ఎంపీ క‌విత‌ను క‌లిసిన‌ యంగ్ క్రికెట‌ర్లు

9
నచ్చితే షేర్ చేయ్యండి

భార‌త్ అండ‌ర్‌-16 జ‌ట్టు ప్రాబ‌బుల్స్‌కు ఎంపికైన ఇద్ద‌రు యంగ్ క్రికెట‌ర్ల‌ను నిజామాబాద్ ఎంపీ క‌విత అభినందించారు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని, దేశ‌కీర్తితో పాటు రాష్ట్రానికి పేరు తీసుకురావాల‌ని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని, స్కూల్ స్థాయి నుంచి ఆట‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తామ‌ని ఆమె చెప్పారు. తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ అధ్వ‌ర్యంలో ఎంపికైన క్రికెట‌ర్ల‌తో పాటు, కోచ్‌లు, సెక్ర‌ట‌రీలు ఎంపీని క‌లిశారు.

గ‌త మూడు నెల‌లుగా..క్యాట్ అధ్వ‌ర్యంలో స్కూల్‌స్థాయి క్రికెట్ పోటీల‌ను నిర్వ‌హించారు. వీటిలో స‌త్తాచాటిన విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ త‌న ప్ర‌తిభ‌ను క‌న‌ప‌ర్చారు. అంతేకాదు..ప్ర‌క‌టించిన 38ప్రాబ‌బుల్స్‌లో ఇద్ద‌రు తెలంగాణ‌కు చెందిన వారికి అవ‌కాశం ద‌క్కింది. హైద‌రాబాద్‌కు చెందిన శ్ర‌వ‌ణ్‌తో పాటు, ఖ‌మ్మం అంకుర్ అండ‌ర్‌-16 క్రికెట్ జ‌ట్టులో స్థానం ద‌క్కింది. ఇదే జ‌ట్టుకు మేనేజ‌ర్‌గా సునీల్ బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న క్యాట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts