దేవుడి ముందే ధోనీకి ప‌ట్టాభిషేకం

దేవుడి ముందే ధోనీకి ప‌ట్టాభిషేకం
నచ్చితే షేర్ చేయ్యండి

స‌మ‌యం సాయంత్రం 6 00గంట‌లు.. ఐపీఎల్ ఫైన‌ల్ ప్రారంభానికి స‌రిగ్గా 2గంట‌ల ముందు.. గేట్ నెంబ‌ర్ 5 ద‌గ్గ‌ర ఆఫీసు వెహికిల్ దిగుతున్న టైమ్‌లో… అన్ని చానెళ్ల కెమెరాలు అభిమానుల కోలాహ‌లాన్ని బంధిస్తున్నాయి. తొలిసారి ఫైన‌ల్‌కు అతిధ్య‌మిస్తున్న రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియంలో ఎటుచూసిన ఫ్యాన్స్ సంద‌డే. టైటిల్ విన్న‌ర్‌ను డిసైడ్ చేయ‌బోయే మ్యాచ్‌ను వీక్షిస్తున్నామ‌నే ఆనందంతో పాటు హేమాహేమీ క్రికెట‌ర్ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చ‌నే ఆనందం వాళ్ల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అభిమాన‌లోకం..ఇలాంటి అనుభ‌వాల‌తో మైదానానికి వ‌చ్చే స‌న్నివేశాలు నాకే కాదు, కెమోరా కంటికి చాలా సంతృప్తినిస్తాయి. నిజానికి పుణె, ముంబై లాంటి జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ అంటే ఫేవ‌రెట్ రోహిత్‌సేనే. స‌చిన్ టెండూల్క‌ర్ మెంటార్‌గా ఉన్న ఆ జ‌ట్టుకు..హైద‌రాబాద్‌లో అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ్తార‌న‌డంలో సందేహాం లేదు. కానీ, ఈసారి ఎందుకో సీన్ రివ‌ర్సైంది. ఏ గేటు ద‌గ్గ‌ర…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఆ అమ్మ‌డి యార్క‌ర్‌కి భువి క్లీన్‌బౌల్డ్‌

ఆ అమ్మ‌డి యార్క‌ర్‌కి భువి క్లీన్‌బౌల్డ్‌
నచ్చితే షేర్ చేయ్యండి

ఆఫ్ సైడ్ ఆన్ సైడ్ స్వింగ్ లు, పదునైన యార్కర్లు, చురకత్తుల్లాంటి బంతుల్ని విసురుతూ, ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రేమలో పడ్డాడా? ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని చక్కర్లు కొడుతున్నాడా? ఐపీఎల్ టెన్ సీజన్లో వికెట్ టెకింగ్ వెనుక రహస్యం అదేనా? తోటి ఆటగాళ్లు ఇంటివాళ్లవుతుంటే నేను సైతం అనేలా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోటో పెట్టాడు భువి. ఇప్పుడా ఫోటో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు మాత్రం ఎవరు? ఎంటి? అని బుర్రలు ఫ్రై చేసుకుంటున్నారు. రోహిత్ శర్మ, హర్భజన్, సురేష్ రైనా, యువరాజ్ ఇప్పటికే ఇంటివాళ్లయ్యారు. జహీర్ ఖాన్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సంకేతాలిచ్చాడు. మరోవైపు బాలీవుడ్ నటి అనుష్క శర్మతో లవ్వాయణం నడుపుతున్నాడు కోహ్లీ. ఇక ఇప్పుడు టీమిండియా పేసర్ భువీ కూడా అదే రూట్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఖ‌జానా ఫుల్‌..జీతాలు నిల్‌

ఖ‌జానా ఫుల్‌..జీతాలు నిల్‌
నచ్చితే షేర్ చేయ్యండి

బీసీసీఐ అంటే మాంచి సౌండ్ పార్టీ అని, ధనిక బోర్డ్ అని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒట్టి కథలే కాదు వందకు వంద శాతం నిజం కూడా. కానీ ఇప్పుడు టీమిండియా ప్లేయర్లకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంది బీసీసీఐ. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఐసీసీతో జరుగుతున్న వివాదంతో క్రికెటర్లకు చెల్లింపులు ఆపేసింది. సాధారణంగా టోర్నీ అవగానే పదిహేను రోజుల్లో క్రికెటర్ల అకౌంట్ లో నగదు పడాలి. కానీ సొంతగడ్డపై వరుస సిరీస్ లలో గెలిచినా ఆటగాళ్లకు మాత్రం డబ్బు ముట్టలేదు. దీంతో పేమెంట్ కోసం క్రికెటర్లు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో సొంతగడ్డపై ఆడిన అన్ని సిరీస్ లలోనూ టీమిండియా సత్తా చాటింది. అయితే జట్టు సభ్యులకి బీసీసీఐ నుంచి అందాల్సిన మ్యాచ్‌ ఫీజు, బోనస్‌లు మాత్రం అందలేదు….

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పీట‌ర్స‌న్‌పై పేలిన యువీ ట్వీట్‌

పీట‌ర్స‌న్‌పై పేలిన యువీ ట్వీట్‌
నచ్చితే షేర్ చేయ్యండి

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్, ప్ర‌జెంట్ ఐపీఎల్ కామెంటేట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్‌పై యువ‌రాజ్ సింగ్ సెటైర్ వేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వీరిద్ద‌రూ క‌లిసి చేసిన ట్వీట్స్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశాయి. ఈ పోటీలో యువీనే గెలిచినా…కేపీ ట్వీట్స్ కూడా అభిమానుల‌ను అల‌రించాయి. ఐపీఎల్ పుణ్య‌మా అని దేశ‌, విదేశీ ప్లేయ‌ర్స్ క‌లిసి ఆడ‌టం చూసిన ఫ్యాన్స్‌కు, ఇలాంటి ట్వీట్ వార్ కూడా ఆక‌ట్టుకుంటుంది. ఏప్రిల్ 10న యెల్లో క‌ల‌ర్ సాక్స్‌లో చాలా అందంగా ఉన్నావ్, అంతా కుశ‌ల‌మే అనుకుంటా అని పీట‌ర్స‌న్‌ను ఉద్దేశించి యువీ ట్వీట్ చేశాడు. దీనికి స‌మాధానంగా నిన్ను ప్రేమిస్తా కానీ, నీ బౌలింగ్‌ను కాద‌ని పీట‌ర్స‌న్ రీట్వీట్ చేశాడు. దీనికి త‌న‌దైన స్ట‌యిల్లో కౌంట‌రిచ్చాడు యువీ. స‌ర‌దాస‌ర‌దాగా జ‌రిగిన ట్వీట్స్ ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. అంతేకాదు…ఇది చాలా బాగుంది గురూ అంటూ వీరిద్ద‌రికి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వీళ్లిద్ద‌రూ కొట్టుకునుడే త‌క్కువ‌…!

వీళ్లిద్ద‌రూ కొట్టుకునుడే త‌క్కువ‌…!
నచ్చితే షేర్ చేయ్యండి

భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో పరస్పర ఆరోపణలు.. వాగ్వాదాలు.. హేళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరు టెస్టులో తలెత్తిన ‘డీఆర్‌ఎస్‌’ వివాదం తర్వాత ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్ల కెప్టెన్లను పిలిచి సంయమనంతో వ్యవహరించాలని సూచించినప్పటికీ.. రాంచీ టెస్టులో వివాదాలు ఆగలేదు. ఈ మ్యాచ్‌లో కోహ్లి గాయపడటంపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎగతాళిగా సంజ్ఞలు చేయడం.. కోహ్లి కూడా వారికి అదే తీరులో సమాధానం చెప్పడం తెలిసిందే. ఈ గొడవ మైదానాన్ని దాటి విలేకరుల సమావేశం వరకూ వెళ్లింది. తన భుజం గాయానికి చికిత్స చేసిన జట్టు ఫిజియో పాట్రిక్‌ ఫర్హర్ట్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు హేళన చేశారని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరోపించాడు. ‘‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురైదుగురు అదే పనిగా పాట్రిక్‌ పేరు ఎత్తడం గమనించాను. అలా ఎందుకో తెలియదు. అతను మా ఫిజియో. నాకు చికిత్స చేయడం…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఈ ఆసీస్‌కు బుద్దిరాదు..సిగ్గులేదు..!

ఈ ఆసీస్‌కు బుద్దిరాదు..సిగ్గులేదు..!
నచ్చితే షేర్ చేయ్యండి

ఎలుక తోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదన్నట్టు.. ఆసీస్ ఆటగాళ్ల తీరు కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది. వివాదాలకు ఆజ్యం పోయడం, ఆటగాళ్లను రెచ్చగొట్టడం వారికి బట్టర్ తో పెట్టిన విద్య. టీమిండియా సిరీస్ లోనూ వాళ్ల దుందుడుకు చర్యలు ఏమాత్రం మారలేదు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వెటకారపు చర్యలతో పలుచన అవుతున్నారు. బెంగళూరు టెస్ట్ లో డీఆర్ ఎస్ వివాదం తర్వాత ఆటగాళ్లు వివాదాలకు దూరంగా ఉంటారని భావించారంతా. కానీ ఆసీస్ ఆటగాళ్లల్లో ఏమాత్రం మార్పు రాలేదు. రాంచీ టెస్ట్ లో ఆసీస్ రెండు సార్లు డీఆర్ ఎస్ కు వెళ్లి ఫెయిల్ అయింది. ఆ క్రమంలో కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో చప్పట్లు కొడుతూ కనిపించాడు. దీంతో భుజాలు తడుముకున్న అసీస్ ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూశారు….

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధోనీ 3ఫోన్లు కొట్టేసింది ఎవ‌రో తెలిస్తే షాకే..!

ధోనీ 3ఫోన్లు కొట్టేసింది ఎవ‌రో తెలిస్తే షాకే..!
నచ్చితే షేర్ చేయ్యండి

సందట్లో సడేమియాలా దొంగలు చేతివాటం చూపించారు. అది కూడా మామూలు చేతివాటం కాదు.. చాలా కాస్ట్ లీ సెల్ ఫోన్స్, చాలా తెలిపిగా కొట్టేశారు. ఢిల్లీలో మిస్టర్ కూల్ ధోనీ బస చేసిన హోటల్ లో ఈ చోరీ ఘటన జరిగింది. ఫోన్లు పోతే మళ్లీ కొనొచ్చు. కానీ అందుులో చాలా కీలకమైన విషయాలున్నాయి. దీంతో కంగారపడ్డ జార్ఖండ్ డైనమేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ హజారే ట్రోఫీ సెమీఫైనల్ లో భాగంగా ఢిల్లీలోని ఓ హోటల్ లో క్రికెటర్లు బస చేశారు. వీరిలో ధోనీ కూడా ఉన్నాడు. అయితే ఆ హోటల్ లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరిగింది. అలర్టయిన సెక్యూరిటీ, హోటల్ సిబ్బంది ఆటగాళ్లందర్ని హోటల్ బయటకు పంపించారు. కానీ అప్పటికే క్రికెట్ సభ్యుల కిట్‌ కాలిపోయింది. మరోవైపు ఇదే అదనుగా ధోనీ మూడు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

బీకామ్ లో ఫిజిక్స్ కంటే…పెద్దజోక్

బీకామ్ లో ఫిజిక్స్ కంటే…పెద్దజోక్
నచ్చితే షేర్ చేయ్యండి

అసలీ ఆటగాళ్లకి ఏమైంది? ఎందుకిలా చీప్ గా ప్రవర్తిస్తున్నారు? ఒక్కసారి ఔటైతే కొంపలు మునిగిపోతాయా? గల్లీలో సిల్లీ సీన్స్ గుర్తు తెస్తున్నారు. తాము పక్కా ప్రొఫెషనల్స్ అన్న విషయమే మరుస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల మంది తమను గమనిస్తున్నారనే కనీస జ్ఞానాన్ని మరుస్తున్నారు. మొన్న స్మిత్ నిన్న సర్కార్.. ఔటయ్యాక వాళ్లిద్దరూ స్పందించిన తీరు సగటు అభిమానిని షాక్ కి గురిచేసింది. వీళ్లేంటిలా..? అన్న అనుమానాన్ని రేకెత్తించారు. బెంగళూరు టెస్ట్ లో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ అయిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశాడు. అలా చూడటం రూల్స్ విరుద్ధం అని అతనికి తెలియందేం కాదు. కోహ్లీ గమనించి అంపైర్ కు చెప్పడంతో స్మిత్ ను గ్రౌండ్ వీడి వెళ్లాలని ఆదేశించాడు. ఆ తర్వాత స్మిత్ వ్యవహరించిన తీరు రచ్చ రచ్చ అయింది. అయితే ఆ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

కోహ్లీ….విల‌న్ ఆఫ్ ద వీక్‌

కోహ్లీ….విల‌న్ ఆఫ్ ద వీక్‌
నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియా మీడియాకు మైండ్ దొబ్బింది. మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. తప్పుని తప్పని నిరూపిస్తుంటే తట్టుకోలేక.. దిగజారుడుతనాన్ని ప్రదర్శించి తన స్థాయిని అధఃపాతాళానికి తొక్కేసుకుంది. ఆసీస్ కెప్టెన్ స్మిత్ డీఆర్ ఎస్ వివాదాన్ని బీసీసీఐ పెద్ద మనసు చేసుకుని కాంప్రమైజ్ అయితే.. దాన్ని గొప్పగా చూడాల్సింది పోయి, కుక్క తోక వంకరే అన్నట్టుగా తన బుద్దిని బయటపెట్టుకుంది. కోహ్లీని జంతువులతో పోల్చిన ఫాక్స్ స్పోర్ట్స్ మీడియా.. తీవ్రంగా అవమానించింది. ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి. గీత దాటితే వాత పెట్టేలా రాతలు రాయాలి. అలా చేయని అసీస్ మీడియా తెంపరి అటగాళ్లను భుజాన వేసుకుంది. ఫీల్డ్ అంపైర్ల సాక్షిగా నిజాయితీని ప్రదర్శిస్తే.. ఎక్కడ లేని కోపం తన్నుకొచ్చింది. ఆట ఒక్కటే కాదు.. కనీసం కామన్ సెన్స్ ఉండాలన్న ఇంగీతం మరిచిన తమ ఆటగాళ్లకు కర్రుకాల్చి వాతపెట్టకుండా కోహ్లీపై నోరు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నీ దూకుడు మీదే నా దంచుడు

నీ దూకుడు మీదే నా దంచుడు
నచ్చితే షేర్ చేయ్యండి

అశ్విన్ క్యారమ్ బౌలరే కాదు ఖతర్నాక్ బౌలర్ అన్నాడు అసీస్ ఓపెనర్ డెవిడ్ వార్నర్. అశ్విన్ బౌలింగ్ ను ఎదుర్కొవడం అంతా ఈజీ కానే కాదంటున్నాడు. అయినప్పటికి తాను తగ్గేది లేదన్నాడీ డాషింగ్ ఓపెనర్. జరిగిన రెండు టెస్టుల్లో మూడుసార్లు అశ్విన్ బౌలింగ్ లోనే అవుటౌయ్యాడు వార్నర్. ప్రమాదకర బౌలర్ అయిన అశ్విన్ ఎవరినైనా ఔట్ చేయగల సత్తా ఉందని ప్రశంసలు కురిపించాడు. పుణె, బెంగళూరు టెస్టుల్లో మూడుసార్లు అశ్విన్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు వార్నర్. 13టెస్టుల్లో ఇప్పటిదాకా 9సార్లు అశ్విన్ చేతిలోనే పెవిలియన్ బాట పట్టాడు. టెస్ట్ కెరిర్ లో ఒక అటగాడ్ని ఎక్కవసార్లు ఔట్ చేసిన ఘనత సొంతం చేసుకున్నాడు అశ్విన్. అలాగే ఒక బౌలర్ కు ఎక్కవసార్లు వికెట్ సమర్పించుకున్న బ్యాడ్ రికార్డ్ ను పొందాడు వార్నర్. అశ్విన్ ప్రమాదకర బౌలర్ అయినప్పటికి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More