మూడు ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు

నచ్చితే షేర్ చేయ్యండి

హార్దిక్ పాండ్య ఓవ‌ర్లో 19 ప‌రుగులు పిండుకున్న ఆసీస్ కు ఆ ఆనందం ఎంతో సేపు నిల‌వ‌లేదు….త‌ర్వాతి మూడు ఓవ‌ర్ ల‌లో మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. తొమ్మిదో ఓవ‌ర్ లో జ‌డేజా….స్మిత్ ను అవుట్ చేయ‌గా…. ఆ త‌ర్వాతి ఓవ‌ర్ లో అశ్విన్…ఆసీస్ కెప్టెన్ ఫించ్ ను ఎల్బీడ‌బ్ల్యూగా అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 89 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. ఇక 11వ ఓవ‌ర్ లో జ‌డేజా మ‌ళ్లీ విజృంభించాడు. ఈ ఓవ‌ర్ చివ‌రి బంతికి జ‌డేజా…ట్రావిస్ హెడ్ ను పెవిలియ‌న్ కు పంపి భార‌త శిబిరంలో ఆనందం నింపాడు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఇండియా గెలిచిందోచ్….

నచ్చితే షేర్ చేయ్యండి

నాలుగు వ‌న్డేల నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఎట్ట‌కేల‌కు ఆసీస్ గ‌డ్డ‌పై టీంఇండియా బోణీ కొట్టింది. 1-4తో సిరీస్ ను ముగించింది. సిడ్నీలో చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన ఐదో వ‌న్డేలో భార‌త్ …ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఆసీస్ విధించిన 331 ప‌రుగుల టార్గెట్ ను మ‌రో 2 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. మ‌నీశ్ పాండే అద్భుత‌మైన శ‌త‌కంతో దుమ్మురేపి.. భార‌త విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అంత‌కు ముందు ఓపెన‌ర్ ధావ‌న్ (78) చిచ్చ‌ర‌పిడుగులా చెల‌రేగి ఆడ‌గా….రోహిత్ 99 ప‌రుగులు చేసి మ‌రోసారి ఫాం క‌న‌బ‌రిచాడు..ఆసీస్ బౌల‌ర్ల‌లో హేస్టింగ్స్ 3 వికెట్లు ప‌డ‌గొట్టగా, మార్ష్ కు ఒక విక వికెట్ ద‌క్కింది. 12 బంతుల్లో 22 ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో ధోనీ, మ‌నీశ్ పాండే క్రీజులో ఉన్నారు.భార‌త్ చేతిలో మ‌రో 7 వికెట్లు…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ధావ‌న్ బౌలింగ్ సందేహాస్ప‌దం

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా ఓపెన‌ర్ బౌల‌ర్ అవ‌తారం ఎత్తి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చుకుంటున్నాడు. ఢిల్లీ టెస్ట్‌లో పార్ట్‌టైమ్ ఆఫ్‌స్పిన్న‌ర్ అవ‌తారం ఎత్త‌డం ఇప్పుడు అత‌న్ని చిక్కుల్లో ప‌డేసింది. నీ బౌలింగ్ అనుమాన‌స్ప‌దమ‌ని ధావ‌న్‌కు మ్యాచ్ రిఫ‌రీ తేల్చిచెప్ప‌డ‌మే కాకుండా, ఐసీసీకి ఫిర్యాదు చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు..మ‌రో 14రోజుల్లో ఐసీసీ ప్యానెల్ ముందు ధావ‌న్ హాజ‌రు కావాల్సిన‌వ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టికే బీసీసీఐకి స‌మాచారం అందింది. ఢిల్లీ టెస్ట్‌లో డ్రా కోసం ప్ర‌య‌త్నించిన స‌ఫారీల‌ను కంగారుపెట్టేందుకు కోహ్లీ, దావ‌న్‌తో బౌలింగ్ చేయించాడు. మూడు ఓవ‌ర్లు ధావ‌న్ బౌలింగ్ చేశాడు. ఫ‌స్ట్ ఓవ‌ర్లోనే రెండు బంతులు అద్భుతంగా వేసి, ఆమ్లాను ఔట్ చేసినంత ప‌నిచేశాడు. అయితే, అత‌ని బౌలింగ్ తీరుపై అంపైర్లు అనుమానాలున్నాయంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన ఐసీసీ మ‌రో 14రోజుల్లో ధావ‌న్ బౌలింగ్‌ను ప‌రీక్షిస్తామ‌ని చెప్పింది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

కోహ్లీసేన‌కు 2కోట్లు

నచ్చితే షేర్ చేయ్యండి

టీంఇండియాకు బీసీసీఐ రెండు కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 3-0తో కోహ్లీ గ్యాంగ్ కైవసం చేసుకోవడంతో …బీసీసీఐ ఈ ప్రకటన చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ లో టీంఇండియా తొలి టెస్టులో విజయం సాధించగా…రెండో టెస్ట్ వర్షార్పణం అయింది. ఇక మూడు, నాలుగు టెస్టులను వరుసగా గెలిచి సిరీస్ ను దక్కించుకుంది. ఈ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది బీసీసీఐ. టీంఇండియా సాధించిన బంపర్ విక్టరీకి రెండు కోట్ల రూపాయల నగదు పారితోషికాన్ని ఇవ్వనున్నట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. టెస్టులకు ఆదరణ తగ్గుతోందన్న వాదనలను తుడిచిపెట్టేందుకు, టెస్ట్ మ్యాచ్ లపై క్రేజ్ పెంచేందుకు బీసీసీఐ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సౌతాఫ్రికాపై  టీంఇండియా సాధించిన విజయంతో టెస్ట్ ర్యాంకింగ్ లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. టెస్ట్ సిరీస్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఢిల్లీలో లాస్ట్ పంచ్ మ‌న‌దే

నచ్చితే షేర్ చేయ్యండి

జిడ్డు గేమ్‌కు స్పిన్న‌ర్లు చెక్ పెట్టారు. స్ఫూర్తిదాయ‌క ఇన్నింగ్స్‌ల‌కు పుల్‌స్టాప్ పెట్టి..మ‌న‌కు అద్భుత విజ‌యాన్ని అందించారు. ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్ మొండిత‌నం ప్ర‌ద‌ర్శించిన వేళ‌..అంత‌కుమించిన ఆట‌తో మ‌నోళ్లు స్పిన్‌తో విక్ట‌రీని అందించారు. ఉమేష్ యాద‌వ్ ఫాస్ట్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థి తోక‌ను కంగారు పెట్టి..మ‌న ఫాస్ట్ బౌలింగ్ పంచ్ ప‌వ‌ర్‌ను లాస్ట్ టెస్ట్ లాస్ట్ రోజు చూపించాడు. ఎప్ప‌టిలాగే అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు. ఫ‌లితంగా టీమిండియా నాల్గు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో గెల్చుకుంది. నాల్గో రోజు ఆట‌నే ఐదో రోజు ప్ర‌ద‌ర్శించాల‌నుకున్న స‌ఫారీలు లంచ్ టైమ్ వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. అయితే, టీ బ్రేక్‌కు ముందు ఆ టీమ్ కాస్త త‌డ‌బ‌డ‌టం మ‌న బౌల‌ర్ల‌కు క‌లసివ‌చ్చింది. ఏబీ డివిలియ‌ర్స్ వికెట్ల ముందు పాతుకుపోవ‌డం కాస్త కంగారుపెట్టినా..టెయిలెండ‌ర్స్‌ను ఉమేష్ యాద‌వ్ ఒక్కొక్క‌రిగా వెన‌క్కి పంప‌డంతో స‌ఫారీల‌కు నిరాశే మిగిలింది. చివ‌రికి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తిప్పిన స్పిన్న‌ర్లు..స‌ఫారీ 112/5

నచ్చితే షేర్ చేయ్యండి

నాల్గో టెస్ట్ ఆస‌క్తిక‌రంగా మారింది. స‌ఫారీ ప్లేయ‌ర్స్ జిడ్డులా ఆడుతున్న వేళ‌..మ‌న స్పిన్న‌ర్లు బంతిని తిప్పారు. కీల‌క టైమ్‌లో వికెట్లు తీసి టీమ్‌ను ప‌టిష్ట‌స్థితిలో నిలిపారు. మ్యాచ్ ఐదో రోజు ఆరంభంలో హ‌షీమ్ ఆమ్లాను ఔట్ చేసిన జ‌డేజా, కాసేప‌టికే డూప్లిసిస్‌ను పెవిలియ‌న్ చేర్చాడు. వీరిద్ద‌రి ఔట్‌తో ఇబ్బందుల్లో ప‌డ్డ స‌ఫారీల‌ను అశ్విన్, డుమినీని పెవిలియ‌న్ చేర్చాడు. దీంతో స‌ఫారీ జ‌ట్టు 112 ప‌రుగుల‌కే 5కీల‌క వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ప్ర‌స్తుతం ఏబీ డివిలియ‌ర్స్ భార‌త బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాడు. అత‌నిపైనే స‌ఫారీ జ‌ట్టు ఆశ‌లు పెట్టుకుంది. ఇప్ప‌టికే 270కిపైగా బంతులు ఆడిన ఏబీ..భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొని మ‌రో రెండు గంట‌లు నిల‌బ‌డితే మ్యాచ్ డ్రాగా ముగియ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే, అది అంత ఈజీగా క‌నిపించ‌డం లేదు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

భార‌త్‌కు ప‌ట్టిన జిడ్డు వ‌దిలింది

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియాను కంగారెత్తించిన హ‌షీమ్ ఆమ్లా పెవిలియ‌న్ చేరాడు. నాల్గో రోజు మ‌న బౌల‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన ఆమ్లా, కీల‌క‌మైన ఐదో రోజు జ‌డేజాకు చిక్కాడు. ఈ సిరీస్‌లో తొలిసారి మ‌న‌కు ట‌ఫ్‌ఫైట్ ఇవ్వ‌డంలో కీ రోల్ ప్లే చేసిన స‌ఫారీలు, నాల్గో టెస్ట్‌పై తీవ్ర ఉత్కంఠ పెంచిన టైమ్‌లో హ‌షీమ్ ఆమ్లా మ‌న బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. అలాంటి ఆమ్లాను జ‌డేజా మ‌ళ్లీ ఔట్ చేశాడు. ఈ సిరీస్‌లో జ‌డేజా స్పిన్‌కు పూర్తిగా దాసోహ‌మైన ఆమ్లా..సుధీర్ఘ ఇన్నింగ్స్‌ను తెర‌దించాడు. హ‌షీమ్ ఆమ్లా 244 బంతులాడి 25ప‌రుగులు చేశాడు. వీటిలో 3ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ స‌ఫారీల్లో ఆత్మ‌విశ్వాసం నింపింది. చాలా కాలం త‌ర్వాత ఓ టెస్ట్ ఇన్నింగ్స్ గురించి అంద‌రూ డిబేట్ పెట్టుకునేలా చేసింది. ఆమ్లా త‌ర్వాత వ‌చ్చిన డూప్లిసిస్ కూడా అలాంటి ఆట‌తోనే మ‌నోళ్ల‌ను ప‌రీక్షించాడు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

లంచ్ టైమ్‌కి స‌ఫారీ 94/3

నచ్చితే షేర్ చేయ్యండి

నాల్గో టెస్ట్ ఐదోరోజు స‌ఫారీలు పోరాడుతున్నారు. మ‌న జ‌ట్టు బౌల‌ర్లు కంగారెత్తిస్తున్నా..అంత‌కుమించి స‌ఫారీలు స‌హ‌నంతో బ్యాటింగ్ చేస్తున్నారు. పిచ్ బౌలింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్నా..సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తెగువ చూపిస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌లో అస‌లైన ఆట‌ను పరిచ‌యం చేస్తున్నారు. ప‌రుగులు సాధించ‌డం క‌న్నా..బంతిని బ్యాట్‌తో క‌ట్ట‌డి చేసేందుకే ఎక్కువ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆమ్లా ఔటైనా..డివిలియ‌ర్స్‌, డూప్లిసిస్ పోరాటం చేస్తున్నారు. వీరిద్ద‌రూ 22ఓవ‌ర్ల‌కు పైగా ఆడి 18ప‌రుగులు జోడించారు. ప్ర‌స్తుతం మ‌రో రెండు సెష‌న్ల ఆట మిగిలి ఉంది. లంచ్ త‌ర్వాత టీ బ్రేక్‌కు ముందు స‌ఫారీ బ్యాట్స్‌మెన్ చూపించే తెగువ మ్యాచ్ ఫ‌లితాన్ని శాసించ‌నుంది. మ‌న బౌల‌ర్లు ఆ త‌ర్వాత రెచ్చిపోక‌పోతే, ఈ మ్యాచ్ డ్రాగా ముగియ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం డివిలియ‌ర్స్‌, డూప్లిసిస్ త‌మ‌లోని అత్యుత్త‌మ టెస్ట్ క్రికెట్‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

కంచు మోగించిన హాకీ టీమ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

హాకీ వ‌ర‌ల్డ్ లీగ్లో భార‌త్ అద్భుత విజ‌యం సాధించింది. కాంస్య పోరులో నాద‌ర్లెండ్స్‌తో జ‌రిగిన పోటీలో షుటౌట్‌లో మ‌నోళ్లు త‌డ‌బ‌డి నిల‌బ‌డ్డారు. హోరాహోరీగా జ‌రిగిన పోటీలో భార‌త్ తొలుత మ్యాచ్‌ను డ్రాగా ముగించి త‌ర్వాత షుటౌట్‌లో విజేత‌గా నిలిచింది. ఓ మేజ‌ర్ టోర్నీలో భార‌త్ చాలా కాలం త‌ర్వాత ఓ ప‌త‌కం సాధించింది. 33ఏళ్ల త‌ర్వాత మ‌నోళ్లు ఓ మోగా టోర్నీలో ప‌త‌కం గెల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు కెప్టెన్ స‌ర్థార్ సింగ్‌. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామ‌న్నాడు. మ్యాచ్ ఫ‌స్టాప్‌లో భార‌త్ 0-2తో వెనుక‌ప‌డింది. 39వ నిమిషంలో ర‌మ‌ణ్‌దీప్ ఫీల్డ్‌గోల్‌, 47వ నిమిషంలో రూపింద‌ర్ పెనాల్టీ కార్న‌ర్ గోల్‌తో భార‌త్ స్కోర్ స‌మం చేసింది. అయితే, అనుహ్యంగా చివ‌రి 10నిమిషాల్లో చెరో మూడు గోల్స్ చేయ‌డంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 5-5తో ముగిసిన మ్యాచ్ ప్ర‌తి ఒక్క‌రిని…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

విజ‌య్‌పై ఐసీసీ సీరియ‌స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా ఓపెన‌ర్ ముర‌ళీ విజ‌య్‌పై ఐసీసీ ఘాటుగా స్పందించింది. చివ‌రి టెస్ట్‌లో ముర‌ళీ విజ‌య్ ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఐసీసీ యాక్ష‌న్ తీసుకుంది. భ‌విష్య‌త్‌లో ఇలాంటివి జ‌రిగితే ప‌రిస్థితి మ‌రింత హాట్‌గా ఉంటుంద‌ని హెచ్చరించింది. ప్ర‌స్తుతానికి 30శాతం ఫీజులో కోత‌తో విజ‌య్‌ను ఫ‌నిష్ చేసింది. మ్యాచ్ జ‌రుగుతున్న టైమ్‌లోనే ఐసీసీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం చాలా మందిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే, ఇలాంటి విష‌యాల్లో తొంద‌ర‌గానే యాక్ష‌న్ ఉండాల‌ని ఐసీసీ మెంబ‌ర్ ఒక‌తను చెప్పాడు. నాల్గో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ముర‌ళీ విజ‌య్‌, మోర్నీ మోర్క‌ల్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ విలాస్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. అయితే, అస‌లు బాల్ బ్యాట్‌కు తాక‌లేద‌ని ముర‌ళీ అంపైర్‌కు స‌ర్థిచెప్పాడు. అదే టైమ్‌లో తీవ్ర అస‌హ‌నం అంపైర్‌పై వ్య‌క్తం చేశాడు. అయితే, అంపైర్ మాత్రం ఔట్ అనే దానికే క‌ట్టుబ‌డి ఉన్నాడు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More