హైద‌రాబాద్‌కి ఐపీఎల్‌-10 బై…బై…?

నచ్చితే షేర్ చేయ్యండి

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ – 10 ఆరంభ వేడుకలపై సస్పెన్స్ కొనసాగుతుంది. హెచ్‌సీఏ సిబ్బంది, గ్రౌండ్స్‌మెన్‌ సమ్మె ప్రభావం ఆరంభోత్సవానికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. సిబ్బంది సమ్మెపై బెట్టు వీడకపోతే.. ఐపీఎల్ ఆతిథ్యంపై హైదరాబాద్ ఆశలు వదులుకోవాల్సిందే. అటు సమ్మె ఎఫెక్ట్ తో ఏర్పాట్లను గ్రాండ్ గా చేయాలని భావించిన ఈవెంట్‌ నిర్వాహక సంస్థ ఐఎంజీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వచ్చే నెల 5న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఒక రోజు ముందు ఐపీఎల్‌-10 ఆరంభోత్సవం ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభ వేడుకలు ఉప్పల్‌ స్టేడియంలోనే జరగాలి. ప్రారంభోత్సవానికి తక్కువ చాలా తక్కువ టైమ్ ఉంది. ఇప్పటి వరకు ఉప్పల్‌ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. ఐఏంజీ, సన్ రైజర్స్ సిబ్బంది స్వయంగా వెళ్లి సిబ్బందితో మాట్లాడినా…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వీళ్లిద్ద‌రూ కొట్టుకునుడే త‌క్కువ‌…!

నచ్చితే షేర్ చేయ్యండి

భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో పరస్పర ఆరోపణలు.. వాగ్వాదాలు.. హేళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరు టెస్టులో తలెత్తిన ‘డీఆర్‌ఎస్‌’ వివాదం తర్వాత ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్ల కెప్టెన్లను పిలిచి సంయమనంతో వ్యవహరించాలని సూచించినప్పటికీ.. రాంచీ టెస్టులో వివాదాలు ఆగలేదు. ఈ మ్యాచ్‌లో కోహ్లి గాయపడటంపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎగతాళిగా సంజ్ఞలు చేయడం.. కోహ్లి కూడా వారికి అదే తీరులో సమాధానం చెప్పడం తెలిసిందే. ఈ గొడవ మైదానాన్ని దాటి విలేకరుల సమావేశం వరకూ వెళ్లింది. తన భుజం గాయానికి చికిత్స చేసిన జట్టు ఫిజియో పాట్రిక్‌ ఫర్హర్ట్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు హేళన చేశారని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరోపించాడు. ‘‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురైదుగురు అదే పనిగా పాట్రిక్‌ పేరు ఎత్తడం గమనించాను. అలా ఎందుకో తెలియదు. అతను మా ఫిజియో. నాకు చికిత్స చేయడం…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More