ఈ ఆసీస్‌కు బుద్దిరాదు..సిగ్గులేదు..!

నచ్చితే షేర్ చేయ్యండి

ఎలుక తోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదన్నట్టు.. ఆసీస్ ఆటగాళ్ల తీరు కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది. వివాదాలకు ఆజ్యం పోయడం, ఆటగాళ్లను రెచ్చగొట్టడం వారికి బట్టర్ తో పెట్టిన విద్య. టీమిండియా సిరీస్ లోనూ వాళ్ల దుందుడుకు చర్యలు ఏమాత్రం మారలేదు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వెటకారపు చర్యలతో పలుచన అవుతున్నారు.

బెంగళూరు టెస్ట్ లో డీఆర్ ఎస్ వివాదం తర్వాత ఆటగాళ్లు వివాదాలకు దూరంగా ఉంటారని భావించారంతా. కానీ ఆసీస్ ఆటగాళ్లల్లో ఏమాత్రం మార్పు రాలేదు. రాంచీ టెస్ట్ లో ఆసీస్ రెండు సార్లు డీఆర్ ఎస్ కు వెళ్లి ఫెయిల్ అయింది. ఆ క్రమంలో కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో చప్పట్లు కొడుతూ కనిపించాడు. దీంతో భుజాలు తడుముకున్న అసీస్ ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూశారు. పూజారా కొట్టిన బౌండరీ ఆపే క్రమంలో మాక్స్ వెల్ స్వల్పంగా గాయపడ్డాడు.

బౌండరీ ఆపిన మాక్స్ వెల్ తెగ యాక్టింగ్ చేశాడు. గాయపడ్డ కోహ్లీ గ్రౌండ్ నుంచి వీడే క్రమంలో భుజం పట్టుకున్నట్టే.. అబ్బా నొప్పి అంటూ కోహ్లీీని ఇమిటేట్ చేశాడు మాక్స్ వెల్. కాస్త నవ్వు తెప్పించినా అసీస్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటలో అసీస్ ఆటగాళ్ల వికృత చేష్టలు కంపుకొడుతున్నాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts