దుమ్మురేపిన ధోనీ…సెంచూరీయ‌న్‌లో చెడుగుడు

నచ్చితే షేర్ చేయ్యండి

ధోనీ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. కీల‌క‌మైన మ్యాచ్‌లో, కీల‌క‌మైన టైమ్‌లో తిరుగులేని ఆట‌తీరుతో అద‌ర‌గొట్టాడు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా చివ‌రి బంతి వ‌ర‌కు మెరుగైన ఆట‌తీరుతో ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. అత‌ని ఆట‌తీరు అభిమానుల‌ను అల‌రించ‌డ‌మే కాదు, స్కోర్‌కార్డ్‌ను రెండు వంద‌ల‌కు చేరువ చేసింది. 28 బంతుల్లోనే 52 ప‌రుగులు ధోనీ ఆరంభంలో ఎప్ప‌టిలాగే నిదానంగా ఆడాడు. అయితే, ఆ త‌ర్వాత దూకుడు పెంచాడు. వ‌రుస‌గా మెరుగైన షాట్ల‌తో స్కోర్‌కార్డ్‌ను పరిగెత్తించాడు. మ‌నీష్ పాండేకు త‌గ్గ‌ట్టుగా బ్యాట్‌కు పనిచెప్పాడు. ఫ‌లితంగా, 28 బంతుల్లోనే నాల్గు ఫోర్లు, మూడు భారీ సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగులు చేశాడు. చివ‌రి పది ఓవ‌ర్ల‌లో భార‌త్ సాధించిన 102ప‌రుగుల్లో ధోనీవే స‌గం ప‌రుగులున్నాయంటే అత‌ని దూకుడు అర్థం చేసుకోవ‌చ్చు. చివ‌రి ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు టీమిండియా ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ దూకుడిగా ఆడాడు. తాను…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

మ‌నీష్ పాండే సూప‌ర్ ఇన్నింగ్స్‌

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా మిడిలార్డ‌ర్ యంగ్ బ్యాట్స్‌మెన్ మ‌నీష్ పాండే అద‌ర‌గొట్టాడు. అస‌లేమాత్రం త‌గ్గ‌కుండా భారీ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. స‌ఫారీల‌పై టాపార్డ‌ర్ కంగారుప‌డ్డ టైమ్‌లో మెరుగైన ఆట‌తీరుతో స్కోర్‌కార్డ్‌ను ప‌రిగెత్తించాడు. అత‌ను సాధించిన ప‌రుగులు ఇప్పుడు టీమ్ మెరుగైన స్థానంలో నిల‌బ‌డేలా మాత్ర‌మే కాదు, ఓ రేంజ్‌లో మ్యాచ్ ఫ‌లితాన్ని శాసించేలా చేశాయి. అంతేకాదు, మ‌నీష్ పాండే ఫామ్‌, ఫిట్‌నెస్ మ‌రోసారి నిరూపించుకున్నాడు. కోహ్లీ ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన మ‌నీష్ పాండే, నిల‌క‌డగా ఆడాడు. వికెట్ల మ‌ధ్య ప‌రిగెత్త‌డంలో దూకుడు ప్ర‌ద‌ర్శించిన మ‌నీష్ సురేష్ రైనాతో క‌లిసి నాల్గో వికెట్‌కు 45ప‌రుగులు జోడించాడు. రైనా ఔట‌య్యాకా కూడా అదే జోరును కొన‌సాగించిన మ‌నీష్ పాండే, అర్థ‌సెంచ‌రీతో టీమ్ స్కోర్‌ను వంద ప‌రుగులు దాటించాడు. అంతేకాదు, ధోనీతో క‌లిసి ఐదో వికెట్‌కు కీల‌క‌మైన భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసి, టీమ్‌ను రెండో…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సెంచూరీయ‌న్‌లో సౌతాఫ్రికా టార్గెట్‌ 189

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో టీమిండియా స‌ఫారీల ముందు ల‌క్ష్యాన్ని నిర్థేశించింది. ప్ర‌త్య‌ర్థి ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌, మ‌నీష్ పాండే అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆరంభంలో శిఖ‌ర్ ధావ‌న్‌, సురేష్ రైనా విలువైన ప‌రుగుల‌తో టీమ్‌ను ముందుకు న‌డిపించారు. చివ‌ర్లో ఎప్ప‌టిలాగే, యం. య‌స్ ధోనీ మ‌రోసారి త‌న‌దైన స్ట‌యిల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించాడు. దీంతో…టీమిండియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. క‌ల‌సొచ్చిన యూడీఆరెస్‌ నిజానికి..ఇన్నింగ్స్ ఫ‌స్ట్ బాల్‌కే ధావ‌న్ ఔట‌య్యాడు. అయితే, యూడీఆరెస్ తీసుకోవ‌డంతో నాటౌట్‌గా తేలిపోయింది. ఈ అవ‌కాశం త‌ర్వాత రెచ్చిపోయిన ధావ‌న్ వ‌రుస బౌండ‌రీల‌తో హోరెత్తించాడు. అయితే డుమినీ అతన్ని పెవిలియ‌న్ చేర్చాడు. ఈ టైమ్‌లో వ‌చ్చిన సురేష్ రైనా ఆచితూచి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. అత‌ను సాధించిన 31ప‌రుగులు టీమ్‌ను మిడిల్ ఓవ‌ర్స్‌లో కాస్త…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

సెంచూరీయ‌న్‌లో మ‌నీష్ పాండే అర్థ‌సెంచ‌రీ

నచ్చితే షేర్ చేయ్యండి

ఐపీఎల్ ఆక్ష‌న్‌లో 11కోట్లు ప‌లికిన మ‌నీష్ పాండే, ఆ లీగ్‌కంటే ముందే చెల‌రేగిపోయాడు. సెంచూరీయ‌న్‌లో, సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న టీట్వంటీలో 33 బంతుల్లో నాల్గు ఫోర్లు, రెండు భారీ సిక్స‌ర్ల‌తో అర్థ‌సెంచ‌రీ చేశాడు. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన టైమ్‌లో కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడి ఆక‌ట్టుకున్నాడు. ముందు రైనాతో కీల‌క భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసిన మ‌నీష్ పాండే, ఆ త‌ర్వాత అదే జోరును కొన‌సాగిస్తూ ధోనీతోనూ విలువైన పార్ట‌న‌ర్‌షిప్‌ను న‌మోదు చేశాడు. అత‌ని భారీ ఇన్నింగ్స్‌తో భార‌త్‌, రెండో టీట్వంటీలో మెరుగైన స్కోర్ దిశ‌గా వెళ్తోంది.

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

ఇటు ధావ‌న్‌, అటు రోహిత్ ఫ‌స్ట్‌బాల్‌కే ఔట్ కానీ…

నచ్చితే షేర్ చేయ్యండి

రెండో టీట్వంటీలో భార‌త్‌కు అదృష్టం క‌ల‌సివ‌చ్చింది. ఫ‌లితంగా…ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోవాల్సిన టీమ్ గ‌ట్టెక్కితే, సెంచ‌రీతో గాడిలో ప‌డ్డ‌ట్టు క‌నిపించిన రోహిత్ శ‌ర్మ‌, మ‌రోసారి నిరాశ‌ప‌ర్చాడు. అయితే, యూడీఆరెస్‌తో ధావ‌న్ గ‌ట్టెక్కితే, డాలా ఇన్‌స్వింగ‌ర్‌కి రోహిత్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఫ‌స్ట్‌బాల్‌కే ధావ‌న్ ఔట్‌ టాస్ ఓడి బ్యాటింగ్ చేప‌ట్టిన టీమిండియాకు ఫ‌స్ట్ బాల్‌కే వికెట్ కోల్పోయింది. క్రిస్ మోరిస్ వేసిన ఫ‌స్ట్ బాల్‌కే వికెట్ల ద‌గ్గ‌ర దొరికిపోయాడు. అయితే, ధావ‌న్ రివ్యూ కోర‌డం, రిప్లేలో బంతి, బ్యాట్‌ను తాకిన‌ట్టు క‌నిపించ‌డంతో ధావ‌న్ నాటౌట్‌గా ఇన్నింగ్స్‌ను కొన‌సాగించాడు. అయితే, ఆ భ‌యంతోనేమో కానీ ఆ ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగు కూడా తీయ‌లేదు. అయితే, త‌ర్వాత దూకుడు ప్ర‌ద‌ర్శించి 3ఫోర్లు, రెండు భారీసిక్స‌ర్ల‌తో 24ర‌న్స్ చేశాడు. అయితే, డుమినీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More