కంగారు లేకుండా టీట్వంటీల్లో ఛేజింగ్ రికార్డ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియా ద‌డ‌ద‌డ లాడించింది. 244ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌, మ‌రో ఏడు బంతులు మిగిలి ఉండ‌గానే విజయం సాధించి, టీట్వంటీల్లో అత్య‌ధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన టీమ్‌గా రికార్డ్‌ల్లోకి ఎక్కింది. ఆ టీమ్‌కు ఓపెన‌ర్లు అదిరే ఆరంభాన్నిస్తే, మిడిలార్డ‌ర్ ఫించ్‌, మాక్స్‌వెల్‌, కివీస్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నారు. మార్టిన్ దుమ్మురేపే ఇన్నింగ్స్‌ అక్లాండ్‌లో జ‌రిగిన టీట్వంటీల్లో టాస్ గెలిచిన కివీస్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఆ టీమ్ ఓపెన‌ర్ మార్టిన్ గ‌ఫ్తిల్ మ‌రోసారి దుమ్మురేపే ఇన్నింగ్స్‌తో స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించాడు. కేవ‌లం 54బంతుల్లోనే 6ఫోర్లు, 9భారీ సిక్స‌ర్ల‌తో 105ప‌రుగులు చేశాడు. అత‌నికి తోడుగా, మున్రో 33బంతుల్లోనే 6ఫోర్లు, 6సిక్స‌ర్ల‌తో 76ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి దూకుడితో..కివీస్ 6వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగుల రికార్డ్ స్కోర్‌ని సాధించింది. ఛేజింగ్‌లో ఆసీస్ దూకుడు 244ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెన‌ర్లు వార్న‌ర్‌,…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

HCA TTLలో మ‌ల్లిక్ రికార్డ్ సెంచ‌రీ..జైశ్వాల్ చెడుగుడు ఇన్నింగ్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

మెద‌క్ మావ్‌రిక్స్ ఓపెన‌ర్ మ‌ల్లికార్జున్…హెచ్‌సీఏ తెలంగాణ టీట్వంటీ లీగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. కాక‌తీయ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌండ‌రీలైన్ హ‌ద్దుగా చెల‌రేగి దుమ్మురేపాడు. ఆరంభం నుంచే బౌల‌ర్ల‌పై దూకుడు ప్ర‌ద‌ర్శించిన మ‌ల్లిక్‌….అదే జోరును కొన‌సాగించి స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. టీటీఎల్ తొలి ఎడిష‌న్‌లో తొలి సెంచ‌రీని ఖాతాలో వేసుకోని అరుదైన రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అత‌ని ఆట‌తీరుకు, స్టేడియంలోని ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు, గ్రౌండ్‌లోని ప్లేయ‌ర్స్ కూడా చ‌ప్ప‌ట్ల వ‌ర్షం కురిపించారు. 52 బంతుల్లోనే 110 ర‌న్స్‌ మ‌ల్లికార్జున్, మ్యాచ్ ఆరంభంలోనే బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. భారీ సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో బెంబేలెత్తించాడు. క్రికెట్‌లోని అన్ని ర‌కాల షాట్స్ ఆడుతూ, స్కోర్‌కార్డ్‌కు వేగాన్ని రుచిచూపించాడు. ఏకంగా 8ఫోర్లు, 9సిక్స‌ర్లు 110ర‌న్స్ చేశాడు. అంటే బౌండ‌రీల రూపంలోనే 86ప‌రుగులు సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇదే తొలి సెంచ‌రీ. ప్ర‌స్తుతం మ‌ల్లికార్జున్ ఓవ‌రాల్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

స్పోర్ట్స్ కోటా మెడిక‌ల్ స్కామ్ క‌థ అట‌కెక్కిన‌ట్టేనా…? పార్ట్‌-1

నచ్చితే షేర్ చేయ్యండి

గ‌త మూడు నెల‌లుగా అంత‌టా హాట్‌టాపిక్‌గా మారిన‌, స్పోర్ట్స్ కోటా మెడిక‌ల్ స్కామ్ అట‌కెక్కిన‌ట్టే క‌నిపిస్తుంద‌నే ఉహ‌గానాలు జోరందుకున్నాయి. కాళోజి నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలో ఉన్న అన్ని కాలేజీల్లో మెడిక‌ల్ సీట్ల‌ను స్పోర్ట్స్ కోటాలో నిర్ణ‌యించిన తీరులో పెద్ద స్కామే జ‌రిగింద‌ని, ప్ర‌భుత్వం వేసిన క‌మిటీలో కూడా బ‌ట్ట‌బ‌య‌లైంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా ఇప్పుడు మ‌రో క‌మిటీ వేయ‌డం, మ్యాట‌ర్‌ను మ్యానేజ్ చేయ‌డానికేన‌నే కామెంట్స్‌కి చేరువ‌చేశాయి. అస‌లేంటి స్కాం…? 2017-18 విద్యాసంవ‌త్స‌రానికి గానూ, కాళోజి నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంలో మెడిక‌ల్ సీట్ల‌ను స్పోర్ట్స్ కోటాలో భ‌ర్తీ చేశారు. దీని కోసం రాష్ట్రానికి చెందిన శాట్స్ అధికారులు స్వ‌యంగా, విద్యార్థుల‌ను స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేసే క‌మిటీలో స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

అటు ర‌నౌట్లు…ఇటు లుంగీ డ్యాన్స్‌..

నచ్చితే షేర్ చేయ్యండి

ముచ్చ‌ట‌గా మూడు వ‌న్డేల్లో కలిసి ఫుల్ జోష్‌లో క‌నిపించిన మెన్ ఇన్ బ్లూకు, పింక్ డ్రెస్‌లో స‌ఫారీలు కొట్టిన దెబ్బ కోలుకోకుండా చేస్తోంది. కీల‌క‌మైన ఐదో మ్యాచ్‌లో కూడా స‌ఫారీల బౌలింగ్ ముందు, మ‌న బ్యాట్స్‌మెన్ చేతులేత్తేశారు. ఎప్ప‌టిలాగే, ధావ‌న్‌, కోహ్లీ దూకుడిగా ఆడితే, రోహిత్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు శ‌త‌కం సాధించాడు. అయితే, ప‌రోక్షంగా, ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్ ర‌నౌట్ కావ‌డంలో కీ రోల్ ప్లే చేశాడు. 40ఓవ‌ర్ల త‌ర్వాత మారిన సీన్‌ ఆరంభం నుంచి దూకుడిగా ఆడిన ఇండియా…40ఓవ‌ర్ల వ‌ర‌కు మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ప‌టిష్ట‌స్థితిలో నిలిచింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌తో పాటు, శ్రేయాస్ అయ్య‌ర్‌, హార్థిక్ పాండ్యా, ధోనీ ఇలా భారీ పించ్ హిట్ట‌ర్లు ఉన్నారు. అయితే, ఉహించ‌ని విధంగా, భార‌త్ కుప్ప‌కూలింది. నాల్గో వ‌న్డే స్ట‌యిల్లోనే పూర్తిగా డీలాప‌డింది. అస‌లేమాత్రం ఆక‌ట్టుకోలేని ఆట‌తీరుతో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మ‌ళ్లీ…రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు అత‌డే సైన్యం

నచ్చితే షేర్ చేయ్యండి

రెండేళ్ల విరామం త‌ర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, పూర్తిగా పాత‌స్ట‌యిల్లోనే ముందుకెళ్తోంది. జ‌ట్టు ఎంపిక‌లో పాత ప్లేయ‌ర్స్‌కే ప‌ట్టం క‌ట్టిన ఆ టీమ్‌, ఇద్ద‌రిని భారీ ధ‌ర‌కు ద‌క్కించుకోని అంత‌టా హాట్‌టాపిక్‌గా మారిన రాయ‌ల్స్‌, ఇప్పుడు మ‌రోసారి కోచ్ ఎంపిక‌లోనూ అలాంటి మ్యాజిక్కే చేసింది. మెంటార్‌గా షేన్‌వార్న్‌ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్‌గానే కాకుండా, కోచ్‌గా తొలి ఎడిష‌న్‌లో వ్య‌వ‌హ‌రించి, ఆ త‌ర్వాత మెంటార్‌గా ఫిక్సైపోయిన షేన్‌వార్న్‌ను, మ‌రోసారి మెంటార్‌గా నియ‌మిస్తూ ఆ టీమ్ ప్ర‌క‌ట‌న చేసింది. షేన్ వార్న్ యంగ్‌స్ట‌ర్స్‌ని ఆట‌కి సిద్ధం చేయ‌డంలో అద్భుతంగా ఉంటాడ‌ని, అత‌ని కెప్టెన్సీ క‌మ్ మెంటార్‌షిప్‌లోనే ర‌హానే, సంజూ శాంస‌న్‌, యూస‌ఫ్ ఫ‌ఠాన్ లాంటి ప్లేయ‌ర్స్ తెర‌పైకి వ‌చ్చార‌ని టీమ్ మేనేజ్‌మెంట్ కితాబిచ్చింది. షేన్‌వార్న్ కెప్టెన్సీలో జ‌ట్టుకు టైటిల్‌ వార్న్ కెప్టెన్సీలోనే రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఐపీఎల్ టైటిల్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నాగ‌ర్‌కోటికి రాజ‌స్తాన్ స‌ర్కార్ పావుకోటి

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా అండ‌ర్‌-19 ప్లేయ‌ర్ నాగ‌ర్‌కోటికి….రాజ‌స్తాన్ స‌ర్కార్ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం, అత‌నికి 25ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్టు అసెంబ్లీలో ప్ర‌క‌టించింది. అండ‌ర్-19 వ‌ర‌ల్డ్‌క‌ప్ భార‌త్‌ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పొషించిన నాగ‌ర్‌కోటి ప్ర‌తిభ‌ను, అంద‌రూ ప్ర‌శంసించారు. బ‌డ్జెట్ ప్రసంగంలో రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజే, నాగ‌ర్‌కోటిని ప్ర‌శంసించ‌డ‌మే కాకుండా, అత‌నికి ఈ మేర‌కు న‌జ‌రానా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. నాగ‌ర్‌కోటి తొలి మ్యాచ్ నుంచే అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. 140కిలోమీట‌ర్ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా, నాగ‌ర్‌కోటి ప‌దునైన బంతుల‌తో దూసుకెళ్లాడు. ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్‌ను కంగారుపెట్టాడు. అంతేకాదు, అత‌ని బౌలింగ్ ప్ర‌తిభ‌కు ముగ్దుడైన షారూఖ్ ఖాన్‌, ఆక్ష‌న్‌లో ఏకంగా 3.2కోట్లు ఇచ్చి అత‌న్ని కోనుగోలు చేశాడు. ఇప్ప‌టికే, అండ‌ర్‌-19టీమ్‌కు బీసీసీఐ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. అయితే, ఇప్పుడు రాష్ట్రాలు, రాష్ట్ర క్రికెట్ సంఘాలు, త‌మ ప్లేయ‌ర్స్‌పై ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నాయి. వాళ్లంద‌రూ క‌లిసి…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

శాట్స్ ఆధ్వ‌ర్యంలో టీఎస్ క్రీడాకారుల‌కు స‌న్మానం

నచ్చితే షేర్ చేయ్యండి

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకోని ఈ నెల 17న అథ్లెట్ల‌ను స‌న్మానించాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని శాట్స్ చైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ స్పోర్ట్స్ అభివృద్ధికి ముఖ్య‌మంత్రి క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, ఆయ‌న స్ఫూర్తిగా ముందుకెళ్తున్న శాట్స్‌, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ‌స్థాయిలో ప్ర‌తిభ చాటిన అన్ని విభాగాల క్రీడాకారుల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశంతో వాళ్ల‌ను స‌న్మానిస్తున్న‌ట్టు చెప్పారు. జాతీయ క్రీడాకారులంద‌రికి స‌త్కారం తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అన్ని ఆట‌ల్లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌ప‌రుస్తున్న ప్లేయ‌ర్స్‌ను స‌న్మానిస్తున్న‌ట్టు చైర్మ‌న్ చెప్పారు. ఇప్ప‌టికే, అప్లికేష‌న్లు స్వీక‌రించామ‌ని, అయితే, వారికి మ‌రికొంత స‌మ‌యం ఇచ్చేందుకు, ఈ నెల 16వ‌ర‌కు గ‌డువు తేదీని పొడిగించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. అంతేకాదు….17వ తేదీన‌, ఎంపీ క‌విత‌తో పాటు, క్రీడాశాఖ మంత్రి ప‌ద్మారావు అథ్లెట్ల‌ను స‌త్క‌రిస్తార‌ని ఆయ‌న…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

తాహీర్‌పై భార‌త అభిమాని జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు ..!

నచ్చితే షేర్ చేయ్యండి

సౌతాఫ్రికా లెగ్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహీర్‌పై నాల్గో వ‌న్డే సంద‌ర్భంగా ఓ అభిమాని జాతివివ‌క్ష వ్యాఖ్య‌లు చేశాడ‌నే వార్త‌లు ఇప్పుడు హాట్‌హాట్‌గా మారాయి. టీమ్‌లో 12వ ఆట‌గాడిగా ఉన్న తాహీర్‌, ప్లేయ‌ర్స్‌కు బ్రేక్ టైమ్‌లో వాట‌ర్ బాటిల్స్ అందించేందుకు వెళ్తుండ‌గా ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలుస్తోంది. ప‌లుమార్లు గ్రౌండ్‌లోకి వెళ్లే టైమ్‌లో, ఓ అభిమాని ప‌దే ప‌దే జాతి వివ‌క్ష వ్యాఖ్య‌ల‌తో ఇబ్బందిపెట్టాడ‌ని తాహీర్, స‌ఫారీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాడు. అస‌లేం జ‌రిగింది…? 12వ ఆట‌గాడిగా ఉన్న తాహీర్‌, ప్లేయ‌ర్స్‌కు వాట‌ర్ ఇచ్చి వ‌చ్చే టైమ్‌లో, ఇద్ద‌రు జాతివివ‌క్ష కామెంట్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. తాహీర్‌, ఫిర్యాదుపై విచార‌ణ చేప‌ట్టిన స‌ఫారీ టీమ్‌, అవి నిజ‌మేన‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రిలో ఒక‌వ్య‌క్తి భార‌తీయుడ‌ని, అత‌నే అన‌వ‌స‌రంగా నోరుపారేసుకున్న‌ట్టు స‌ఫారీ మీడియా చెబుతోంది. గ‌తంలోనూ ఇలాంటి అనుభ‌వం…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నెట్‌లో ధోనీ మ‌ళ్లీ మొద‌లెట్టేశాడు

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ, ఐదో వ‌న్డేకి ముందు నెట్‌లో కొత్త రోల్‌లో క‌నిపించాడు. చాలా సేపు లెగ్‌స్పిన్ వేస్తూ అంత‌టా ఆస‌క్తి పెంచాడు. పార్ట్ టైమ్ బౌల‌ర్ టీమ్‌లో లేక‌పోవ‌డం, ఐదో వ‌న్డేలో కూర్పు ఎలా ఉండాలో డైలమాలో ఉండ‌టంతో మ్యాచ్ ఫ‌లితంపై ఉహ‌గానాలు మొద‌ల‌య్యాయి. ఇలాంటి టైమ్‌లో ధోనీ, నెట్‌లో ప‌దే ప‌దే బౌలింగ్ చేస్తూ క‌నిపించ‌డం ఇప్పుడు ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. మిడిలార్డ‌ర్‌లో శ్రేయాస్‌కే చోటు కేదార్ జాద‌వ్ ప్లేస్‌లో టీమ్‌లోకి వ‌చ్చిన  శ్రేయాస్ అయ్య‌ర్‌, నాల్గో వ‌న్డేలో తీవ్రంగా నిరాశ‌ప‌ర్చాడు. ఇటు బ్యాట్‌తోనే కాకుండా, అటు ఫీల్డింగ్‌లోనూ అయ్య‌ర్ విఫ‌ల‌మ‌య్యాడు. అయితే, ఈ యంగ్‌స్ట‌ర్‌కి ఐదో వ‌న్డేలోనూ చోటు క‌ల్పించాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అలా చేయ‌డం వ‌ల్ల‌, కేదార్ జాద‌వ్ డ‌గౌట్‌కే ప‌రిమిత‌మ‌వుతాడు. అదే జ‌రిగితే, ధోనీని పార్ట్‌టైమ్…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

నొబాల్ వేశాడ‌ని ఆ సీనియ‌ర్ తిట్ల‌దండ‌కం మొద‌లెట్టాడు

నచ్చితే షేర్ చేయ్యండి

నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు తిరుగులేని, గూగ్లీ, లెగ్‌స్పిన్‌తో మ్యాజిక్ చేసిన చాహ‌ల్‌, ఇప్పుడు విల‌నయ్యాడు. నాల్గో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి చాహ‌ల్ వేసిన నోబాలే కార‌ణ‌మ‌ని ఇప్పుడు అంద‌రూ మండిప‌డుతున్నారు. ఫాస్ట్ బౌల‌ర్ నోబాల్ వేశాడంటే అర్థ‌ముంది, స్పిన్న‌ర్‌వి నీకేమైందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ్యాచ్ త‌ర్వాత శిఖ‌ర్ ధావ‌న్, ఈ నోబాల్ వ‌ల్లే ఓడామ‌నేలా మాట్లాడితే, ఏకంగా, ఆ నోబాల్ వ‌ల్లే టీమిండియా ఓడిందంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్క‌ర్ తీవ్ర‌స్థాయిలో చాహ‌ల్‌పై ధ్వ‌జ‌మెత్తాడు. చాహ‌ల్‌కు ఆ మాత్రం తెలియ‌దా…? డివిలియ‌ర్స్ ఔట్ త‌ర్వాత టీమిండియా విక్ట‌రీ క‌న్ఫార్మ్ అనుకున్నాన‌న్న గ‌వాస్క‌ర్‌, మిల్ల‌ర్ కూడా ఓట‌వ్వ‌డంతో ఆ జోష్ రెట్టింప‌యింద‌న్నాడు. అయితే, మిల్ల‌ర్ ఔటైన బాల్, నోబాల్ అని తెలియ‌డంతో తీవ్రంగా నిరాశ చెందాన‌ని…పదే, ప‌దే నోబాల్స్ వేయ‌డం తీవ్ర అస‌హ‌నానికి లోన‌య్యేలా చేసింద‌న్నాడు. ఆ…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More