క్రికెట‌ర్ల‌కూ క‌బాలి ఫీవ‌ర్

నచ్చితే షేర్ చేయ్యండి

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌బాలి ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఇండియాలో ఆ సంగ‌తి చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు క్రికెట‌ర్ల‌కూ క‌బాలి ఫీవ‌ర్‌ ప‌ట్టుకుంది. వెస్టిండీస్ టూర్‌లో ఉన్న టీమిండియా క్రికెట‌ర్లు క‌బాలి సినిమాను చూడ‌లేక‌పోతున్నందుకు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెన్నైకి చెందిన అశ్విన్ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. స్వ‌త‌హాగా ర‌జ‌నీకాంత్‌కి పెద్ద ఫ్యాన్ అయిన అశ్విన్ క‌బాలి విడుద‌ల స‌మ‌యంలో చెన్నైలో లేనందుకు తెగ ఫీలైపోతున్నాడు.

విండీస్ టూర్‌లో ఉన్న విరాట్‌కోహ్లీ,  విజ‌య్‌, రాహుల్‌, ధావ‌న్‌, కోచ్ కుంబ్లేల ప‌రిస్థితి ఎలా ఉందో కూడా తెలుపుతూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు అశ్విన్‌. క‌బ‌డ్డీ ఆడాల్సిన ఓ ప్లేయ‌ర్ ఇంట్లో పూజా కార్య‌క్ర‌మం జ‌రిగితే మ్యాచ్ ఆడ‌లేక‌పోయాడ‌ట‌. ఇప్పుడు మా ప‌రిస్థితి కూడా అలాగే ఉంద‌ని దాన్ని తెలిపేలా ఓ ఫోటోను పోస్ట్ చేశాడు.

ఇక ఐపిఎల్‌లో  చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడిన రైనా ఇప్ప‌టికే సినిమా చూసేశాడు. సినిమా సూప‌ర్‌గా ఉందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇలా క్రికెట‌ర్లంతా క‌బాలి ఫీవ‌ర్‌తో ఊగిపోతున్నారు. త‌లైవానా.. మ‌జాకా ..!


నచ్చితే షేర్ చేయ్యండి

Related posts