క‌బ‌డ్డీ కామెంట్రీలో క్రికెట‌ర్ మాట‌ల‌ బౌన్స‌ర్లు

నచ్చితే షేర్ చేయ్యండి

క్రికెట్ ఎంతో నేర్పిందో….కామెంట్రీ అంత గుర్తింపు నిచ్చింది చేసే ప‌నిపై శ్ర‌ద్ధ ఉండ‌టం వ‌ల్లే కామెంట్రీ బాగా చెప్పా ప్రొ క‌బ‌డ్డీ తెలుగు టీమ్ స‌హ‌కారం మ‌రిచిపొలేనిది ఎమ్మెస్కే ప్ర‌సాద్ ఆద‌ర్శం…..శ్రీమ‌తి నా బ‌లం 1. ప్రొఫెష‌న‌ల్ క్రికెట్ టు…ప్రొఫెష‌న‌ల్ కామెంట్రీ ఎలా ఉంది జ‌ర్నీ…? క‌ళ్యాణ్ కృష్ణ – ఇదో అంద‌మైన ప్ర‌యాణం. జీవితం అంటే ఏంటో క్రికెట్ చూపించింది. కామెంటేట‌ర్‌గా జ‌ర్నీ అంత‌కుమించి అనేలా ఉంది. కార‌ణం, ఆట‌కు వీడ్కోలు ప‌లికాక కూడా, ఆ ఆట‌తోనే ముందుకెళ్తుండ‌టం ఏ క్రీడాకారుడికైనా గొప్ప విష‌య‌మే. ప్ర‌స్తుతం….కామెంట్రీతో ప్రేమ‌లో ఉన్నా. 2. క్రికెటే జీవితంగా పెరిగిన మీరు, క‌బ‌డ్డీ ఎక్స్‌ప‌ర్ట్‌గా మారారు…? క‌ళ్యాణ్ కృష్ణ – ఈ విష‌యంలో ఎమ్మెస్కే ప్ర‌సాద్ (భార‌త క్రికెట్ టీమ్ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌) గారికి రుణ‌ప‌డి ఉంటా. నా పేరును…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సిద్ధిపేట స్టేడియం చూడ‌త‌ర‌మా….!

నచ్చితే షేర్ చేయ్యండి

అది సిద్దిపేట‌….తెలంగాణ సిరుల జిల్లా. మా ఊరు మంచిర్యాలకు బ‌స్సుల పొయే ప్ర‌తిసారి చూసే ఊరే. సిద్దిపేట వ‌చ్చిందంటే మ‌రో రెండుగంట‌ల్లో హైద‌రాబాద్‌లా ఉంటం. లేదంటే, క‌రీంన‌గ‌ర్ ద‌గ్గ‌రికి వ‌చ్చేసినం అనుకునేటోళ్లం. అంతే, ఆ త‌ర్వాత హ‌రీష్ రావు గారు వ‌చ్చాకా…సిద్దిపేట ఇష్ట‌మైన న‌గ‌రంగా కూడా మారింది. అలాంటి సిద్దిపేట‌లో ఆదివారం నేను చూసిన దృశ్యం క‌ళ్ల‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. మెద‌డులో తొలుస్తూనే ఉంది. 2011లో అనంత‌పురంలో దూర‌ద‌ర్శ‌న్ త‌ర‌పున‌, ఓ సెల‌బ్రేటీ మ్యాచ్‌ను క‌వ‌రేజ్ చేయ‌డానికి వెళ్లి ఆర్డీటీ స్టేడియం చూసి ఎంత‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ్డానో, అంత‌కంటే ఎక్కువే, సిద్దిపేట స్టేడియాన్ని చూసి అవాక్క‌య్యా. ఉప్ప‌ల్ స్టేడియం త‌ర్వాత‌, తెలంగాణ‌లో ఉన్న మ‌రో అద్భుత‌మైన గ్రౌండ్ ఏదైనా ఉంటే అది ఖ‌చ్చితంగా ఇదేన‌ని నొక్కి చెప్పొచ్చు. అంత‌లా, అద్భుతంగానే కాదు, క్రికెట్‌పై మ‌క్కువ ఉన్న క్రికెట‌ర్లు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

జ్వాలా గుత్తా ఎక్స్‌క్లూజివ్ ఇంట‌ర్వ్యూ – బి స్పోర్టివ్ విత్ వెంక‌ట్ రేగ‌ళ్ల‌

నచ్చితే షేర్ చేయ్యండి

తెలుగు రాష్ట్రాల్లో క్రీడావార్త‌ల‌ను అందించ‌డం కోసం అనుక్ష‌ణం త‌పిస్తున్న క్రిక్ఎన్‌ఖేల్‌. కామ్‌, ఇప్పుడు ఇంట‌ర్వ్యూల‌తో క్రీడాకారుల స్ఫూర్తిదాయ‌క‌మైన విష‌యాల‌ను అంద‌రికి అందుబాటులోకి తీసుకువ‌చ్చేసింది. అందులో భాగంగా…బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల ఇంట‌ర్వ్యూను ముందుగా అభిమానుల ముందుకు తీసుకువ‌చ్చాం. బ్యాడ్మింట‌న్‌లో జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో పాటు, ఆమె లైఫ్ స్ట‌యిల్‌, సినిమాలు, రిటైర్మెంట్‌, స్త్రీవాదం, పాలిటిక్స్‌, సోష‌ల్ మీడియా అన్నింటిపై ఆమె త‌న అభిప్రాయాల‌ను సూటిగా చెప్పేసింది. ఆ ఎక్స్‌క్లూజివ్ విష‌యాల కోసం ఈ క్రింది లింక్‌ల‌ను క్లిక్ చేయండి.    

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఇంకెన్నాళ్లీ కుమ్ములాట‌లు….???

నచ్చితే షేర్ చేయ్యండి

స‌రిగ్గా 17రోజుల క్రితం…హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ తెలంగాణ టీట్వంటీ లీగ్‌ను ప్ర‌క‌టించిన సంద‌ర్భం ఇంకా నాకు బాగా గుర్తు. చాలా కాలంగా క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ తెలంగాణ‌, తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్…రూర‌ల్ హంట్ పేరుతో గ్రామీణ క్రీడ‌కు ఊపిరి అందిస్తున్న వేళ‌, ఈ లీగ్ చాలా స‌మాధానాలు లేని ప్ర‌శ్న‌ల‌తో పాటు, ఎట్ట‌కేల‌కు హెచ్‌సీఏ గ్రామాల్లోకి వ‌చ్చింద‌నే కేటీఆర్ మాట‌లు…తెలంగాణ టీట్వంటీ లీగ్ ప్ర‌త్యేక‌త‌ను అంద‌రికి తెలియ‌జేశాయి. ఆరుగురు స‌భ్యుల మ‌ధ్యే ఐక్య‌త లేదా…? మారిన నిబంధ‌న‌ల‌తో హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో స‌భ్యుల సంఖ్య ఆరుకు త‌గ్గింది. ఇందులో…ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌, సెక్ర‌ట‌రీ, ట్రెజ‌ర‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు స‌భ్యులున్నారు. అయితే, వీళ్ల మ‌ధ్యే ఐక్య‌త లేద‌నేది ప్రెసిడెంట్‌, సెక్ర‌ట‌రీ వ్య‌వ‌హ‌రంతో తేలిపోయింది. ఏకంగా సెక్ర‌ట‌రీపై వేటు వేయాల‌ని అధ్య‌క్షుడు, అంబుడ్స్‌మ‌న్‌కు సిఫార‌సు చేయ‌డం బ‌ట్టి, హైద‌రాబాద్ క్రికెట్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

పేరులో సింహం…బుద్దిలో న‌క్క‌

నచ్చితే షేర్ చేయ్యండి

కుక్క తోక‌…న‌క్క బుద్ది ఎప్పుడూ మార‌దు. మార్చాల‌నే ప్ర‌య‌త్నం కూడా వృధానే. పేరులో ఉండే ఠీవీ, ప్ర‌వ‌ర్త‌న‌లో ఉండ‌దు. వ‌య‌సు మీద ప‌డ్డా కొంద‌రికి మ‌ర్యాద అనే ప‌దానికి అర్థం తెలియ‌దు. స్పోర్ట్స్‌మ్యాన్‌కి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం…స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించ‌డం. ఇలాంటి ల‌క్ష‌ణం లేకుండా ఇవాళ‌…శ్రీలంక క్రికెట్ టీమ్ ప్ర‌ద‌ర్శించ‌న తీరు, స‌గ‌టు అభిమానిని మాత్ర‌మే కాదు, క్రికెట్ లోకాన్ని విస్తుపొయేలా చేసింది. సోష‌ల్ మీడియాలో శ్రీలంక క్రికెట్ టీమ్ ఆడిన దిగ‌జారుడు ఆట ఆ దేశాన్ని అభాసుపాల‌య్యేలా చేసింది. మ‌రీ అంత సీన్ ఉందా…? ఢిల్లీలో కాలుష్యం కామ‌న్‌. ఇటీవ‌ల‌, అక్క‌డి ప్ర‌భుత్వం చాలా ఏర్పాట్లు చేసింది. అయితే, తీవ్ర‌త మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి చోట‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ‌రికొన్ని దేశాల ఆట‌గాళ్లు ఇబ్బంది ప‌డ్డారంటే కాస్త అర్థం ఉంది. అలాగ‌ని, శ్రీలంక ప్లేయ‌ర్స్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

థ్యాంక్యూ టీవీ9..యూ ఆర్ స్పెష‌ల్‌ 

నచ్చితే షేర్ చేయ్యండి

టీవీ9….చ‌దువుకునే రోజుల్లో ఎలాగైనా అక్క‌డ ప‌నిచేయాల‌నే క‌సితో మొద‌లైన ప్ర‌యాణం. అప్ప‌టి నుంచే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడితే 2012లో కానీ క‌ల నిజం కాలేదు. అప్ప‌టి నుంచి జులై 14, 2017వ‌ర‌కు నా ప్ర‌యాణం ఎన్నో అద్భుత క్ష‌ణాల‌కు చేర‌వ‌చేస్తూ కొన‌సాగింది. లైఫ్‌లో ఎన్నో మ‌ధుర‌స్మృతులు ఇక్క‌డే నాకున్నాయి. అందుకే, టీవీ9లాంటి సంస్థ‌ను ఏ ద‌శ‌లోనూ విడిచిపెట్టొద్ద‌ని కోరుకునే వాడిని. అంతేకాదు…నాకంటూ ఈ సంస్థ‌లో ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాను.   ఈ సంస్థ‌లో రావ‌డానికి నాకు స‌హ‌క‌రించిన నా ప్రాణ‌మిత్రుడు కార్తీక్ ప‌వ‌న్ గాదెకు ముందుకు నా థ్యాంక్స్‌. ఆ టైమ్‌లో న‌న్ను ఇంట‌ర్యూ చేసిన దినేష్ ఆకుల గారు, చంద్ర‌మౌళి గారు, కృష్ణారావు గారికి కూడా ఎప్ప‌టికీ విధేయ‌త‌తో ఉన్నాను. ఉంటా కూడా. డెస్క్‌లో స్పోర్ట్స్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేయ‌డానికి దినేష్ ఆకుల…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నా కూత‌కో లెక్కుంది…కామెంట్రీపై క్లారిటీ ఉంది

నచ్చితే షేర్ చేయ్యండి

నా ఆటైనా..మాటైనా సూటిగా ఉంటుంది రిక‌మండేష‌న్ల‌కు నేను చాలా దూరం నా ద‌గ్గ‌ర టాలెంట్ ఉంది కాబ‌ట్టే సెలెక్ట‌య్యా నేను, నా భ‌ర్త క్రీడాకారులం కాబ‌ట్టి మంచి అండ‌ర్‌స్టాడింగ్ ఉంది మా ఇద్ద‌రికి మా అమ్మాయే ఆద‌ర్శం ఎక్స్‌ప‌ర్ట్‌తో పాటు కామెంట్రీ పెద్ద చాలెంజ్‌ స్పోర్ట్స్ ఎన‌లిస్ట్ సి.వెంక‌టేష్ స‌హ‌కారం మ‌రువ‌లేనిది 1. ఎంబీఏ చేసిన అమ్మాయి…క‌బ‌డ్డీ కామెంట్రీతో చెడుగుడు ఆడేస్తుంది…? రాధిక శ్రీనివాస్ రెడ్డి : ఆటైనా..మాటైనా సూటిగా సుత్తిలేకుండా ఉండాల‌నేది నా ఆలోచ‌న‌. క‌బ‌డ్డీ అంటే ఇష్టం కాబ‌ట్టే..ఆ ఆట గురించి అంత‌లా చెప్ప‌గ‌ల్గుతున్నా. మ‌న దేశంలో పుట్టిన క‌బ‌డ్డీ ఇప్పుడు రూపు మార్చుకుంది. ఒలింపిక్స్‌కు క‌బ‌డ్డీ వెళ్తే మ‌రింత ఆనందం. అందులో నా భాగ‌స్వామ్యం ఉంటే మ‌రింత గౌర‌వంగా భావిస్తున్నా. ఇక విద్యార్హ‌త విష‌యానికొస్తే ఏంబీఏ చేయ‌డ‌మే కాదు, హెచ్ఆర్‌గా 15యేళ్ల అనుభ‌వం ఉంది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

క‌బ‌డ్డీ కామెంటేట‌ర్ మాధ‌వి బండారి ఇంట‌ర్వ్యూ

నచ్చితే షేర్ చేయ్యండి

క‌బ‌డ్డీ తొలి తెలుగు కామెంటేట‌ర్ కావ‌డం అదృష్టం ఇండియ‌న్ స్పోర్ట్స్‌లో ప్రో క‌బ‌డ్డీ ఓ సంచ‌ల‌నం ఒలింపిక్స్‌లో క‌బ‌డ్డీ చూడాల‌నేదే కోరిక‌ కోచ్‌గా అవ‌కాశ‌మిస్తే స‌త్తా చాటుతా పిల్ల‌ల‌పై ఇష్టాలు రుద్ద‌లేదు..వాళ్ల లైఫ్ వాళ్లిష్టం 1. క‌బ‌డ్డీ కూత‌కు….మీ మాట‌లు..చ‌ప్ప‌ట్ల మోత మోగిస్తున్నాయి. ఎలా ఉంది అనుభ‌వం..? మాధ‌వి : చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఆట‌ను మాట‌ల్లో చెప్ప‌డం ఓ స‌రికొత్త అనుభూతి. 2. తొలి తెలుగు మ‌హిళా కామెంటేట‌ర్ మీరు. నాల్గు సీజ‌న్లుగా ఎలాంటి స్పంద‌న ల‌భిస్తోంది…? మాధ‌వి : ఆద‌ర‌ణ అద్భుతం. ఎక్క‌డికి వెళ్లినా జ‌నాలు గుర్తిస్తున్నారు. ఓ సారి బ‌స్‌లో వెళ్తున్న టైమ్‌లో నా గొంతు విని, ఒక‌యాన సీటు ఇచ్చారు. అప్పుడే నాకు తెలిసింది…మా మాట‌ల‌న్ని జ‌నాలు ఎంత‌లా ఫాలో అవుతున్నారోన‌ని. 3. క‌బ‌డ్డీ ఇలా మెరిసిపోతుంద‌నుకున్నారా..? మీరు ఇలాంటి రోల్ ప్లే…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

రాహుల్.. మీ బ‌రువు మీరే మోసుకోండి !

నచ్చితే షేర్ చేయ్యండి

వెయిట్ లిఫ్టింగ్‌….క్రీడాభారతంలో అప్పుడ‌ప్పుడు వినిపించే పేరు. ప్ర‌భుత్వాల‌కు ఎప్ప‌టికీ క‌నిపించ‌ని అథ్లెట్స్‌. బ‌రువులు ఎత్తే భుజాల‌పై క‌నిపించే బాద్య‌త‌కు, బ‌రువైన హృద‌యాల‌లోని భావోద్వేగాల‌కు స‌మాధానం దొర‌క‌దు. మీడియా ప‌రిధి పెరిగిన‌ప్పుడు ప‌బ్లిసిటీ మాత్ర‌మే వ‌స్తుంది….స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మాత్రం దొర‌క‌దు. ఎందుకంటే, అటువైపుగా మీడియా రాత‌లు, కెమెరా క‌న్నులు ప్ర‌య‌త్నించ‌వు. వేడిగా ఉన్న‌ప్పుడే వ‌డ్డించాలి..చ‌ల్లారిన‌ప్పుడు ప‌లాయ‌నం చిత్త‌గించాల‌ని చూసే ఫోర్త్ ఎస్టేట్ చేసే హ‌డావుడి సంద‌ట్లే స‌డేమియాలాంటిదే. రాగాల సోద‌రులకేది ప్రొత్సాహం…? రాగాల రాహుల్‌, వ‌రుణ్‌..కామ‌న్వెల్త్ చాంపియ‌న్‌షిప్‌లో సాధించిన ఘ‌న‌త‌లు, నెల‌కొల్పిన‌ రికార్డ్‌లు…..దేశ కీర్తిని మాత్ర‌మే కాదు…తెలుగోడి స‌త్తా ఏంటో అంద‌రికి తెలియ‌జేశాయి. ఇవి మాత్ర‌మే అంద‌రికి క‌నిపించాయి.. క‌నిపిస్తున్నాయి కూడా. బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం పూరిల్లుకు మారిన తండ్రి ఆవేద‌న‌….వారి కోసం ఆలోచ‌న సాగ‌రంలో మునిగి క్యాన్స‌ర్‌తో క‌న్నుమూసిన ఓ త‌ల్లి వేద‌న‌….తెలిసింది ఎంత‌మందికి. ప్రాతినిథ్యం వ‌హిస్తున్న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More