దేవుడో…4బంతులేసి…92ప‌రుగులిచ్చాడు….

నచ్చితే షేర్ చేయ్యండి

ఇది కథ కాదు…ఆ మాట‌కొస్తే ఇలాంటి రియ‌ల్ స్టోరీ, రియల్ మ్యాచ్‌ను మీరు చూసి ఉండ‌రు. అంతేకాదు…అస‌లు ఇలా ఎలా సాధ్య‌మైంద‌నేది కూడా ఎవ‌రికి అర్థం కాకుండా ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. అంపైర్ త‌మ‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించాడ‌నే ఒకే ఒక్క కార‌ణంతో ఫీల్డింగ్ చేసిన మాయ‌జాలం వ‌ర‌ల్డ్ క్రికెట్‌లోనే అత్యంత చెత్త రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది. అంతేకాదు..ఫ్యాన్స్‌ను కూడా విస్మ‌యప‌రిచారు. అస‌లు ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితులో అంద‌రూ ప‌డిపోయారు.

డాకా సెకండ్ డివిజ‌న్ క్రికెట్ లీగ్‌లో ఆగ్జియం, లాల్‌మ‌టియ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లో ఈ ఇన్సిడెంట్ జ‌రిగింది. లాల్‌మ‌టియ జ‌ట్టుకు అంపైర్ నిర్ణ‌యాల‌న్నీ వ్య‌తిరేకంగా వ‌స్తుండ‌టంతో ఆ ఆట‌గాళ్లు తీవ్ర ఆగ్ర‌హ‌వేశాల‌కు లోన‌య్యాడు. బౌలింగ్‌కు దిగిన టైమ్‌లో ఏకంగా 15నోబాల్స్ వేశారు. 13వైడ్స్ వేశారు. ఈ వైడ్స్ కాస్త అన్నీ బౌండ‌రీలకు వెళ్లాయి. క‌రెక్ట్‌గా వేసిన 4బంతుల్లో బ్యాట్స్‌మెన్ 12ప‌రుగులు చేశాడు. ఫ‌లితంగా..కేవ‌లం 0.4 ఓవ‌ర్ల‌లోనే 92ప‌రుగుల టార్గెట్‌ను రీచ్ అయ్యింది.

టాస్ ప‌డ్డ త‌ర్వాత క‌నీసం బొమ్మా, బోరుసో ప‌డిందో కూడా చూడ‌కుండా అంపైర్ త‌మ‌ల్ని వేధించాడ‌ని, అప్పుడే ఈ మ్యాచ్ ఫిక్సైంద‌ని అర్థ‌మైంద‌ని లాల్‌మ‌టియ జ‌ట్టు ఆరోపించింది. అంపైర్ నిర్ణ‌యాలు అన్నీ వ్య‌తిరేకంగా రావ‌డంతో సీన్ టోట‌ల్‌గా అర్థ‌మై ఇలా చేశామ‌ని ఆ టీమ్ మేనేజ‌ర్ ప్ర‌క‌టించాడు. మొత్తానికి…వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఈ అన్‌ఫీషియ‌ల్ మ్యాచ్ కాస్త హీట్ పుట్టించింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts