కంగారు లేకుండా టీట్వంటీల్లో ఛేజింగ్ రికార్డ్‌

నచ్చితే షేర్ చేయ్యండి

ఆస్ట్రేలియా ద‌డ‌ద‌డ లాడించింది. 244ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌, మ‌రో ఏడు బంతులు మిగిలి ఉండ‌గానే విజయం సాధించి, టీట్వంటీల్లో అత్య‌ధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన టీమ్‌గా రికార్డ్‌ల్లోకి ఎక్కింది. ఆ టీమ్‌కు ఓపెన‌ర్లు అదిరే ఆరంభాన్నిస్తే, మిడిలార్డ‌ర్ ఫించ్‌, మాక్స్‌వెల్‌, కివీస్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నారు.

మార్టిన్ దుమ్మురేపే ఇన్నింగ్స్‌

అక్లాండ్‌లో జ‌రిగిన టీట్వంటీల్లో టాస్ గెలిచిన కివీస్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఆ టీమ్ ఓపెన‌ర్ మార్టిన్ గ‌ఫ్తిల్ మ‌రోసారి దుమ్మురేపే ఇన్నింగ్స్‌తో స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించాడు. కేవ‌లం 54బంతుల్లోనే 6ఫోర్లు, 9భారీ సిక్స‌ర్ల‌తో 105ప‌రుగులు చేశాడు. అత‌నికి తోడుగా, మున్రో 33బంతుల్లోనే 6ఫోర్లు, 6సిక్స‌ర్ల‌తో 76ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి దూకుడితో..కివీస్ 6వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగుల రికార్డ్ స్కోర్‌ని సాధించింది.

ఛేజింగ్‌లో ఆసీస్ దూకుడు

244ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెన‌ర్లు వార్న‌ర్‌, షార్ట్ అద‌ర‌గొట్టారు. తొలి వికెట్‌కు కేవ‌లం 8.3ఓవ‌ర్ల‌లోనే 121 ప‌రుగులు జోడించారు. వార్న‌ర్ 24బంతుల్లో 4ఫోర్లు, 5భారీ సిక్స‌ర్ల‌తో 59ప‌రుగులు చేస్తే, షార్ట్ 44బంతుల్లో 8ఫోర్లు, మూడు భారీ సిక్స‌ర్ల‌తో 76ప‌రుగులు చేసింది. మిడిలార్డ‌ర్‌లో మాక్స్‌వెల్ 14బంతుల్లో 31, ఫించ్ 14బంతుల్లో 36ర‌న్స్ చేయ‌డంతో ఆసీస్ మ‌రో ఏడు బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్‌ను ఛేధించింది.


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts