నాగ‌ర్‌కోటికి రాజ‌స్తాన్ స‌ర్కార్ పావుకోటి

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా అండ‌ర్‌-19 ప్లేయ‌ర్ నాగ‌ర్‌కోటికి….రాజ‌స్తాన్ స‌ర్కార్ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం, అత‌నికి 25ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్టు అసెంబ్లీలో ప్ర‌క‌టించింది. అండ‌ర్-19 వ‌ర‌ల్డ్‌క‌ప్ భార‌త్‌ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పొషించిన నాగ‌ర్‌కోటి ప్ర‌తిభ‌ను, అంద‌రూ ప్ర‌శంసించారు. బ‌డ్జెట్ ప్రసంగంలో రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజే, నాగ‌ర్‌కోటిని ప్ర‌శంసించ‌డ‌మే కాకుండా, అత‌నికి ఈ మేర‌కు న‌జ‌రానా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. నాగ‌ర్‌కోటి తొలి మ్యాచ్ నుంచే అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. 140కిలోమీట‌ర్ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా, నాగ‌ర్‌కోటి ప‌దునైన బంతుల‌తో దూసుకెళ్లాడు. ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్‌ను కంగారుపెట్టాడు. అంతేకాదు, అత‌ని బౌలింగ్ ప్ర‌తిభ‌కు ముగ్దుడైన షారూఖ్ ఖాన్‌, ఆక్ష‌న్‌లో ఏకంగా 3.2కోట్లు ఇచ్చి అత‌న్ని కోనుగోలు చేశాడు. ఇప్ప‌టికే, అండ‌ర్‌-19టీమ్‌కు బీసీసీఐ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. అయితే, ఇప్పుడు రాష్ట్రాలు, రాష్ట్ర క్రికెట్ సంఘాలు, త‌మ ప్లేయ‌ర్స్‌పై ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నాయి. వాళ్లంద‌రూ క‌లిసి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

టీమిండియాకు సిరీస్ వ‌దిలేసిన స‌ఫారీలు

నచ్చితే షేర్ చేయ్యండి

స‌ఫారీల‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో టీమిండియా రాబోయే మ్యాచ్‌ల్లో కూడా దూకుడు కొన‌సాగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌నోళ్లు, అంది వ‌చ్చిన అవ‌కాశాల‌ను చ‌క్క‌గా యూజ్ చేసుకోని రెండు విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆరు వ‌న్డేల సిరీస్‌లో మ‌నోళ్ల ఆట‌తీరు, టెస్ట్ సిరీస్ ఓట‌మిని మ‌రిచిపోయేలా చేస్తుంది. ఇలాంటి టైమ్‌లో స‌ఫారీ ప్లేయ‌ర్స్ వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతుండ‌టం, గాయాల బారిన ప‌డుతుండ‌టం మ‌న అవ‌కాశాల‌ను ఇంకా రెట్టింపు చేస్తుంది. వ‌న్డే సిరీస్ నుంచి డీకాక్ ఔట్‌ స‌ఫారీ యంగ్‌గ‌న్‌, ఓపెన‌ర్‌, వికెట్ల వెనుక అద్భుత‌మైన మాయ‌చేయ‌గ‌ల ప్లేయ‌ర్ క్వింటాన్ డీకాక్‌. అలాంటి ఆట‌గాడు, వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌ను, మిగిలిన నాల్గు వ‌న్డేల‌కు దూర‌మ‌య్యాడు. బూమ్రా వేసిన బంతి బ‌లంగా తాక‌డంతో డీకాక్‌, గాయ‌ప‌డ్డాడు. స్కానింగ్‌తో తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో అత‌నికి విశ్రాంతి క‌ల్పించారు. ప్ర‌స్తుతం ఏబీ డివిలియ‌ర్స్‌,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అంతా తానై…అన్నింటా తోడై

నచ్చితే షేర్ చేయ్యండి

హెచ్‌సీఏ నిర్వ‌హిస్తున్న తెలంగాణ టీట్వంటీ లీగ్ కోసం త‌రాలు దిగొచ్చారు. అంతేకాదు…..ఉహించ‌ని తీరులో అభిమానులు కూడా స్టేడియానికి వ‌చ్చారు. ఈ క్రెడిట్ అంతా ప్రెసిడెంట్ వివేక్‌దే అంటున్నారు ఆర్గ‌నైజ‌ర్స్‌. ఆయ‌న ఇచ్చిన ఎంక‌రేజ్‌మెంట్ వ‌ల్లే, లీగ్ రెండో ద‌శ‌కు చేరుకుంద‌ని, రాబోయే రోజుల్లో ఈ లీగ్‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెర‌గ‌డం కోసం ఆయ‌న తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు అభినంద‌నీయ‌మ‌ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. నాన్న మీద ప్రేమ‌తో ఆయ‌న చేస్తున్న ఈ టీట్వంటీ లీగ్ భ‌విష్య‌త్ తెలంగాణ క్రికెట్‌ను బాగు చేస్తుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స‌న్నివేశాల కోసం క్రింద వీడియో లింక్‌ను క్లిక్ చేయండి  

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వివేక్ నుంచి ప్రాణ‌హాని ఉంది..శేషునారాయ‌ణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

నచ్చితే షేర్ చేయ్యండి

హెచ్‌సీఏ సెక్ర‌ట‌రీ శేషునారాయ‌ణ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. అధ్య‌క్షుడు జి. వివేకానంద‌ నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని, తెల్లారేస‌రికి ప్రాణాల‌తో ఉంటానో లేదో తెలియ‌ద‌న్నాడు. త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా వివేక్ నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని, బ్ర‌తికి ఉంటే, రేపు ప్రెస్‌మీట్ పెడ్తాన‌న్నాడు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై త‌న‌కి పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్న ఆయ‌న‌… త‌న‌ని స‌స్పెన్ష‌న్ చేసే హ‌క్కు , వివేకానంద‌కు లేద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న ఇంట్లో భార్య‌తో పాటు పిల్ల‌ల‌కు, ముందుగానే ఓ నోట్ రాసి ఇస్తున్న‌ట్టు శేషునారాయ‌ణ్ చెప్ప‌డం ఇప్పుడు అంత‌టా హాట్‌టాపిక్‌గా మారింది. న‌న్ను బ‌తికించుకుంట‌రా…చంపేసుకుంటారా అంటూ…స‌స్పెన్ష‌న్ వేటుపై ఆరాతీసిన మీడియా మిత్రుల‌తో శేషునారాయ‌ణ‌ ఆవేద‌న చెందాడు. అధికారాన్ని, డ‌బ్బును అడ్డంగా పెట్టుకోని త‌న‌ని బెదిరిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పాడు. క‌మిటీ మెంబ‌ర్స్ ముందు త‌న‌ని వివేక్ తీవ్ర ప‌ద‌జాలంతో దూషించాడ‌ని, డిసెంబ‌ర్ 14న క‌మిటీలో ఉన్న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

భార‌త బ్యాడ్మింట‌న్‌కు ఝ‌ల‌క్‌

నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త బ్యాడ్మింట‌న్‌కు షాక్ త‌గిలింది. పురుషుల సింగిల్స్ కోచ్ ముల్య, ప‌ద‌వి నుంచి త‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే. బ్యాడ్మింట‌న్ లీగ్ త‌ర్వాత ఆయ‌న అధికారికంగా త‌న రాజీనామాను ప్ర‌క‌టించ‌నున్నాడు. ఇప్ప‌టికే, బాయ్ పెద్ద‌ల‌కు విష‌యాన్ని చేర‌వేసిన ఆయ‌న‌, వారి స‌ల‌హా మేర‌కు ఆ ప‌ద‌విలో లీగ్ పూర్త‌య్యేవ‌ర‌కు కొన‌సాగ‌నున్నాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు బాయ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తొమ్మిది నెలలుగా భారత బ్యాడ్మింటన్‌ సంఘం కోచ్‌గా కొనసాగుతున్న ముల్యో, పురుషుల సింగిల్స్‌ క్రీడాకారులకు నైపుణ్య‌మైన కోచింగ్ ఇచ్చాడు. అత‌ని శిక్ష‌ణ‌లో…కిదాంబి శ్రీకాంత్‌ నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సహా మిగతా క్రీడాకారులు ఓ రేంజ్‌లో రాణించారు. బెంగళూరులో శిక్షణ పొందుతున్న సైనా నెహ్వాల్‌ సైతం తిరిగి హైదరాబాద్‌ రావడానికి ముల్యో కారణం. అలాంటి ముల్యో మ‌న జ‌ట్టును వ‌ద‌లం కాస్త ఇబ్బందిక‌ర ప‌రిస్థితే.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఫైన‌ల్లో నిరాశ‌ప‌ర్చిన సింధు

నచ్చితే షేర్ చేయ్యండి

బీడ‌బ్ల్యూఎఫ్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్స్‌లో తెలుగుమ్మాయి పీవీ సింధు విజ‌యం ఫైన‌ల్లో ఓడిపోయింది. ఫైన‌ల్లో య‌మ‌గూచితో త‌ల‌ప‌డ్డ సింధు, అద్భుతైన పోరాట‌ప‌టిమ చూపించినా..విజ‌యం సమాత్రం సాధించ‌లేదు. ఈ టైటిల్‌ను గెల్చుకున్న తొలి భార‌త ష‌ట్ల‌ర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకోవాల‌నుకున్న సింధుకు నిరాశే మిగిలింది. తొలి గేమ్‌లో పీవీ సింధు అద్భుత‌మైన ఆట‌తీరుతో అద‌ర‌గొట్టింది. య‌మ‌గూచిపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌త్య‌ర్థికి అస‌లేమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా తిరుగులేని దూకుడితో ప్ర‌త్య‌ర్థిని కంగారుపెడుతూ 21-15తో విజ‌యం సాధించింది. ఈ గేమ్ త‌ర్వాత జ‌రిగిన రెండో గేమ్‌లో య‌మ‌గూచి పుంజుకుంది. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా దూకుడు పెంచి, సింధును ఇర‌కాటంలో ప‌డేసింది. 21-12తో య‌మ‌గూచి, సింధును ఈ గేమ్‌లో ఓడించింది, మూడో గేమ్ నువ్వా-నేనా అన్న‌ట్టు హోరాహోరీగా జ‌రిగింది. దీంతో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ ద‌శ‌లో వీరిద్ద‌రూ దూకుడిగా ఆడి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More