‌ర ప్ర‌దేశ్ విజార్డ్స్…పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ క‌లింగ లాన్స‌ర్స్ , ఉత్త‌ర ప్ర‌దేశ్ విజార్డ్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ, భువనేశ్వ‌ర్, ముంబై, ల‌క్నో, రాంచి, చండీగ‌ఢ్ న‌గ‌రాల్లో మ్యాచ్ లు జ‌రుగుతాయి.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

హాకీ వ‌ర‌ల్డ్ లీగ్ సెమీస్‌లో ఇండియా

నచ్చితే షేర్ చేయ్యండి

హాకీ వ‌ర‌ల్డ్ లీగ్ ఫైన‌ల్స్‌లో ఇండియా సెమీస్ చేరింది. ఈ టోర్నీ ఆరంభం నుంచి త‌డ‌బ‌డిన భార‌త్‌, క్వార్ట‌ర్స్‌లో మాత్రం అద్భుతంగా రాణించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఉహ‌కు అంద‌కుండా విజ‌యం సాధించి అల‌రించింది. గ్రేట్ బ్రిట‌న్ జ‌ట్టు భార‌త్ దూకుడైన ఆట‌ను చూస్తూ ఉండిపోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోయింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ 2-1తేడాతో విజ‌యం సాధించి వ‌ర‌ల్డ్ లీగ్ ఫైన‌ల్స్ సెమీస్‌లో చేరింది. మ్యాచ్ ఆరంభం నుంచి కాన్ఫిడెంట్‌గా క‌నిపించిన బార‌త్‌..అదే దూకుడు చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించింది. 19వ నిమిషంలో బార‌త్‌కు వీఆర్ రఘ‌నాథ్ భార‌త్‌కు తొలి గోల్ అందించాడు. ఆ త‌ర్వాత 39వ నిమిషంలో త‌ల్వింద‌ర్ సింగ్ మ‌రో గోల్ చేసి భార‌త్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఈ టైమ్‌లో గ్రేట్ బ్రిట‌న్ తొలి గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1తో కాస్త త‌గ్గించాడు. ఈ టైమ్‌లో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నా హాకీస్టిక్ చెబుతోంది..నేనెంటో

నచ్చితే షేర్ చేయ్యండి

హాకీ ఇండియా లీగ్ వేలం పాట‌లో ఖంగుతిన్న స‌ర్థార్ సింగ్‌, ఇక‌పై మాట‌ల్లేవ్‌, అంతా ఆట‌లే అంటున్నాడు. క‌నీస ధ‌ర కూడా ద‌క్క‌క‌పోవ‌డంపై మాట్లాడేందుకు నిరాక‌రించిన స‌ర్థార్‌, తాను విమ‌ర్శ‌కుల‌కు, హాకీస్టిక్‌తోనే బ‌దులు ఇస్తాన‌న్నాడు. త‌న గురించి ఇవాళ ఎవ‌రికో కొత్త‌గా చెప్పాల్సిన‌వ‌స‌రం లేద‌న్న భార‌త హాకీ కెప్టెన్‌, ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా ముందుకు వెళ్లాల‌నే ప‌ట్టుద‌లే త‌న‌కు గొప్ప ఆస్తి అన్నాడు. ప్ర‌స్తుతం త‌న దృష్టంతా..2016లో జ‌ర‌గ‌బోయే రియో ఒలింపిక్స్‌పైనే ఉంద‌న్నాడు. రీసెంట్‌గా ముగిసిన ఐపీఎల్ ఆక్ష‌న్‌లో..స‌ర్థార్ సింగ్ 50ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో బ‌రిలోకి దిగాడు. అయితే, అనుహ్యంగా అత‌న్ని ఎవ‌రూ ద‌క్కించుకోలేదు. ఆక్ష‌న‌ర్ సైతం..స‌ర్థార్‌పై ఫ్రాంచైజీలు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్నే క‌ల్గించింది.అదే రోజు, అన్‌సోల్డ్ ప్లేయ‌ర్స్‌కు మ‌రోసారి వేలం పాట నిర్వ‌హించిన‌ప్పుడు, స‌ర్థార్‌ను పంజాబ్ వారియ‌ర్స్ టీమ్ 38ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. ఈ రేట్ అత‌ని క‌నీస‌ధ‌ర‌కంటే..12ల‌క్ష‌లు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More