టీమిండియా ఓడిపోయినా నో ప్రాబ్ల‌మ్ కానీ…

నచ్చితే షేర్ చేయ్యండి

ఔను, మ‌న జ‌ట్టు ఎప్పుడూ గెల‌వాల‌ని నేను కోరుకోను. ఆ మాట‌కొస్తే ఓడిపోవాల‌ని ఆశించ‌ను. కానీ, ఈ రెండింటిని తెలియ‌జేసే ఫైటింగ్ స్పిరిట్ అనేది ఒక‌టి ఉంటుంది క‌దా, రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా భ‌లే ఫైట్ చేశారురా అనుకునే మాట అది మాత్రం అంద‌రి నోట విన‌బ‌డాలి. అంతేకాదు.. ఎంత‌సేపు ప‌క్కొడిని తిప్ప‌డం కాదు..మ‌న‌మూ కూడా తిరుగుతున్నాం, వాళ్లు తిప్పేస్తున్నారు అనే ఆలోచ‌న‌లోకి రావాలి. ఇంట్లో కాల‌ర్ ఎగ‌రేయ‌డ‌మే కాదు లుంగీ లేకుండా కూడా డ్యాన్స్ చేస్తాం..అదే రోడ్డు మీద గుడ్డ ముక్క ప‌క్క‌కు జ‌రిగినా అవ‌మానంగా ఫీల‌వుతావు. ఇప్పుడు కావాల్సింది అదే..గుడ్డ ముక్క కూడా ప‌క్క‌కు జ‌ర‌గ‌కుండా కాల‌ర్ ఎగ‌రేయ‌డం. తొలి టెస్ట్‌లో ఓడిన‌ప్పుడు అంద‌రూ పిచ్‌ను తిట్టారు. క్యూరేట‌ర్‌పైన కారాలు, మిరియాలు నూరారు. ఆ మ్యాచ్‌లో ఓకీఫ్‌ వికెట్లు తీస్తే బై ల‌క్ అన్నారు.…

నచ్చితే షేర్ చేయ్యండి
Read More

వీడియో : తొలి రోజు భార‌త వికెట్లు ట‌పా ట‌పా

నచ్చితే షేర్ చేయ్యండి

టీమిండియా రెండో టెస్ట్‌లోనూ త‌డ‌బ‌డింది. లంచ్ వ‌ర‌కు నిల‌క‌డ‌గానే క‌నిపించినా, న‌థ‌న్ ల‌య‌న్ స్పిన్‌కు కుప్ప‌కూలింది. టీ బ్రేక్ త‌ర్వాత కూడా ల‌య‌న్ భార‌త బ్యాట్స్‌మెన్‌ను కంగారెత్తించాడు. ఫ‌లితంగా…టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 189ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది, ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ సొంత‌గ‌డ్డ‌పై మెరుగైన స్కోర్ సాధించి జ‌ట్టుకు ఆ మాత్రం స్కోరైనా ద‌క్కేలా చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఇలా వ‌చ్చి అలా వెళ్లారు. ల‌య‌న్ ఒక్క‌డే 8వికెట్లు తీసి మ‌నోళ్ల‌ను ఆటాడుకున్నాడు. తొలి మ్యాచ్‌లో స‌త్తాచాటిన ఓకీఫ్‌, ఈ మ్యాచ్‌లో పూర్తిగా త‌డ‌బ‌డ్డా, ల‌య‌న్ మాత్రం అద్భుత‌మైన బౌలింగ్‌తో క‌ట్ట‌డి చేశాడు. భార‌త తొలి ఇన్నింగ్స్ వీడియో బీసీసీఐ స‌హ‌కారంతో క్రింద ఇవ్వ‌బ‌డిన‌వి చూడ‌గ‌ల‌రు courtesy : BCCI    

నచ్చితే షేర్ చేయ్యండి
Read More